భర్త కాదు కూతురితో సమస్య.. బయటపడుతున్న నిజాలు | Singer Kalpana Issue With Her Daughter, Know Reason Behind Singer Tragic Incident | Sakshi
Sakshi News home page

Singer Kalpana: సింగర్ ఆత్మహత్యాయత్నం.. అసలు కారణం ఇదా?

Published Wed, Mar 5 2025 10:05 AM | Last Updated on Wed, Mar 5 2025 3:35 PM

Singer Kalpana Issue With Her Daughter

ప్రముఖ సింగర్ కల్పన ఆత్మహత్య చేసుకోవడం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. నిద్రమాత్రలు ఎక్కువ మోతాదులో తీసుకోవడంతో అపస్మారక స్థితిలో ఉన్న ఈమెని.. ఇంటి తలుపులు బద్దలుగొట్టి పోలీసులు రక్షించారు. నిజాంపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఈమె ఆరోగ్యం నిలకడగా ఉంది.

(ఇదీ చదవండి: ఒకప్పటి హీరోయిన్ లైలాకు వింత వ్యాధి!)

ఈ సంఘటనలో కల్పన భర్త ప్రసాద్ ని ఇప్పటికే హైదరాబాద్ కేపీహెచ్ బీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే అసలు నిజాలు బయటపడ్డాయి. రోజూ వేసుకునే జోల్ ఫ్రెష్ అనే నిద్రమాత్రల్ని ఎక్కువ మోతాదులో వేసుకున్నారని, మంగళవారం సాయంత్రం 4:30 గంటలకు కల్పనకు భర్త ప్రసాద్ ఫోన్ చేయగా.. ఎంతకీ లిఫ్ట్ చేయకపోవడంతో విల్లా సెక్రటరీకి ప్రసాద్ కాల్ చేసి విషయం చెప్పారు. దీంతో ఆయన పోలీసులకు సమాచారం అందివ్వగా.. కల్పనని రక్షించి ఆస్పత్రిలో చేర్పించారు.

ప్రస్తుతం కల్పన ఆరోగ్యం నిలకడగా ఉంది. కాస్త కోలుకున్న తర్వాత ఈమె దగ్గర నుంచి పోలీసులు స్టేట్ మెంట్ రికార్డ్ చేనున్నారు. అయితే మంగళవారంనాడు కల్పన.. కేరళలో ఉంటున్న తన కూతురితో మాట్లాడిందని, హైదరాబాద్ వచ్చేయమని చెప్పగా కూతురు రానని చెప్పడంతో పాటు ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతోనే కల్పన ఇలా ఆత్మహత్యాయత్నం చేసుకుందట. కల్పనని పోలీసులు విచారించిన తర్వాత అసలేం జరిగిందనేది క్లారిటీ వస్తుంది.

(ఇదీ చదవండి: పెళ్లికి ముందే విడాకులు.. హైదరాబాద్‌ అబ్బాయితో తమన్నా కటిఫ్‌)

Singer Kalpana: కూతురి వల్లే ఆత్మహత్య యత్నం.. వెలుగులోకి షాకింగ్ నిజాలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement