
టాలీవుడ్ సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం చేసుకోవడం చర్చనీయాంశమైంది. సరైన సమయంలో స్పందించిన పోలీసులు ఈమెని ఆస్పత్రిలో చేర్పించడంతో పరిస్థితి కుదుటపడింది. కల్పన ఆరోగ్యం కూడా నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు.
(ఇదీ చదవండి: భర్త కాదు కూతురితో సమస్య.. బయటపడుతున్న నిజాలు)
కల్పన ఆత్మహత్య యత్నంపై పోలీసులు తొలుత ఆమె భర్తని అనుమానించారు. మంగళవారం సాయంత్రం ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. కానీ కూతురితో జరిగిన వాగ్వాదం వల్లే కల్పన ఇలా చేశారనే విషయం ఒకటి బయటకొచ్చింది. ఇప్పుడు మీడియాతో మాట్లాడిన కల్పన కూతురు.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
'నా తల్లి కల్పన ఆత్మహత్యాయత్నం చేయలేదు. డాక్టర్స్ సూచన మేరకు జోల్ ఫ్రెష్ మాత్రలు తీసుకుంటుంది. మాత్రలు ఎక్కువ మోతాదులో తీసుకోవడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లారు. మా కుటుంబంలో ఎలాంటి గొడవలు లేవు. హైదరాబాద్ లో మా అమ్మ లా పీజీ చేస్తోంది. మానసిక ఒత్తిడితో నిద్రలేమికి గురవుతూ ఉండేది' అని కల్పన కూతురు చెప్పుకొచ్చింది.

(ఇదీ చదవండి: సింగర్ కల్పనకు ఏమైంది? పోలీసుల అదుపులో భర్త)