బిగ్‌బాస్: సింగర్‌పై వేటు.. యువహీరో ఎంట్రీ! | singer kalpana out from bigg boss | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్: సింగర్‌పై వేటు.. యువహీరో ఎంట్రీ!

Published Mon, Aug 14 2017 10:29 AM | Last Updated on Sun, Sep 17 2017 5:31 PM

బిగ్‌బాస్: సింగర్‌పై వేటు.. యువహీరో ఎంట్రీ!

బిగ్‌బాస్: సింగర్‌పై వేటు.. యువహీరో ఎంట్రీ!

బిగ్‌బాస్ వీకెండ్‌ ఎపిసోడ్‌లో మరోసారి ఎలిమినేషన్‌ ప్రక్రియ రక్తికట్టింది. ఇప్పటికే ఈ షో నుంచి మహేశ్‌ కత్తి ఎలిమినేట్‌ అవ్వగా.. ఆదివారం నాటి ఎపిసోడ్‌లో సింగర్‌ కల్పన కూడా ఇంటి దారి పట్టారు.  ఈ వారం బిగ్‌బాస్‌ నుంచి ఇద్దరు ఎలిమినేట్‌ అవ్వగా.. యువ హీరో నవదీప్ వైల్డ్‌కార్డు ఎంట్రీ ఇచ్చి ఆశ్చర్యపరిచాడు.

ఎలిమినేషన్‌ జోన్‌లో ఈ వారం చివరివరకు దీక్ష, హరితేజ, కల్పనలు ఉండగా.. వీరిలో సింగర్‌ కల్పనను ప్రేక్షకుల తీర్పు మేరకు బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి పంపివేస్తున్నట్టు హోస్ట్‌ జూనియర్ ఎన్టీఆర్‌ ప్రకటించాడు.  మంచి గాయనిగా పేరొందిన కల్పన వెళ్తూ .. వెళ్తూ.. తనదైన టాలెంట్‌తో ఆకట్టుకున్నారు. బిగ్‌బాస్‌లోని తోటి సభ్యులను ఉద్దేశించి పాటలు పాడుతూ, ఇమిటేట్ చేస్తూ కడుపుబ్బా నవ్వించారు. ఇక, తన అంచనా ప్రకారం బిగ్ బాస్ టైటిల్‌ ప్రిన్స్ గెల్చుకునే అవకాశం ఉందని కల్పన తెలిపారు. హౌస్‌లో డబుల్ మైండ్ ఎవరికి ఉంది అని ఎన్టీఆర్ అడుగగా.. ధనరాజ్‌ అని బదులిచ్చారు.

ఇప్పటికే బిగ్ బాస్ హౌస్‌లోకి దీక్షను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వగా.. తాజాగా యువ హీరో నవదీప్ హౌజ్‌లోకి ప్రవేశించాడు. బిగ్‌బాస్‌ హౌజ్‌లో ఉన్న మొమైత్‌ఖాన్‌ ఇప్పటికే డ్రగ్స్‌ కేసులో సిట్ విచారణను ఎదుర్కొన్నారు. సిట్‌ విచారణ కోసం బిగ్‌బాస్‌ నిర్వాహకులు స్వయంగా ఆమె వెంట వచ్చారు. ఇప్పుడు డ్రగ్స్‌ కేసులో సిట్‌ విచారణ ఎదుర్కొన్న మరో నటుడు నవదీప్‌ బిగ్‌బాస్‌ హౌజ్‌లోకి ఎంట్రీ ఇవ్వడం పలువురిని ఆశ్చర్యపరిచింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement