
ప్రముఖ సింగర్ కల్పన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తాజాగా ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.‘సింగర్ కల్పన నిద్ర మాత్రలు మింగారు. ఆమె ఊపిరితిత్తుల్లో నీరు చేరడంతో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నాం. కల్పనకు ఇన్‌ఫెక్షన్ ఉండటం వల్ల ఆక్సిజన్ అందిస్తున్నాం. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది’’ అని వైద్యులు తెలిపారు.
ఏం జరిగింది?
హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీలోని విల్లాలో ఉంటున్న కల్పన మంగళవారం సాయంత్రం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. రెండు రోజుల క్రితం చెన్నై వెళ్లిన భర్త ప్రభాకర్..మంగళవారం ఉదయం కల్పనకు ఫోన్ చేశాడు. ఆమె ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో కంగారుపడిన ఆయన అసోషియేషన్ ప్రనినిధులకు విషయం చెప్పాడు. వాళ్లు 100కి డయల్ చేసి పోలీసులకు చెప్పారు. ఇంటి తలుపులు తీసేందుకు పోలీసులు ప్రయత్నించగా..అది ఫలించలేదు. దీంతో ఇంటి వెనకవైపు ఉన్న కిచెన్ గది తలుపులు తెరచి ఇంట్లోకి ప్రవేశించారు. మొదటి అంతస్తులో కల్పన అపస్మారక స్థితిలో పడిపోయి ఉంది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు.
(చదవండి: భర్తతో కాదు కూతురుతో సమస్యలు..బయటపడుతున్న నిజాలు!)
కారణం ఏంటి?
కల్పన ఆత్మహత్యాయత్నానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కేరళకు చెందిన మొదటి భర్తతో కలిగిన కూతురుతో ఆమెకు విభేధాలు ఉన్నట్లు తెలుస్తోంది. కూతుర్ని హైదరాబాద్‌కి రమ్మని కోరగా..ఆమె నిరాకరించారట. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి కల్పన నిద్ర మాత్రలు మింగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పోలీసులు ఈ దిశగానే విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. కల్పన వాగ్మూలాన్ని నేడు రికార్డు చేయనున్నారు.

Comments
Please login to add a commentAdd a comment