
ఛత్రపతి శివాజీ తనయుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ బయోపిక్‌గా రూపొందిన హిందీ చిత్రం ‘ఛావా’(Chhaava Movie). విక్కీ కౌశల్ టైటిల్ రోల్‌లో నటించారు. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో యేసుబాయి భోంస్లే పాత్రను రష్మికా మందన్న పోషించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 14న హిందీలో విడుదలైంది. ఈ నెల 7న తెలుగులో గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్స్ సంస్థ రిలీజ్ చేస్తోంది.
ఈ సందర్భంగా నిర్మాత ‘బన్నీ’ వాసు(Bunny Vasu) మాట్లాడుతూ– ‘‘ఛావా’ హిందీలో ఎంత పెద్ద ప్రభంజనం సృష్టించిందో ఆందరికీ తెలుసు. అంత మంచి సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్నందుకు గర్వపడుతున్నాం. భాష ఏదైనా మంచి సినిమా అయితే తెలుగులో తీసుకురావడానికి మా గీతా ఆర్ట్స్ ముందుంటుంది. ఇక ‘ఛావా’ చివరి 25 నిమిషాలు ఇండియా మొత్తం కన్నీళ్లు పెట్టించింది. అద్భుతమైన క్యాలిటీతో తెలుగులో డబ్ చేశాం. ఈ చిత్రం తెలుగులోనూ ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment