
ప్రెగ్నెన్సీ, స్మెర్మ్ కౌంట్ లాంటి పదాల గురించే మాట్లాడుకోవడానికే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాం. అలాంటిది ఈ తరహా కాన్సెప్ట్ తో మూవీ తీయడం తక్కువే. తెలుగులో ఒకటి రెండు చిత్రాలతో ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు 'సంతాన ప్రాప్తిరస్తు' పేరుతో మరో సినిమా రాబోతుంది.
(ఇదీ చదవండి: ఓటీటీలో 'మార్కో'.. అసలు ముద్దాయి సెన్సార్ బోర్డ్!)
ఇంజినీరింగ్ జాబ్ చేసే ఓ కుర్రాడు.. ప్రేమించి ఓ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. తీరా అతడి స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉందని వైద్యపరీక్షల్లో తేలుతుంది. అంటే పిల్లలు పుట్టే అవకాశం తక్కువని డాక్టర్స్ చెబుతారు. స్పెర్మ్ కౌంట్ పెంచుకునేందుకు వైద్యుల సలహాలు, డైట్ ఫాలో అవుతూ వంద రోజుల్లో తన భార్యను ప్రెగ్నెంట్ చేయాలని ప్రయత్నాలు మొదలుపెడతాడు హీరో. చివరకు ఏమైందనే అసలు కథ. టీజర్ చూస్తే ఇదే అనిపించింది.
ఇది సెన్సిటివ్ విషయమే కానీ దీన్ని ఎంటర్ టైనింగ్ గా చెప్పినట్లు తెలుస్తోంది. విక్రాంత్, చాందిని చౌదరి హీరోహీరోయిన్లుగా నటించారు. సంజీవ్ రెడ్డి దర్శకుడు. ప్రస్తుతం టీజర్ రిలీజ్ చేశారు. త్వరలో రిలీజ్ వివరాలు ప్రకటిస్తారు.
(ఇదీ చదవండి: పెళ్లికి ముందే విడాకులు.. హైదరాబాద్ అబ్బాయితో తమన్నా కటిఫ్)
Comments
Please login to add a commentAdd a comment