
తెలుగులో ఎన్నో పాటలు పాడి గుర్తింపు తెచ్చుకున్న సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం చేసుకుంది

ప్రస్తుతం ఈమెని హైదరాబాద్ నిజాంపేటలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు

ప్రస్తుతం ఈమె భర్తని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు

సరే ఈ విషయాలన్నీ పక్కనబెడితే ఇంతకీ కల్పన ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి?

చెన్నైలో టీఎస్ రాఘవేంద్ర, సులోచన దంపతులకు పుట్టింది. తల్లిదండ్రులు కూడా సింగర్సే

ఇంట్లో సంగీత వాతావరణం వల్ల ఐదేళ్లకే కల్పన కూడా సింగర్ అయిపోయింది. 'కుటుంబం' సినిమాలో తొలిపాట పాడింది

అప్పటినుంచి ఇప్పటివరకు దాదాపు 1500కి పైగా పాటలు పాడింది. 3000కు పైగా షోలు చేసింది

సింగర్‌గానే కాదు నటిగానూ కల్పన రాణించింది. బాలనటిగా ముప్పైకి పైగా సినిమాల్లో యాక్ట్ చేసింది

మూడేళ్లకే 'ఈనాడు' అనే మలయాళ చిత్రంలో.. తెలుగులో బాలకృష్ణ 'సీతారామ కల్యాణం'లోనూ కల్పన నటించింది

ఏఆర్ రెహమాన్, ఇళయారాజా, ఎస్పీ బాలు, కేవీ మహదేవన్, చిత్ర లాంటి స్టార్ సింగర్స్ తో కలిసి పాటలు పాడింది

ఇప్పుడే కాదు గతంలోనే అవకాశాలు తగ్గిపోవడంతో ఆత్మహత్య చేసుకుందామని అనుకుంది. కానీ సింగర్ చిత్ర సర్దిచెప్పడంతో ఊరుకుంది

అలా సింగర్ చిత్ర చెప్పడంతో స్టార్ సింగర్ మలయాళం షోలో పాల్గొని విజేతగా నిలిచింది

తెలుగులో బిగ్ బాస్ షో తొలి సీజన్ లోనూ పాల్గొంది. కానీ తొలివారమే ఎలిమినేట్ అయిపోయింది

ఈమె భర్త ప్రసాద్. ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో నివాసముంటోంది

ఏదేమైనా ఇలా ఆత్మహత్యాయత్నం చేసుకోవడం మాత్రం ఇండస్ట్రీకి షాకే

