ఐరాసలో ఐశ్వర్య భరతనాట్యం | Aishwaryaa Dhanush to perform Bharatanatyam at UN headquarters New York | Sakshi
Sakshi News home page

ఐరాసలో ఐశ్వర్య భరతనాట్యం

Published Fri, Mar 3 2017 9:40 PM | Last Updated on Tue, Sep 5 2017 5:06 AM

ఐరాసలో ఐశ్వర్య భరతనాట్యం

ఐరాసలో ఐశ్వర్య భరతనాట్యం

న్యూయార్క్‌:
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వచ్చే వారం న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కూతురు ఐశ్వర్య భరతనాట్యం ప్రదర్శించనున్నారు. ప్రస్తుతం ఆమె భారత్‌లో మహిళా సాధికారత, లింగ సమానత్వం కోసం ఐరాస తరఫున కృషిచేస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న ఈ కార్యక్రమం నిర్వహిస్తామని ఐరాసలో భారత శాశ్వత రాయబారి అయిన సయ్యద్‌ అక్బరుద్దీన్‌ ట్వీట్‌ చేశారు.

మహిళాదినోత్సవం రోజున ఐరాసలో నృత్యంచేసే అవకాశంరావడం గర్వంగా ఉందని ఐశ్వర్య పేర్కొన్నారు. దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత ఆమె మళ్లీ నాట్య ప్రదర్శన చేయనున్నారు. ప్రస్తుతం ఈ కార్యక్రమం కోసం ఆమె తనదైన రీతిలో రిహార్సల్ చేస్తున్నారు. తమిళ హీరో ధనుష్‌ సతీమణి అయిన ఐశ్వర్య ఇటీవల ‘స్టాండింగ్‌ ఆన్‌ యాన్‌ ఆపిల్‌ బాక్స్‌: ద స్టోరీ ఆఫ్‌ ఏ గర్ల్‌ అమాంగ్‌ ది స్టార్స్‌’ అనే పుస్తకం రాశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement