Man Wears Ghungroo Performs Amazing Bharatanatyam Dance, Video Viral On Social Media - Sakshi
Sakshi News home page

Bharatanatyam Viral Video: వావ్‌.. అంకుల్‌ స్టెప్పులిరగదీశాడు కదా..!

Published Tue, Jun 29 2021 11:17 AM | Last Updated on Fri, Jul 2 2021 8:03 PM

Man Wears Ghungroo Performs Amazing Bharatanatyam Dance - Sakshi

సరదాగానో, ఇంట్లో ఎవరు లేనప్పుడో, పెళ్లిల్లు, ఇతర ఫంక్షన్లలో డ్యాన్స్‌ చేయడం కామన్‌. కానీ సంప్రదాయ నృత్యం చేయడం అంత సులభం కాదు. ముఖ్యంగా భరత నాట్యం, కూచిపుడి వంటి డ్యాన్స్‌లు చేయడం చాలా కష్టం.. అది కూడా ఆ నృత్యాలకు సంబంధించిన వస్త్రాలు ధరించి. కానీ ఇక్కడ ఉన్న వీడియో చూస్తే మీరు ఆశ్చర్యతో నోరు వెళ్లబెడతారు. మాములుగా భరతనాట్యం డ్రెస్‌ ధరించి.. డ్యాన్స్‌ చేయడానికి ఆడవారే కాస్త ఇబ్బంది పడతారు. అలాంటిది ఓ పురుషుడు భరతనాట్యం డ్రెస్‌ ధరించి.. ఎంతో అందంగా నృత్యం చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. 

సుశాంత్‌ నంద అనే ఐఎఫ్‌ఎస్‌ అధికారి తన ట్విట్టర్‌లో షేర్‌ చేసిన ఈ వీడియోలో ఓ వ్యక్తి పైన చొక్క, కింద భరతనాట్యం డ్రెస్‌ ధరించి ఉన్నాడు. ఇక అతడు ఎంతో అద్భుతంగా.. చాలా సులభంగా.. అందంగా భరతనాట్యం చేశాడు. ఈ వీడియో చూసిన వారంతా ప్రతి ఒక్క స్టెప్‌ కూడా ఎంతో అందంగా, క్లియర్‌గా చేశారు.. అద్భుతమైన డ్యాన్సర్‌ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజనులు. 

చదవండి: పాపం ప్యాంటు తడిసిపోయి ఉంటుంది; వీడియో వైరల్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement