ఒకప్పుడు మనలో ఎంత టాలెంట్ ఉన్నా.. దాన్ని నిరూపించుకోవాలంటే అదృష్టం, అవకాశం కోసం ఎదురు చూడాల్సి వచ్చేది. లక్కు బాగలేకపోతే జీవితాంతం గుర్తింపు దక్కెది కాదు. అయితే ప్రస్తుతం ఈ పరిస్థితులు మారాయి. నీలో టాలెంట్ ఉంటే చాలు.. దానికి గుర్తింపు ఇవ్వడానికి సోషల్ మీడియా రెడీగా ఉంటుంది. మనలోని అద్భుతమైన స్కిల్స్‌తో ప్రేక్షకులను అలరించడానికి.. గుర్తింపు పొందడానికి సోషల్ మీడియా ఎంతో ఉపయోగపడుతుంది. ఇందుకు సంబంధించిన ఉదాహరణలు గతంలో ఎన్నో చూశాం.
తాజాగా ఈ కోవకు చెందిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. చూసిన వారంత ఇదేలా సాధ్యమయ్యింది అని ప్రశ్నిస్తున్నారు. సదరు డ్యాన్సర్ ప్రతిభను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. దర్శకుడు శిరీష్ కుందర్ షేర్ చేసిన ఈ వీడియోలో ఓ మహిళా డ్యాన్సర్ స్టేజీ మీద డ్యాన్స్ చేస్తూనే డ్రెస్ మార్చుకుని అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది.
ఈ వీడియోలో తొలుత ఓ మహిళా డ్యాన్సర్ మిరిమిట్లు గొలిపే నీలం రంగు డ్రెస్ ధరించి వేదిక దగ్గరకు వస్తుంది. ఆమె డ్రెస్ చూసిన పార్టనర్ ఇద్దరి డ్రెస్‌లు మ్యాచింగ్ కాలేదని నిరాశకు గురవుతాడు. కానీ సదరు మహిళా డ్యాన్సర్ ఇవేం పట్టించుకోకుండా అతడిని స్టేజీ మీదకు తీసుకెళ్తుంది. ఆ తర్వాత వారి డ్యాన్స్ ప్రదర్శన ప్రారంభమవుతుంది. ఇలా రెండు మూడు మూవ్‌మెంట్లు పూర్తయిన తర్వాత సదరు మహిళా డ్యాన్సర్ ఒంటి మీద డ్రెస్ మారిపోతుంది.
ప్రదర్శనకు ముందు నీలం రంగు డ్రెస్‌లో కనిపించిన మహిళ ఒంటి మీదకు సడెన్‌గా గోల్డ్ అండ్ బ్లాక్ కలర్‌లో ఉన్న డ్రెస్ వచ్చి చేరుతుంది. సెకన్ల వ్యవధిలో.. అది కూడా స్జేజీ మీద సదరు మహిళా డ్యాన్సర్ తన డ్రెస్ ఎలా మార్చుకుందనే విషయం మాత్రం ఎంతకి అంతుబట్టడం లేదు.
చదవండి: ఒక్క వీడియోతో ఆటో డ్రైవర్‌కు సినిమా చాన్స్
ఈ సంఘటన ఎక్కడి జరిగింది.. సదరు డ్యాన్సర్ పేరు ఏంటి అనే వివరాలు తెలియలేదు. ఇక ఈ వీడియో చూసిన నెటిజనులు ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మిమ్మల్ని పొగడటానికి మాటలు రావడం లేదు అంటూ ప్రశంసిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment