చాలామంది వివిధ కళలు నేర్చుకోవాలనుకుంటారు. కొన్ని కారణాల రీత్యా సాధ్యం కాకపోవచ్చు. మరికొందరూ వయసు మీదపడ్డ దాన్ని వదలక ఎలాగైనా నేర్చుకోవాలని తపన పడుతుంటారు. అలాంటి కోవకు చెందని వారే ఈ ముగ్గురు తల్లులు. నాలుగు పదుల వయసులో ఏ మాత్రం సంకోచించకుండా భరతనాట్యం నేర్చుకునేందుకు ముందుకు రావడమేగాక శభాష్ అనే రేంజ్‌లో ప్రదర్శనలు ఇచ్చారు. ఎవరంటే ఆ ముగ్గురు..
నలభైల వయసులో ఉన్న ముగ్గుర మహిళలు ఏ మాత్రం సంకోచించకుండా కోరమంగళలోని నృత్య స్కూల్ ఆఫ్ ఆర్ట్‌లో జాయిన్ అయ్యి భరతనాట్యం నేర్చుకున్నారు. అంత ఏజ్‌లో ఉన్నామన్నా.. బిడియాన్ని పక్కన పెట్టిమరీ తమకిష్టమైన కళపై దృష్టిసారించారు ఆ ముగ్గరు తల్లులు. గురువు గాయత్రి చంద్రశేఖర్ మార్గదర్శకత్వంలో అద్భుతమైన మెళుకవలు నేర్చుకున్నారు. వాళ్లేవరంటే....తమిళనాడుకి చెందిన లక్ష్మీ రమణి, సుమన్ వెలగపూరి, రాజస్థాన్‌కి చెందిన మోనికా లధాలు..
ముగ్గుర మదర్స్‌లో ఒకరు కుటుంబాన్ని, మిగతా ఇద్దరూ ప్రొఫెషన్‌ని పక్కన పెట్టి మరీ కళకు అంకితమై నేర్చుకున్నారు. ఆ ముగ్గరు తల్లలు బెంగళూరులోని బ్రూక్‌ఫీల్డ్స్ ప్రాంతంలోని సీఎంఆర్‌ఐటీ ఆడిటోరియంలో ప్రదర్శనలు ఇచ్చారు. ఆ వేదికపై ముగ్గురు తల్లులు సోలో, సంయుక్త ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది. వాళ ప్రదర్శన అనంతరం అక్కడి హాల్ అంతా కరతాళ ధ్వనులతో మారుమ్రోగిపోయింది. ఈ ఏజ్‌లో ఇంత బాగా ప్రదర్శన ఇస్తున్నా ఆ ముగ్గరు ఎవ్వరూ.. అని అందరిలో తీవ్ర ఆసక్తి నెలకొంది. ప్రదర్శన అనంతరం ఒక్కొక్కరిగా తమ నేపథ్యం వివరిస్తూ..ముందుగా తమిళనాడుకు చెందిన లక్ష్మీ రమణి (44) మైక్ పట్టుకుని మాట్లాడుతూ..తన కలను సాకారం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించిన అత్తగారి గురించి చెబుతూ కన్నీరుమున్నీరుగా విలపించింది.
ఇక మరో తల్లి సుమన్ వెలగపూడి(47) క్లౌడ్‌లో కస్టమర్ సర్వీస్ వైస్ ప్రెసిడెంట్‌గా కెరీర్‌ని విడిచిపెట్టి మరీ భరతనాట్యం నేర్చుకుంది. తనకు డ్యాన్స్‌పై ఉన్న మక్కువతో కొన్నాళ్లు పార్ట్ టైంగా నేర్చుకున్నాని, ఆ తర్వాత ఇక పూర్తిగా దీనికే టైం కేటాయించాలని ఉద్యోగాన్ని వదిలేశానని చెప్పుకొచ్చింది సమన్. పెద్ద కార్పోరేట్ ఉద్యోగాన్ని వదిలేయడం పెద్ద సాహసమే అయినప్పటికీ, అందుకు సహకరించిన తన కుటుంబ సభ్యులకు ఎంతగానో రుణపడి ఉంటానాని భావోద్వేగంగా మాట్లాడింది. ఇక చివరిగా రాజస్థాన్‌కి చెందని 46 ఏళ్ల మోనికా లధా ఓ పక్కన భరతనాట్యం నేర్చుకుంటూనే ఫైనాన్షియల్ అడ్వైజర్‌గా పనిచేసేది. చిన్న కుమార్తె ఈ చార్టర్ అకౌంటెంట్.
ఆమె కూడా దక్షిణా భారత శాస్త్రీయ నృత్యాన్ని అభ్యసించడం విశేషం. ఎందుకంటే రాజస్తాన్ వాళ్లు ఉత్తరాది శాస్తియ నృత్యమైన కథక్‌ని అభ్యసిస్తుంటారు. ఇక మోనిక తనకు డ్యాన్స్ అంటే బాగా ఇష్టమని, భరతనాట్యం లాంటివి నేర్చుకోవాలన్నిది తన ప్రగాఢ కోరిక అని చెప్పుకొచ్చింది. ఈ విషయంలో తన భర్త వివేక్ లధా ఇచ్చిన ప్రోత్సాహన్ని మరవలేనదని ఉద్వేగంగా చెప్పింది. ఇక గురువు గాయత్రీ దేవి మాట్లాడుతూ, ఆ మహిళల ప్రదర్శనను చూసి స్ఫూర్తి పొందానని చెప్పారు. క్రమశిక్షణ, నేర్చుకోవాలన్న తపనా ఉంటే ఏదైనా సాధ్యమే అని అన్నారు. ఈ ముగ్గురు తమ కళా నైపుణ్యంతో వయసు కేవలం నెంబర్ మాత్రమే అని ప్రూవ్ చేసి చూపించారు. నిజంగా మన భారతీయ కళలు ఎంతో గొప్పవి కదూ. అవి ఎంతటి విద్యా వంతుడిని, అధికారినైనా ఆకర్షించి నేర్చుకునేలా చేస్తాయి.
(చదవండి: పైథాని చీరలో అదిరిపోతున్న నీతా అంబానీ..ఆ చీర స్పెషల్ ఏంటంటే..!)
Comments
Please login to add a commentAdd a comment