అమెరికాలో మరో భారతీయుడి దారుణ హత్య | Indian Classical Dancer Amarnath Ghosh Shot Dead In US, His Friend Seeks Delhi Help - Sakshi
Sakshi News home page

Classical Dancer Amarnath Ghosh: అమెరికాలో నృత్య కళాకారుడి దారుణ హత్య

Published Sat, Mar 2 2024 9:59 AM | Last Updated on Sat, Mar 2 2024 11:58 AM

Dancer Amarnath Ghosh Shot Dead in US - Sakshi

ప్రముఖ భరతనాట్య, కూచిపూడి కళాకారుడు అమర్‌నాథ్ ఘోష్ అమెరికాలో జరిగిన కాల్పులకు బలయ్యాడు. ఈ విషయాన్ని టీవీ నటి దేవోలీనా భట్టాచార్జీ సోషల్ మీడియాలో తెలిపారు. అమర్‌నాథ్ ఆమెకు స్నేహితుడు. అతని మృతదేహాన్ని భారత్‌కు తీసుకురావడానికి సహాయం చేయాల్సిందిగా అమెరికాలోని భారత రాయబార కార్యాలయం, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, ప్రధాని నరేంద్ర మోదీలకు దేవోలీనా విజ్ఞప్తి చేశారు.

అమర్‌నాథ్ మృతికి సంబంధించిన సమాచారాన్ని దేవోలీనా భట్టాచార్జీ సోషల్ మీడియాలో షేర్‌ చేశారు. ‘మంగళవారం (ఫిబ్రవరి 27) సాయంత్రం, మిస్సోరిలోని సెయింట్ లూయిస్‌లో నా స్నేహితుడు అమర్‌నాథ్ ఘోష్ హత్యకు గురయ్యారు. అమర్‌నాథ్ తన చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయారు. తల్లి మూడేళ్ల క్రితం కన్నుమూశారు. అమర్‌నాథ్ మృతికి గల కారణాలు తెలియరాలేదు. అమర్‌నాథ్ కోల్‌కతాకు చెందినవారు. పీహెచ్‌డీ చేస్తూ, నృత్యంతో అద్భుతంగా రాణిస్తున్నారు. ఆయన ఈవినింగ్ వాక్ చేస్తుండగా, గుర్తు తెలియని దుండగులు అకస్మాత్తుగా ఆయనపై కాల్పులు జరిపారు. అమెరికాలోని అతని స్నేహితులు అమర్‌నాథ్ మృతదేహాన్ని భారత్‌కు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన ఎలాంటి సమాచారం ఇంకా పూర్తిస్థాయిలో అందలేదు. భారత రాయబార కార్యాలయం అమర్‌నాథ్ ఘోష్ హత్యకు గల కారణాన్ని తెలుసుకోవాలని’ ఆమె కోరారు.
 

అమర్‌నాథ్ హత్యకు చికాగోలోని భారత రాయబార కార్యాలయం సంతాపం తెలిపింది. కాగా ఇటీవలి కాలంలో అమెరికాలో నివసిస్తున్న భారతీయులు, భారత సంతతికి చెందిన పలువురు హత్యకు గురయ్యారనే  వార్తలు వినిపిస్తున్నాయి. కాగా దేవోలీనా భట్టాచార్జీ ట్వీట్‌కు పలవురు తమ స్పందనలు తెలియజేస్తున్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement