బాలాదేవీ చంద్రశేఖర్
లండన్: ప్రముఖ భరతనాట్య కళాకారిణి, పరిశోధకురాలు బాలాదేవీ చంద్రశేఖర్ తన ప్రదర్శన ద్వారా చరిత్ర సృష్టించనున్నారు. గురువారం ఆమె పారిస్‌లోని యునెస్కో(ఐక్యరాజ్యసమితి విద్యా, శాస్త్ర, సాంస్కృతిక మండలి)లో వివిధ దేశాలకు చెందిన 100 మంది సమక్షంలో ‘బృహదీశ్వర’ అంశంపై భరతనాట్య ప్రదర్శన ఇవ్వనున్నారు.
‘ఇది చాలా అరుదైన ప్రదర్శన. భారతీయ ప్రాచీన కట్టడాలపై ఆసక్తి కలిగించేందుకు, మన దేశం, సంస్కృతులపై అవగాహన పెంచేందుకు ఈ ప్రదర్శన ఉపయోగపడుతుంది’ అని బాలాదేవి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ప్రాంతాల్లో కూడా ‘బృహదీశ్వర’ ప్రదర్శన ఇవ్వనున్నట్లు వివరించారు. తమిళనాడులోని తంజావూరులో ఉన్న బృహదీశ్వరాలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తించింది.
Comments
Please login to add a commentAdd a comment