శ్రీలీలని ఇలా ఎప్పుడూ చూసుండరు.. వీడియో వైరల్ | Actress Sreeleela Classical Dance Performance In Samatha Kumbh 2024, Video Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Sreeleela Classical Dance Video: చాన్నాళ్ల తర్వాత మళ్లీ శ్రీలీల అలా.. ఫ్యాన్స్ ఫిదా

Published Sat, Mar 2 2024 3:03 PM | Last Updated on Sat, Mar 2 2024 3:39 PM

Sreeleela Dance Performance In Samatha Kumbh 2024 - Sakshi

శ్రీలీల పేరు చెప్పగానే డ్యాన్సులే గుర్తొస్తాయి. ఈ విషయంలో మిగతా హీరోయిన్లతో పోలిస్తే ఈమె టాప్‌లో ఉంటుంది. ఇప్పుడు ఈ డ్యాన్సుల వల్ల ఈమెని ట్రోల్ కూడా చేశారు. కానీ అవన్నీ పక్కనబెడితే చాలా ఏళ్ల తర్వాత శ్రీలీలలో మళ్లీ పాత అమ్మాయి కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. 

(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ థ్రిల్లర్ మూవీ.. తెలుగు స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?)

అమెరికాలో పుట్టిన తెలుగు మూలులున్న అమ్మాయి శ్రీలీల. చిన్నతనంలో భరతనాట్యం నేర్చుకుంది. అప్పట్లో ఈమె ఫెర్ఫార్మ్ చేసింది. ఆ వీడియో ఇప్పటికీ యూట్యూబ్‌లో ఉంది. కావాలంటే సెర్చ్ చేసి చూడొచ్చు. ఇక సినిమాల్లోకి వచ్చిన క్లాస్ డ్యాన్సులు పక్కనబెట్టి మాస్ డ్యాన్సులు చేయడం షురూ చేసింది. దీంతో పాత శ్రీలీలని చాలామంది మిస్ అయ్యారు.

తాజాగా హైదారాబాద్‌లో సమతా కుంభ్ కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా శ్రీలీల.. గోదా దేవి వేషధారణలో క్లాసికల్ డ్యాన్స్ చేసింది. దాదాపు 10 నిమిషాల పాటు నాన్‌స్టాప్‌గా ఫెర్ఫార్మ్ చేసింది. ఆ వీడియో దిగువనే ఉంది. మీరు కూడా దీనిపై ఓ లుక్కేసేయండి.

(ఇదీ చదవండి: అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్.. ఆ తెలుగు హీరోకి మాత్రమే ఆహ్వానం!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement