
తెలుగు చిత్ర పరిశ్రమలో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్‌గా దూసుకెళుతున్నారు శ్రీలీల(SreeLeela). ఇప్పటికే అరడజను సినిమాలతో బిజీ బిజీగా ఉన్న ఈ బ్యూటీ తొలిసారి ఓ లేడీ ఓరియంటెడ్ మూవీలో నటించనున్నారని టాక్. అది కూడా హిట్ మూవీ ‘మంగళవారం’(mangalavaram movie sequel) సీక్వెల్‌లో అట. అజయ్ భూపతి దర్శకత్వంలో పాయల్ రాజ్‌పుత్ లీడ్ రోల్‌లో నటించిన చిత్రం ‘మంగళవారం’. 2023 నవంబరు 17న విడుదలైన ఈ చిత్రం హిట్‌గా నిలిచింది.
ప్రత్యేకించి పాయల్ రాజ్‌పుత్ నటనకి మంచి మార్కులే పడ్డాయి. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘మంగళవారం 2’ రూపొందనుంది. అయితే ద్వితీయ భాగంలో తాను లీడ్ రోల్‌లో నటించడం లేదంటూ పాయల్ రాజ్‌పుత్ ఇన్‌డైరెక్ట్‌గా చెప్పారట. సీక్వెల్‌లో పూర్తిగా కొత్త కథ ఉంటుందని, అందుకే పాయల్ రాజ్‌పుత్ కాకుండా మరో హీరోయిన్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించే ఆలోచనలో అజయ్ భూపతి ఉన్నారని సమాచారం.
సీక్వెల్ కథకి శ్రీలీల అయితే సరిగ్గా సరిపోతుందన్నది ఆయన ఆలోచన అని ఫిల్మ్‌నగర్ టాక్. అయితే ‘మంగళవారం 2’ గురించి శ్రీలీలతో ఆయన చర్చిం చారా? లేదా? ఈ మూవీకి ఆమె పచ్చజెండా ఊపుతారా? లేదా వంటి విషయాలపై అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడక తప్పుదు. శ్రీలీల ప్రస్తుతం తెలుగులో నితిన్ ‘రాబిన్ హుడ్’, రవితేజ ‘మాస్ జాతర’, పవన్ కల్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’, తమిళంలో శివ కార్తికేయన్‌తో ‘పరాశక్తి’ మూవీ చేస్తున్నారు.