26 నుంచి నగరంలో ‘నిత్య నృత్య-2014 | 26 out of the city 'eternal dance -2014 | Sakshi
Sakshi News home page

26 నుంచి నగరంలో ‘నిత్య నృత్య-2014

Published Mon, Sep 22 2014 3:10 AM | Last Updated on Sat, Sep 2 2017 1:44 PM

26 నుంచి నగరంలో ‘నిత్య నృత్య-2014

26 నుంచి నగరంలో ‘నిత్య నృత్య-2014

సాక్షి, బెంగళూరు : నగరానికి చెందిన నూపుర స్కూల్ ఆఫ్ భరతనాట్యం ఆధ్వర్యంలో ఈనెల 26 నుంచి నగరంలో డ్యాన్స్ ఫెస్టివల్‌ను నిర్వహించనున్నారు. ‘నిత్య నృత్య-2014’ పేరిట నిర్వహించనున్న ఈ డ్యాన్స్ ఫెస్టివల్ ఈనెల 26 నుంచి 28 వరకు కొనసాగుతుందని నూపుర స్కూల్ ఆదివారమిక్కడ ఓ ప్రకటన లో వెల్లడించింది.

నగరంలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడ్రన్ ఆర్ట్స్, రవీంద్ర కళాక్షేత్ర, చౌడయ్య మెమోరియల్ హాల్‌లో ఈ డ్యాన్స్ ఫెస్టివల్‌ను నిర్వహించనున్నట్లు తెలిపింది. భరతనాట్యం, ఒడిస్సీ, మోహినీఆట్టం తదితర నృత్యరీతులను ఈ డ్యాన్స్ ఫెస్టివల్‌లో తిలకించేందుకు కళాప్రియులను అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొంది. ప్రముఖ నృత్యకారులు గోపికా వర్మ, మధులిత మహాపాత్ర, గాయత్రీ శ్రీరామ్, రుక్మిణీ విజయ్‌కుమార్‌లు ఈ డ్యాన్స్ ఫెస్ట్‌లో తమ ప్రదర్శనలు ఇవ్వనున్నారని వెల్లడించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement