dance festival
-
విజయవాడ : సిద్ధార్థ కళాశాలలో ఉత్సాహంగా నృత్యోత్సవం 2024 (ఫొటోలు)
-
యాదాద్రిలో మెట్ల నృత్యోత్సవం
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి జన్మ నక్షత్రం స్వాతిని పురస్కరించుకొని భావనాలయ నాట్యాచార్యుడు డాక్టర్ వట్టికోట యాదగిరిచార్యులు, ఆయన శిష్య బృందం ఆదివారం మెట్ల నృత్యోత్సవం నిర్వహించాయి. మొదట శ్రీస్వామి వారి వైకుంఠద్వారం వద్ద మెట్ల పూజను నిర్వహించారు. అనంతరం మెట్లపై నృత్యం చేస్తూ కొండపైకి వెళ్లారు. కొండపైన తూర్పు రాజగోపురం వద్ద కుంభ నీరాజనంతో కార్యక్రమాన్ని ముగించారు. యాదాద్రి వైభవాన్ని నలు దిశలా చాటేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వట్టికోట యాదగిరిచార్యులు స్పష్టం చేశారు. -
సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటుదాం
కంటోన్మెంట్: దేశ సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పాల్సిన అవసరం ఉందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. పర్యాటక, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో బోయిన్‌పల్లిలోని దివ్యాంగ్జన్లో నిర్వహించిన ‘వందే భారతం 2023’ నృత్యోత్సవ్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రధాని మోదీ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా ఉన్న భిన్న సంస్కృతుల వైభవాన్ని కాపాడే ప్రయత్నం ముమ్మరం చేశామన్నారు. అందులో భాగంగానే రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొనే కళాకారుల ఎంపిక కోసం నృత్యోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. సాంస్కృతిక శాఖ నాగ్‌పూర్ ఆధ్వర్యంలో తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్ర ప్రదేశ్, చత్తీస్ఘడ్ రాష్ట్రాల కళాకారుల మధ్య పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇందులో ఉత్తమంగా రాణించిన వారికి డిసెంబర్ 6న నాగ్‌పూర్‌లో జోనల్ స్థాయి పోటీలు, అందులోనూ రాణించిన వారికి ఢిల్లీలో నిర్వహించే జాతీయ పోటీలకు ఎంపిక చేస్తామన్నారు. జాతీయ స్థాయిలో ఉత్తమంగా రాణించిన కళాకారులకు వచ్చే ఏడాది జనవరి 25 వరకు ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించి, రిపబ్లిక్ డే పరేడ్‌లో ప్రదర్శనలు జరిపే అవకాశం కల్పిస్తామన్నారు. జీ–20 సమావేశాల్లోనూ ప్రదర్శనలు వచ్చే ఏడాది డిసెంబర్ 1వ తేదీ నుంచి 2024 నవంబర్ 30వ తేదీ వరకు దేశంలో 250 జీ–20 దేశాల సమావేశాలు జరుగుతాయని కిషన్‌రెడ్డి వెల్లడించారు. ఈ సమావేశాల్లో అన్ని ప్రాంతాల సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తామన్నారు. దివ్యాంగ్జన్లో నిర్వహించిన పోటీల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, చత్తీస్ఘడ్, మహరాష్ట్రలకు చెందిన కళాకారుల ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కేంద్ర సాహిత్య పురస్కార గ్రహీత రాకేశ్ తివారీ, కళైమామణి రాజేశ్వరి సాయినాథ్, పొట్టి శ్రీరాములు వర్సిటికీ చెందిన కళాకారులు కట్టా హరినాథ్ రావు, వనజా ఉదయ్, కథక్ కళాకారులు పండిట్ అంజిబాబులను సన్మానించారు. -
జాతీయ నృత్యోత్సవం.. మురిపించిన ‘జానపదం’
-
బీచ్‌రోడ్డులో కనుల పండువగా గిరిజన నృత్యోత్సవం (ఫొటోలు)
-
నృత్యం.. విశ్వవ్యాప్తం..
-
‘తెలుపే’ సెన్సేషన్!
హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి డ్యాన్స్ ఈవెంట్ * గచ్చిబౌలి స్టేడియంలో నేడు ‘వైట్ సెన్సేషన్’ * ఎటు చూసినా కేవలం ‘తెలుపు’ వర్ణమే సాక్షి, హైదరాబాద్: ఎటు చూసినా తెల్లని తెలుపు. కళ్లు జిగేల్మనిపించే లైటింగ్. అబ్బురపరిచే సెట్టింగులు. వీటన్నింటికీ మించి అదిరిపోయే సంగీత, నృత్య ప్రదర్శనలు... ఇదంతా ‘వైట్ సెన్సేషన్’. ప్రపంచంలోనే పేరెన్నికగన్న ఈ డ్యాన్స్ ఈవెంట్ శనివారం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియం వేదికగా ఉర్రూతలూగించనుంది. ఈ సెన్సేషన్ గురించిన కొన్ని విశేషాలు... నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డామ్‌లో ‘వైట్ సెన్సేషన్’ ఊపిరిపోసుకుంది. ఇప్పుడు దాదా పు 33 దేశాలకు విస్తరించింది. ఆసియా ఖం డంలోనే తొలిసారిగా ఇప్పుడు భారతదేశంలో అడుగుపెట్టింది. బెంగుళూరు, ముంబై, ఢిల్లీ వంటి నగరాలు పోటీపడినా ఈ ఈవెంట్‌ను హైదరాబాద్ దక్కించుకుంది. ఈ ఈవెంట్‌కు దాదాపు 20 వేల మంది హాజరవుతారని భావి స్తున్నట్లు హైదరాబాద్‌లో దీన్ని నిర్వహిస్తున్న వయోలా ఈవెంట్స్ నిర్వాహకుడు విజయ్ అమృత్‌రాజ్ చెప్పారు. మరో నాలుగేళ్ల పాటు దీన్ని ఏటా ఫిబ్రవరిలో నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ వేడుకతో గచ్చిబౌలి స్టేడియం మొత్తం డ్యాన్స్ఫ్లోర్గా మారిపోతుందని అభివర్ణించారు. అధికారికంగా నిర్వాహకులు వెల్లడించనప్పటికీ ఈ ఈవెంట్‌కు కనీసం రూ.10 కోట్లు వ్యయం అవుతుందని అంచనా. ఊగే వేదిక... ఉత్తేజమే కానుక ఈవెంట్‌కు అవసరమైన పరికరాలను ఆమ్స్టర్డామ్ నుంచి 13 కంటెయినర్లలో హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. మొత్తం తమ పరికరాలే తప్ప స్థానికంగా లభించేవి ‘వైట్ సెన్సేషన్’ కోసం వినియోగించరు. దాదాపు 5 నెలల పాటు 30 మంది ఇంజనీర్లు శ్రమించి, షో డిజైనింగ్, వేదిక నిర్మాణం కోసం శ్రమించారు. ‘పైరో డిజైన్’లో రకరకాల పొగలు ఒకేసారి వెదజల్లేలా ఏర్పాట్లు చేశారు. 800కిపైగా ఎల్ఈడీ లైట్లు అమర్చారు. ఈవెంట్ వేదిక 360 డిగ్రీల కోణంలో సందర్శకుల మధ్యలో ఉంటుంది. ఇది నిమిషానికి మూడు సార్లు తిరుగుతూ ఉంటుంది. ఇందులో పాల్గొనే 20 మంది డ్యాన్సర్లు భారతీయులే. వారిని గత కొన్ని నెలలుగా పోటీ నిర్వహించి ఎంపిక చేశారు. ఇక ఇది పూర్తిగా శ్వేత లోకం. ఆర్టిస్ట్‌లు, డీజేలతో సహా అతిథులకు కూడా తెలుపురంగు డ్రెస్ కోడ్ తప్పనిసరి. ప్రపంచంలోనే మొత్తం శ్వేత వర్ణమయమై సాగే సంగీత, నృత్యోత్సవం ఇదొక్కటే. -
కూచిపూడి విశ్వరూపం
వైభవంగా ప్రారంభమైన నాట్య సమ్మేళనం 18 దేశాల నుంచి 8500 మంది కళాకారులు హాజరు సాక్షి, హైదరాబాద్: నాలుగో అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి జీఎంసీ బాల యోగి స్టేడియంలో శుక్రవారం వైభవంగా ప్రారంభమైంది. సిలికానాంధ్ర ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్ర మంలో తొలి రోజు ప్రదర్శనలు ఆహూతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. 18 దేశాల నుంచి 8500 మంది కళాకారులు పాల్గొన్నారు. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికా, లండన్, ఉక్రెయిన్, ఆస్ట్రేలియా, కువైట్, హాంగ్‌కాంగ్, సింగపూర్ తదితర దేశాల నుంచి కళాకారులు తరలివచ్చారు. ఈ సమ్మేళనాన్ని ఎంపీ కవిత, ఏపీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్‌లు జ్యోతిప్రజ్వలన చేసి ఆరంభించారు. కార్యక్రమానికి హాజరైన కేంద్ర మంత్రి దత్తాత్రేయ మాట్లాడుతూ కూచిపూడి ప్రపంచ విఖ్యాత కేంద్రం కావాలని కేంద్ర మంత్రి దత్తాత్రేయ స్పష్టం చేశారు. కూచిపూడి నృత్యం విశేష ప్రచారానికి ప్రధానితో మాట్లాడి తనవంతు కృషి చేస్తానని చెప్పారు. కూచిపూడి కేవలం ఏపీకి చెందిన కళ కాదని, విశ్వవ్యాప్తమని చెప్పారు. బుద్ధప్రసాద్ మాట్లాడుతూ త్వరలో కూచిపూడి నాట్య కళల అకాడమీ ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. కళా వ్యాప్తి కోసం ఏపీ ప్రభుత్వం క ట్టుబడి ఉందని, సిలికానాంధ్ర సంస్థ అంతర్జాతీయ స్థాయిలో కూచిపూడి కళకు విశేష సేవలందిస్తున్నందని అభినందించారు. కవిత మాట్లాడుతూ భారతీయ సంస్కృతి ఎంతో ఉత్కృష్ఠమైనదని, కళలకు ఎల్లలు లేవని అన్నారు. మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ తెలుగువారు ఎక్కడున్నా ఒక్కటేనని చెప్పారు. సిలికానాంధ్ర చైర్మన్ కూచిభొట్ల ఆనంద్ మాట్లాడుతూ కూచిపూడి నాట్యానికి అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టి ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకురావటానికే అంతర్జాతీయ నాట్య సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ వేడుకలో పద్మభూషణ్ రాజా రాధారెడ్డి, పద్మభూషణ్ యామి ని కృష్ణమూర్తి, పద్మశ్రీ కె.శోభానాయుడు, వేదాంతం రామలింగశాస్త్రి, పసుపర్తి రామలింగశాస్త్రి, వేదాంతం రత్తయ శర్మ, వేదాంతం రాధేశ్యాం, కె. ఉమారామారావు, ఆర్. కవితాప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూచిపూడి దిగ్గజాలందరూ కలసి బాలా త్రిపుర సుందరి, శ్రీరామలింగేశ్వరస్వామి, వెంపటి చినసత్యం తదితరుల చిత్రపటాలతో చేసిన కూచిపూడి శోభాయా త్ర ఆకట్టుకుంది. తొలిరోజు ‘అంబా పరాకు’ అంటూ సామూహిక గురు ప్రార్థనతో మొదలైన ప్రదర్శన ఆద్యంతం రక్తికట్టించింది. అనంతరం నర్తకి యామినిరెడ్డి తన బృందంతో శివుడ్ని స్తుతిస్తూ చేసిన నృత్య ప్రదర్శన చూపరులను ఆకట్టుకుంది. శోభానాయుడు శిష్యబృందం అమెరికా నుంచి విచ్చేసిన జ్యోతి చింతలపూడి, రష్యా కళాకారులు అన్నా మౌషక్, ఎలీనా తరషోవాతో కలిసి చేసిన ‘వాగ్గేయకారుల మనోభిరాముడు శ్రీ రాముడు’ అంశం సుమనోహరంగా సాగింది. విశాఖ నాట్యగురు బాల కొండలరావు శిష్యబృందం ‘ఆలోకయే శ్రీబాలకృష్ణం’ అంటూ తరంగం ప్రదర్శించి కరతాళధ్వనులందుకున్నా రు. బెంగళూరు కళాకారులు సరస్వతీ రజేతేష్ ఆధ్వర్యంలో దశోహం ప్రదర్శించారు. తొలిరోజు గ్రాండ్ ఫినాలెగా పసుమర్తి రామలింగశాస్త్రి శిష్య బృందం ‘ శిశిరేఖ పరిణయం ’ యక్షగానం ప్రదర్శించి అలరించారు. వందేళ్ళ చరిత్ర కలిగిన ఈ యక్షగానం విశేషంగా ఆకర్షించింది. -
26 నుంచి నగరంలో ‘నిత్య నృత్య-2014
సాక్షి, బెంగళూరు : నగరానికి చెందిన నూపుర స్కూల్ ఆఫ్ భరతనాట్యం ఆధ్వర్యంలో ఈనెల 26 నుంచి నగరంలో డ్యాన్స్ ఫెస్టివల్‌ను నిర్వహించనున్నారు. ‘నిత్య నృత్య-2014’ పేరిట నిర్వహించనున్న ఈ డ్యాన్స్ ఫెస్టివల్ ఈనెల 26 నుంచి 28 వరకు కొనసాగుతుందని నూపుర స్కూల్ ఆదివారమిక్కడ ఓ ప్రకటన లో వెల్లడించింది. నగరంలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడ్రన్ ఆర్ట్స్, రవీంద్ర కళాక్షేత్ర, చౌడయ్య మెమోరియల్ హాల్లో ఈ డ్యాన్స్ ఫెస్టివల్‌ను నిర్వహించనున్నట్లు తెలిపింది. భరతనాట్యం, ఒడిస్సీ, మోహినీఆట్టం తదితర నృత్యరీతులను ఈ డ్యాన్స్ ఫెస్టివల్లో తిలకించేందుకు కళాప్రియులను అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొంది. ప్రముఖ నృత్యకారులు గోపికా వర్మ, మధులిత మహాపాత్ర, గాయత్రీ శ్రీరామ్, రుక్మిణీ విజయ్‌కుమార్‌లు ఈ డ్యాన్స్ ఫెస్ట్‌లో తమ ప్రదర్శనలు ఇవ్వనున్నారని వెల్లడించింది.