యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి జన్మ నక్షత్రం స్వాతిని పురస్కరించుకొని భావనాలయ నాట్యాచార్యుడు డాక్టర్ వట్టికోట యాదగిరిచార్యులు, ఆయన శిష్య బృందం ఆదివారం మెట్ల నృత్యోత్సవం నిర్వహించాయి. మొదట శ్రీస్వామి వారి వైకుంఠద్వారం వద్ద మెట్ల పూజను నిర్వహించారు.
అనంతరం మెట్లపై నృత్యం చేస్తూ కొండపైకి వెళ్లారు. కొండపైన తూర్పు రాజగోపురం వద్ద కుంభ నీరాజనంతో కార్యక్రమాన్ని ముగించారు. యాదాద్రి వైభవాన్ని నలు దిశలా చాటేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వట్టికోట యాదగిరిచార్యులు స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment