National Gallery of Modern Art
-
‘ప్రధాని బహమతుల’ వేలం నేటి నుంచే
న్యూఢిల్లీ: స్పోర్ట్స్ షూ, పారాలింపిక్ విజేతలకు చెందిన వస్తువులు, అయోధ్య రామాలయం ప్రతిరూపం, వెండి వీణ..ఇలా ప్రధాని మోదీ ఏడాది కాలంలో అందుకున్న బహమతుల వేలం ఈ నెల 17న మొదలై అక్టోబర్ 2 వరకు కొనసాగుతుందని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చెప్పారు. సుమారు రూ.1.5 కోట్లకు పైగా విలువైన 600 జ్ఞాపికలను వేలంలో అందుబాటులో ఉంటాయని చెప్పారు. నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్‌లో ప్రదర్శనను సోమవారం మంత్రి తిలకించారు. ప్రభుత్వం నిర్ణయించిన విధంగా వేలం రూ.600 నుంచి గరిష్టంగా రూ.8.26 లక్షల వరకు ఉంటుందని చెప్పారు. -
G20 Summit: నేతల సతీమణులకు ప్రత్యేక విందు
న్యూఢిల్లీ: జీ20 శిఖరాగ్రానికి వచి్చన ప్రపంచ నేతల సతీమణులకు శనివారం జైపూర్ హౌస్‌లో ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేశారు. అనంతరం వారందరికీ నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్‌లో భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్లో కళాకృతులను తిలకించేందుకు అవకాశం కలి్పంచారు. విందులో భాగంగా వారికి మిల్లెట్లతో చేసిన వంటకాలను వడ్డించారు. స్ట్రీట్ ఫుడ్ రుచి చూపించారని అధికార వర్గాలు తెలిపాయి. ఈ విందుకు తుర్కియే అధ్యక్షుడి సతీమణితోపాటు, జపాన్ ప్రధాని సతీమణి యోకో కిషిదా, యూకే ప్రధాని సతీమణి అక్షతామూర్తి, ఆ్రస్టేలియా, మారిషస్ తదితర దేశాల ప్రధానుల సతీమణులు, ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా సతీమణి రితు బంగా తదితర 15 మంది వరకు హాజరయ్యారని వెల్లడించాయి. అంతకుముందు, వీరంతా సుమారు 1,200 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(ఐఏఆర్ఐ)పుసా క్యాంపస్‌కు వెళ్లారు. వీరికి విదేశాంగ మంత్రి జైశంకర్, ఆయన భార్య కియోకో స్వాగతం పలికారు. తృణధాన్యాల సాగు గురించి తెలుసుకున్నారు. ప్రముఖ చెఫ్‌లు లైవ్ కుకింగ్ సెషన్లో తృణధాన్యాల వంటకాలను వివరించారు. మధ్యప్రదేశ్‌లోని డిండోరికి చెందిన గిరిజన మహిళా రైతు లహరీ బాయి తదితర 20 మంది మహిళా రైతులతో వీరు ముచ్చటించారు. -
‘జనశక్తి’ ఎగ్జిబిషన్లో మోదీ
న్యూఢిల్లీ: మన్‌కీ బాత్ 100వ ఎపిసోడ్ పూర్తయిన సందర్భంగా నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్(ఎన్జీఎంఏ)లో ఏర్పాటైన ఎగ్జిబిషన్‌ను ప్రధాని మోదీ ఆదివారం సందర్శించారు. ‘జన శక్తి: ఒక సమ్మిళిత శక్తి’ఇతి వృత్తంతో ఏర్పాటైన ఈ ఎగ్జిబిషన్లో ప్రముఖులైన 13 మంది కళాకారుల కళా ఖండాలున్నాయి. ఎగ్జిబిషన్లో ఆయన కలియదిరిగారని సాంస్కృతిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. మన్‌కీ బాత్‌లో తమకు ప్రేరణనిచ్చిన అంశాల గురించి కళాకారులు ప్రధానికి వివరించారని పేర్కొంది. -
మోదీ కానుకల వేలం
న్యూఢిల్లీ: ‘నమామి గంగే’ ప్రాజెక్టు కోసం నిధుల సేకరణలో భాగంగా గత సంవత్సరం ప్రధాని నరేంద్రమోదీ అందుకున్న కానుకల వేలం ప్రక్రియ మొదలైంది. బహుమతుల ప్రదర్శన, వేలం పాటను కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి ప్రహ్లాద్‌సింగ్ పటేల్ శనివారం ప్రారంభించారు. శాలువాలు, తలపాగాలు, జాకెట్లు సహా 2,700కుపైగా వస్తువులు ప్రదర్శనలో ఉంటాయని, నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్ (ఎన్జీఎంఏ)లో ఈ వస్తువులు శనివారం నుంచి అక్టోబర్ 3 వరకు www.pmmementos.gov.in లో వేలం కొనసాగుతుందని తెలిపారు. ఎన్జీఎంఏలో ఉదయం 11 గంటల నుండి రాత్రి 8 గంటల వేలం జరుగుతుందని, ప్రస్తుతం స్మృతి చిహ్నాలు పేరుతో 500 వస్తువులు ప్రదర్శనలో ఉన్నాయని పటేల్ తెలిపారు. ‘ప్రతి వారం ప్రదర్శించబడే మెమెంటోలు మార్చుతాం. పెయింటింగ్స్, మెమెంటోలు, శిల్పాలు, శాలువాలు, తలపాగాలు, సంప్రదాయ వాయిద్యాలతో సహా అనేక వస్తువులను ప్రదర్శిస్తాం’ అని చెప్పారు. మెమెంటోల అత్యల్ప ధర రూ. 200 కాగా, అత్యధిక ధర రూ. 2.5 లక్షలు అని పటేల్ తెలిపారు. ‘నేను అందుకున్న బహుమతులను వేలంలో పెడతా. ప్రజలు ఈ వేలం పాటలో పాల్గొనాలని కోరుతున్నాను’ అని మోదీ ట్వీట్ చేశారు. -
26 నుంచి నగరంలో ‘నిత్య నృత్య-2014
సాక్షి, బెంగళూరు : నగరానికి చెందిన నూపుర స్కూల్ ఆఫ్ భరతనాట్యం ఆధ్వర్యంలో ఈనెల 26 నుంచి నగరంలో డ్యాన్స్ ఫెస్టివల్‌ను నిర్వహించనున్నారు. ‘నిత్య నృత్య-2014’ పేరిట నిర్వహించనున్న ఈ డ్యాన్స్ ఫెస్టివల్ ఈనెల 26 నుంచి 28 వరకు కొనసాగుతుందని నూపుర స్కూల్ ఆదివారమిక్కడ ఓ ప్రకటన లో వెల్లడించింది. నగరంలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడ్రన్ ఆర్ట్స్, రవీంద్ర కళాక్షేత్ర, చౌడయ్య మెమోరియల్ హాల్లో ఈ డ్యాన్స్ ఫెస్టివల్‌ను నిర్వహించనున్నట్లు తెలిపింది. భరతనాట్యం, ఒడిస్సీ, మోహినీఆట్టం తదితర నృత్యరీతులను ఈ డ్యాన్స్ ఫెస్టివల్లో తిలకించేందుకు కళాప్రియులను అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొంది. ప్రముఖ నృత్యకారులు గోపికా వర్మ, మధులిత మహాపాత్ర, గాయత్రీ శ్రీరామ్, రుక్మిణీ విజయ్‌కుమార్‌లు ఈ డ్యాన్స్ ఫెస్ట్‌లో తమ ప్రదర్శనలు ఇవ్వనున్నారని వెల్లడించింది.