న్యూఢిల్లీ: జీ20 శిఖరాగ్రానికి వచి్చన ప్రపంచ నేతల సతీమణులకు శనివారం జైపూర్ హౌస్‌లో ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేశారు. అనంతరం వారందరికీ నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్‌లో భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌లో కళాకృతులను తిలకించేందుకు అవకాశం కలి్పంచారు. విందులో భాగంగా వారికి మిల్లెట్‌లతో చేసిన వంటకాలను వడ్డించారు.
స్ట్రీట్ ఫుడ్ రుచి చూపించారని అధికార వర్గాలు తెలిపాయి. ఈ విందుకు తుర్కియే అధ్యక్షుడి సతీమణితోపాటు, జపాన్ ప్రధాని సతీమణి యోకో కిషిదా, యూకే ప్రధాని సతీమణి అక్షతామూర్తి, ఆ్రస్టేలియా, మారిషస్ తదితర దేశాల ప్రధానుల సతీమణులు, ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా సతీమణి రితు బంగా తదితర 15 మంది వరకు హాజరయ్యారని వెల్లడించాయి.
అంతకుముందు, వీరంతా సుమారు 1,200 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(ఐఏఆర్‌ఐ)పుసా క్యాంపస్‌కు వెళ్లారు. వీరికి విదేశాంగ మంత్రి జైశంకర్, ఆయన భార్య కియోకో స్వాగతం పలికారు. తృణధాన్యాల సాగు గురించి తెలుసుకున్నారు. ప్రముఖ చెఫ్‌లు లైవ్ కుకింగ్ సెషన్‌లో తృణధాన్యాల వంటకాలను వివరించారు. మధ్యప్రదేశ్‌లోని డిండోరికి చెందిన గిరిజన మహిళా రైతు లహరీ బాయి తదితర 20 మంది మహిళా రైతులతో వీరు ముచ్చటించారు.
Comments
Please login to add a commentAdd a comment