
న్యూఢిల్లీ: స్పోర్ట్స్ షూ, పారాలింపిక్ విజేతలకు చెందిన వస్తువులు, అయోధ్య రామాలయం ప్రతిరూపం, వెండి వీణ..ఇలా ప్రధాని మోదీ ఏడాది కాలంలో అందుకున్న బహమతుల వేలం ఈ నెల 17న మొదలై అక్టోబర్ 2 వరకు కొనసాగుతుందని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చెప్పారు.
సుమారు రూ.1.5 కోట్లకు పైగా విలువైన 600 జ్ఞాపికలను వేలంలో అందుబాటులో ఉంటాయని చెప్పారు. నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్‌లో ప్రదర్శనను సోమవారం మంత్రి తిలకించారు. ప్రభుత్వం నిర్ణయించిన విధంగా వేలం రూ.600 నుంచి గరిష్టంగా రూ.8.26 లక్షల వరకు ఉంటుందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment