సాక్షి, బెంగళూరు : బాలీవుడ్ నటి సన్నీలియోన్‌కు కర్ణాటక ప్రభుత్వం షాకిచ్చింది. బెంగళూరులో నిర్వహించే న్యూఇయర్ వేడుకల్లో సన్నీలియెనపాల్గొనాల్సి ఉంది. సన్నీలియోన్ న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొనడంపై బెంగళూరులో వివాదాలకు దారితీసింది. దీనిపై స్పందించిన కర్ణాటక ప్రభుత్వం సన్నీలియోన్ బెంగళూరు వచ్చేందుకు అనుమతి నిరాకరించింది. కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హిందూ అతివాద సంస్థలకు మరింత ప్రోత్సాహం అందించేలా ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
సన్నీలియోన్ రాకను వ్యతిరేకిస్తూ.. బెంగళూరులో కర్ణాటక రక్షణ వేదిక కొద్ది రోజుల నుంచి ఉద్యమాలను నిర్వహిస్తోంది. సన్నీలియోన్ రాకవల్ల కర్ణాటక సంస్కృతి, సంప్రదాయాలు ప్రమాదంలో పడతాయని రక్షణ వేదిక పేర్కొంటోంది. న్యూ ఇయర్ వేడుకల్లో సన్నీ పాల్గొంటే.. సామూహిక ఆత్మహత్యకు వెనుకాడే ప్రసక్తే లేదంటూ యువసేన హెచ్చరించింది. ఈ నేపథ్యంలో కర్ణాటక హోంమంత్రి రామలింగారెడ్డి కర్ణాటక రక్షణ వేదికకు అనుకూలంగా స్పందించారు. సన్నీలియోన్ పాల్గొనే కార్యక్రమానికి అనుమతి ఇవ్వకూడదని ఇప్పటికే నగర పోలీస్ కమిషనర్‌ను ఆదేశించినట్లు ఆయన చెప్పారు. అయితే సన్నీలియోన్ ప్రోగ్రాం స్థానంలో భరతనాట్యం, ఇతర సంగీత కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవాలని ఆయన నిర్వాహకులకు సూచించడం విశేషం.
సన్నీలియన్ గతం మంచిదికాదని, ఆమెలాంటి వాళ్లను ప్రోత్సహించడం ఎంతమాత్రమూ శ్రేయస్కరం కాదని కర్ణాట రక్షణ వేదిక ప్రకటించింది. కర్ణాటక సంస్కృతిని రక్షించుకోవాలంటే ఆమెను ఇక్కడికి రాకుండా చేయాలంటూ కర్ణటక రక్షణ వేదిక యువసేన పిలుపునిచ్చింది. ఈ మేరకు కర్ణాటకలో పలు జిల్లా కేంద్రాల్లో సన్నీ లియోన్ కు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టి, ఆమె పోస్టర్లు, ఫొటోలు కాల్చేసిన విషయం విదితమే.
Comments
Please login to add a commentAdd a comment