
రాయల తెలంగాణకు పూర్తి వ్యతిరేకం: గుత్తా
రేపట్టి తెలంగాణ బంద్కు టి.కాంగ్రెస్ నేతల మద్దతుండదని నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి వెల్లడించారు. బుధవారం ఆయన నల్గొండలో మాట్లాడుతూ... 10 జిల్లాలతో కూడిన తెలంగాణ మాత్రమే కావాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాయల తెలంగాణకు తాను పూర్తి వ్యతిరేకమని ఆయన వ్యాఖ్యానించారు.
కేంద్రం ప్రభుత్వం మొదటి నుంచి హైదరాబాద్తో పాటు 10 జిల్లాలతో కూడిన తెలంగాణానే ఇస్తామని చెబుతుందన్న విషయాన్ని గుత్తా ఈ సందర్బంగా గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో కేంద్రం నిమషానికో మాట మార్చడం పట్ల ఆయన ఓ కింత అసహానం వ్యక్తం చేశారు.