హైదరాబాద్ : తెలంగాణ బంద్ పలుచోట్ల ఉద్రిక్తతలకు దారి తీసింది. గుంటూరు నుంచి హైదరాబాద్ వచ్చిన మూడు బస్సులను తెలంగాణవాదులు శనివారం అడ్డుకున్నారు. హయత్నగర్ వద్ద బస్సులను ఆపి ప్రయాణికులు అల్పాహారం చేస్తున్న సమయంలో తెలంగాణవాదులు అక్కడకు చేరుకుని బస్సు టైర్లలో గాలి తీసివేశారు.
మరోవైపు దిల్సుఖ్నగర్ వద్ద ఆంధ్రా ప్రాంతానికి చెందిన బస్సుపై తెలంగాణవాదులు దాడి చేశారు. బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఒకరు గాయపడ్డారు. ఇక నల్గొండ జిల్లా చర్లపల్లి బైపాస్ రోడ్డుపై తెలంగాణ జేఏసీ నేతలు ఆందోళనకు దిగారు. దాంతో జిల్లా జేఏసీ ఛైర్మన్ సహా పలువురు నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా వేములపల్లి మండలం శెట్టిపాలెం వద్ద విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్న బస్సులను తెలంగాణవాదులు అడ్డుకున్నారు.
ఆంధ్రా బస్సుపై తెలంగావాదుల దాడి,ఒకరికి గాయాలు
Published Sat, Sep 7 2013 9:58 AM | Last Updated on Fri, Sep 1 2017 10:32 PM
Advertisement
Advertisement