Telangana protestors
-
బస్సుపై తెలంగాణవాదుల దాడి
యలమంచిలి, న్యూస్‌లైన్ : సమైక్య శంఖారావం సభకు వెళ్లిన కనకాయలంక, అబ్బిరాజుపాలెం గ్రామాల వైఎస్సార్ సీపీ శ్రేణులపై తెలంగాణవాదులు దాడి చేశారు. రెండు గ్రామాల నుంచి సుమారు 35 మంది బస్సులో హైదరాబాద్ వెళ్లారు. తిరుగు ప్రయూణంలో శనివారం రాత్రి ఖాజీపేట వద్ద దారికాసిన తెలంగాణవాదులు బస్సుపై రాళ్ల వర్షం కురిపించారని ప్రత్యక్ష సాక్షి, కనకాయలంక గ్రామ వైసీపీ నాయకుడు గొల్లపల్లి శ్రీనివాస్ ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. వర్షం కురుస్తుండటంతో బస్సు నెమ్మదిగా వెళుతుండగా సుమారు 20 మంది యువకులు బస్సుపై రాళ్లు రువ్వినట్లు చెప్పారు. బస్సు అద్దాలు పగలడంతో పాటు క్లీనర్ మోకాలికి బలమైన గాయమైందని తెలిపారు. -
ఆంధ్రా బస్సుపై తెలంగావాదుల దాడి, ఒకరికి గాయాలు
హైదరాబాద్ : తెలంగాణ బంద్ పలుచోట్ల ఉద్రిక్తతలకు దారి తీసింది. గుంటూరు నుంచి హైదరాబాద్ వచ్చిన మూడు బస్సులను తెలంగాణవాదులు శనివారం అడ్డుకున్నారు. హయత్‌నగర్ వద్ద బస్సులను ఆపి ప్రయాణికులు అల్పాహారం చేస్తున్న సమయంలో తెలంగాణవాదులు అక్కడకు చేరుకుని బస్సు టైర్లలో గాలి తీసివేశారు. మరోవైపు దిల్సుఖ్నగర్ వద్ద ఆంధ్రా ప్రాంతానికి చెందిన బస్సుపై తెలంగాణవాదులు దాడి చేశారు. బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఒకరు గాయపడ్డారు. ఇక నల్గొండ జిల్లా చర్లపల్లి బైపాస్ రోడ్డుపై తెలంగాణ జేఏసీ నేతలు ఆందోళనకు దిగారు. దాంతో జిల్లా జేఏసీ ఛైర్మన్ సహా పలువురు నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా వేములపల్లి మండలం శెట్టిపాలెం వద్ద విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్న బస్సులను తెలంగాణవాదులు అడ్డుకున్నారు.