
ఆలేరు : బస్వాపూర్, గంధమల్ల జలాశయాల నీళ్లను సూర్యాపేటకు తరలిస్తామని సూర్యాపేట సభలో పేర్కొన్న సీఎం కేసీఆర్ ఆలేరు, భువనగిరి నియోజకవర్గ ప్రజలకు వివరణ ఇవ్వాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు డిమాండ్ చేశారు. సోమవారం స్థానికంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. బలహీనమైన ప్రజా ప్రతినిధులు ఉన్నప్పుడు ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయన్నారు.
ఈ విషయమై భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత ప్రజలకు సమాధానం చెప్పాలని కోరారు. ఓ వైపు మంత్రి హరీశ్‌రావు తపాసుపల్లి రిజర్వాయర్ ద్వారా సిద్దిపేటకు నీటిని తరలిస్తుంటే ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు నోరు మెదపకపోవడం బాధాకరమన్నారు. సమావేశంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండ్రు శోభారాణి, చామకూర అమరేందర్‌రెడ్డి, ఆరె రాములు, ఎండీ.సలీం, గ్యాదపాక దానయ్య, మల్‌రెడ్డి సాంబిరెడ్డి, ఎండీ.రఫీ, భోగ సంతోష్, జెట్ట సిద్దులు, బండ శ్రీను, బస్తం ఆంజనేయులు, అంకిరెడ్డి శ్రీను పాల్గొన్నారు.