
'మోదీ నిర్ణయం హర్షణీయం'
యాదాద్రి : నల్లకుబేరుల వద్ద పేరుకుపోయిన ధనాన్ని వెలికితీసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన నోట్ల రద్దు నిర్ణయం హర్షణీయమని మాజీ మంత్రి, టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. యాదాద్రిలోమంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సామాన్యుల ఇబ్బందులు తాత్కాలికమేనన్నారు.
ప్రజల అవసరాలకు అనుగుణంగా వెంటనే రూ.2000, రూ.500 నోట్లను చెలామణీలోకి తేవాలని మోత్కుపల్లి ప్రభుత్వాన్ని కోరారు. ఆయన వెంట తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు శోభారాణి ఉన్నారు.