చంద్రబాబును గద్దె దించటమే ధ్యేయంగా ఇకపై తాను పని చేస్తానని టీటీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు ఉధ్ఘాటించారు. అవసరమైతే ఏపీలోని విపక్షాలన్నింటితో కలిసి తాను పని చేస్తానని ఆయన ప్రకటించారు. మోత్కుపల్లి తిరుమల యాత్ర నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి గురువారం ఆయన్ని కలిసి సంఘీభావం ప్రకటించారు. అనంతరం తన నివాసంలో మోత్కుపల్లి మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ సీఎం చంద్రబాబుపై ధ్వజమెత్తారు.