తెలుగు ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలి
రేవంత్‌రెడ్డి, మోత్కుపల్లి డిమాండ్
సాక్షి, హైదరాబాద్: తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన దివంగత మాజీ సీఎం ఎన్‌టీ రామారావు వర్ధంతిని టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించకపోవడం శోచనీయమని తెలంగాణ తెలుగుదేశం పార్టీ విమర్శించింది. తెలంగాణ ప్రభుత్వం టీడీపీ నేతలను ఎన్టీఆర్ ఘాట్ వద్ద అడ్డుకున్నారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రేవంత్‌రెడ్డి, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు. ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో సోమవారం వారు మీడియాతో మాట్లాడుతూ రాజకీయ భిక్ష పెట్టిన ఎన్టీఆర్‌ను, తెలుగు ప్రజలను అవమానించేలా వ్యవహరించిన కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
కేంద్రంలో దివంగత ప్రధానుల జయంతి, వర్ధంతులను లాంఛనంగా నిర్వహిస్తారని గుర్తు చేశారు. కాని ఎన్టీఆర్ వర్ధంతిని కేసీఆర్ నిర్వహించకుండా అవమానించేలా వ్యవహరించారని ఆరోపించారు.