
సాక్షి, విజయవాడ: చంద్రబాబు నాయుడు అవినీతీ పరుడు, నయవంచకుడు అని గతంలో విమర్శించిన సీనియర్ నేత మోత్కపల్లి నర్సింహులు.. నేడు అదే నోటితో పొగడటంపై డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మండిపడ్డారు.
‘చంద్రబాబు అవినీతి పరుడు, నయవంచకుడు అని మోత్కుపల్లి గతంలో చెప్పాడు. ‘ఎన్టీఆర్‌ని చంపించింది చంద్రబాబు నాయుడే అని మోత్కుపల్లి అన్నాడు. ఇప్పుడు డబ్బు, ప్యాకేజీ కోసం చంద్రబాబు నాయుడు ఒక పెద్ద మనిషి అంటూ పొగుడుతున్నాడు. మోత్కుపల్లి నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించం. అవినీతిని కనిపెట్టిందే చంద్రబాబు.. స్కిల్ స్కామ్‌లో కోట్లు కొల్లగొట్టాడు. పురందేశ్వరి టీడీపీ అధ్యక్షురాలా? బీజేపీ అధ్యక్షురాలా?, డబ్బు కోసం, పదవి కోసం ఎన్టీఆర్‌ని పురందేశ్వరి వెన్నుపోటు పొడిచింది. ప్రధాని మోదీనే చంద్రబాబు అవినీతి పరుడని చెప్తే పురందేశ్వరి మద్దతిస్తోంది’ అంటూ నారాయణస్వామి ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment