గోదావరి జలాల కోసం టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు మోత్కుపల్లి నరసింహులు మంగళవారం వరంగల్ జిల్లా చేర్యాల మండలం నాగపూరి నుంచి ప్రారంభించారు.
చేర్యాల : గోదావరి జలాల కోసం టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు మోత్కుపల్లి నరసింహులు మంగళవారం వరంగల్ జిల్లా చేర్యాల మండలం నాగపూరి నుంచి ప్రారంభించారు. ఆయన వెంట టీడీపీ మహిళా అధ్యక్షురాలు దండు శోభారాణి కూడా యాత్రలో పాల్గొన్నారు. నల్లగొండ జిల్లా ఆలేరు వరకు పాదయాత్ర కొనసాగనుంది. పక్కనే ఉన్న తపాస్‌పల్లి రిజర్వాయర్ నుంచి ఆలేరు నియోజకవర్గానికి నీరు ఇవ్వాలని మోత్కుపల్లి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ రిజర్వాయర్ నుంచి కేసీఆర్ నియోజకవర్గమైన గజ్వేల్, హరీష్‌రావు నియోజకవర్గమైన సిద్ధిపేటకు నీరు ఇస్తున్నారని... రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలను సమంగా చూడాలని డిమాండ్ చేశారు.