
సాక్షి, హైదరాబాద్ : మహానాడుకు తనను కనీసం ఆహ్వానించలేదని టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు మీడియాతో ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా అవమానపరచడం బాధగా ఉందన్నారు. ‘నన్నింత చిన్నచూపు చూస్తరా? ఒక దళిత నేతకు ఇచ్చే గౌరవమిదేనా?’ అని ప్రశ్నించారు. ‘‘మహానాడుకు వెళ్లే అదృష్టం నాకు లేదు. అధికారం లేకపోయినా, బాబు దగ్గర పని చేసిన మంత్రులంతా పరారైనా, 15 ఏళ్లు ఆయన కోసం, పార్టీ కోసం పని చేశా. నేను ఏ బ్యాక్‌గ్రౌండూ లేనివాడిని. ‘నర్సింహులూ... నువ్వు నాకు తోడుగా ఉండు..’ అన్నందుకు ఆయనకు అండగా ఉన్నా. సిద్ధాంతపరంగా కాంగ్రెస్‌తో పొత్తు అసాధ్యమని, టీఆర్‌ఎస్‌తోనే అయితదని చెప్పిన. ఇప్పుడూ చెబుతున్నా. తప్పా? మా నాయకుడు కూడా నన్ను అవమాన పరిస్తే దిక్కెవరు?’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment