
కేసీఆర్‌ది, మీదీ ఒకే విధానం: మోత్కుపల్లి
విజయవాడ: పార్టీ ఫిరాయింపుల విషయంలో కేసీఆర్‌ది, మీది ఒకే విధానమని టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశంలో ఏపీ సీఏం చంద్రబాబును ఉద్దేశించి తెలంగాణ నేత మోత్కుపల్లి నర్సింహులు వ్యాఖ్యానించారు. చంద్రబాబు స్పందించకుండా నవ్వి ఊరుకున్నారు. పార్టీ ఫిరాయింపులు ఇప్పుడు కొత్త కాదని, ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉన్నాయని ఆ తర్వాత చంద్రబాబు వ్యాఖ్యానించారు.
అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తుందని, అయితే అభివృద్ధికి ఆకర్షితులై ఎమ్మెల్యేలు పార్టీలోకి వస్తున్నారని చెప్పాలని నిర్ణయించారు. ప్రభుత్వంపై, స్పీకర్‌పై వైఎస్సార్‌సీపీ అవిశ్వాస తీర్మానం పెడితే రాజకీయంగా ఎదురుదాడి చేయాలని నిర్ణయించారు.