TDP Politburo
-
అచ్చెన్నాయుడి పదవికి ఎసరు!
సాక్షి, అమరావతి : తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడి పదవికి పార్టీ అధినేత చంద్రబాబు ఎసరు పెట్టారు. ఆయన్ని అధ్యక్ష పదవి నుంచి తొలగించేందుకు రంగం సిద్ధం చేసినట్లు ఆ పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఆయన్ని తప్పించి మరో బీసీ నేతకు అవకాశం ఇవ్వాలనే అభిప్రాయాన్ని చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ చాప కింద నీరులా చాలాకాలం నుంచి వ్యాపంపజేశారు. తాజాగా క్యాడర్ నుంచి ఇదే అభిప్రాయం వస్తున్నట్లు చూపించి మహానాడులో అచ్చెన్నకు చెక్ పెట్టడానికి సిద్ధమైనట్లు సమాచారం. అందులో భాగంగానే ఒంగోలులో శుక్రవారం రాత్రి జరిగిన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో ఈ అంశంపై చర్చించారు. అధ్యక్ష పదవిని మరొకరికి ఇవ్వాలని రాష్ట్ర పార్టీ మాజీ అధ్యక్షుడు కళా వెంకట్రావు ప్రతిపాదించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీలకు పెద్దపీట వేస్తోందని, ఎక్కువ పదవులు ఇస్తోందని ఆయన చెప్పినట్లు తెలిసింది. జగన్ బీసీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని ప్రజల్లోనూ చర్చ జరుగుతున్న తరుణంలో పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిని మరో బీసీకి ఇవ్వాలని వెంకట్రావు చెప్పినట్లు తెలిసింది. వ్యూహాత్మకంగానే.. ప్రతి రెండేళ్లకు ఒకసారి మహానాడులో పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ, తెలంగాణకు అధ్యక్షులను ఎన్నుకుంటారు. చంద్రబాబును జాతీయ అధ్యక్షుడుగా ఎన్నుకోవడం లాంఛనమైన ప్రక్రియే. మిగిలిన పదవులను ఎవరికివ్వాలో చంద్రబాబు నిర్ణయిస్తారు. రెండేళ్ల క్రితం ఇలాగే అచ్చెన్నాయుడిని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా నియమించారు. తిరుపతి ఉప ఎన్నిక సమయంలో అచ్చెన్న పార్టీ పరిస్థితి, లోకేశ్ నాయకత్వం పైన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. అప్పటి నుంచి ఆయన్ని లోకేష్ టార్గెట్ చేశారు. అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నారు. రాష్ట్ర అధ్యక్షుడైనప్పటికీ అచ్చెన్నాయుడిని లోకేష్ ఎక్కడికీ వెళ్లనివ్వలేదు. మీడియా సమావేశాల పైనా ఆంక్షలు విధించారు. దీంతో అచ్చెన్నాయుడు అప్పుడప్పుడు ప్రకటనలు మాత్రం విడుదల చేసేవారు. జిల్లాల పర్యటనలకు వెళ్లకుండా అడ్డుకుని లోకేశే వెళ్లేవారు. అన్ని రకాలుగా అచ్చెన్నాయుడిని పక్కన పెట్టేశారు. అర్ధంతరంగా పదవి నుంచి తొలగించాలని చూశారు. ఇలా చేస్తే బీసీల్లో ఇంకా బలహీనమవుతామని చంద్రబాబు ఆపుతూ వచ్చారు. ఇప్పుడు మహానాడు సందర్భంగా వ్యూహం ప్రకారం కళా వెంకట్రావు ద్వారా అచ్చెన్నకు చెక్ పెడుతున్నారు. లోకేశ్ కూడా పార్టీ నేతలు ఎక్కువ కాలం పదవుల్లో ఉండకూడదని మహానాడు ప్రాంగణంలోనే తేల్చి చెప్పారు. ఎక్కువ కాలం పదవులు పట్టుకుని వేళ్లాడితే కొత్త వాళ్లు ఎలా వస్తారని ప్రశ్నించారు. అచ్చెన్నాయుడిని ఉద్దేశించే లోకేశ్ మాట్లాడినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. మహానాడు తర్వాత కొత్త వారికి అవకాశం పేరుతో అచ్చెన్నను పదవి నుంచి తప్పించి మరో డమ్మీ పదవి ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. (క్లిక్: వంద మహానాడులు చేసినా బాబు అధికారంలోకి రాలేడు) -
యూటర్న్ తీసుకుని బీజేపీకి ప్రేమ లేఖలా?
సాక్షి, తాడేపల్లి: టీడీపీతో పొత్తు ఉండబోదని బీజేపీ వాళ్లు బహిరంగంగా చెబుతున్నా.. సిగ్గులేకుండా చంద్రబాబు బీజేపీతో పొత్తుపై యూటర్న్ తీసుకొని .. మళ్లీ బీజేపీకి ప్రేమ లేఖలు పంపుతున్నారని పలాస ఎమ్మెల్యే డాక్టర్ సీదిరి అప్పలరాజు ఘాటుగా విమర్శించారు. గురువారం ఆయన తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. టీడీపీని ఏమైనా బీజేపీలో విలీనం చేయాలని భావిస్తున్నారా? అని ప్రశ్నించారు. బతికుండగానే కోడెలను వేధించిన చంద్రబాబు చనిపోయిన తరువాత పోలిట్‌బ్యూరోలో సంతాపాలు తెలుపడం ఏమి బాగోలేదన్నారు. టీడీపీ జన్మభూమి కమిటీలు దోచుకున్న దోపిడి, చంద్రబాబు అవినీతిపై టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యులు ప్రశ్నించాలన్నారు. అదేవిధంగా మంగళగిరిలో లోకేష్ ఓటమి, కోడెల అరాచకాలపై పోలిట్‌బ్యూరో సమావేశంలో చర్చించాలన్నారు. చంద్రబాబు రెండున్నర లక్షల అప్పు చేసి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని పలాస ఎమ్మెల్యే మండిపడ్డారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో 45 వేల కోట్లు బిల్లులు పెండింగ్‌లో పెట్టారని, అధికారంలో ఉండి గ్రాఫిక్స్ చూపించారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు చేసిన తప్పిదాల వల్లే కరెంట్ కోతలు వచ్చాయనీ.. అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సకాలంలో స్పందించి కరెంట్ కోతలను తగ్గించారన్నారు. చంద్రబాబు చేసిన అవినీతి ఎక్కడ బయట పడుతుందోనని విద్యుత్ పీపీఏలను వ్యతిరేకిస్తున్నారని అన్నారు. చంద్రబాబు గురించి గొప్పగా రాస్తేనే పత్రికా స్వేచ్ఛ ఉన్నట్టా? వ్యతిరేకంగా వార్తలు రాస్తే పత్రికా స్వేచ్ఛ లేనట్టా? అని సందేహం వ్యక్తం పరిచారు. చంద్రబాబు పాలనలో ఏనాడైనా లక్ష 34 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశారా? అంటూ హేళన చేశారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 80 శాతం అమలు చేసి దేశానికి ఏపీ సీఎం జగన్ ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. -
టీడీపీ పొలిట్‌బ్యూరోలోకి కొత్త ముఖాలు
సాక్షి,అమరావతి: టీడీపీ పొలిట్‌బ్యూరోలో కొత్త ముఖాలు కనిపించనున్నాయి. కొత్తగా ముగుర్గు సభ్యుల్ని పొలిట్‌బ్యూర్‌లోకి తీసుకుంటున్నట్టు ఆ పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. పార్టీ సీనియర్ నాయకులు గల్లా జయదేవ్, అచ్చెన్నాయుడు, వర్ల రామయ్యలకు పొలిట్‌బ్యూరోలో చోటు కల్పించనున్నట్టు పేర్కొంది. కాగా, టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం గురువారం ఉదయం 11 గంటలకు గుంటూరులోని రాష్ట్ర టీడీపీ కార్యాలయంలో జరగనుంది. ఈ సమావేశంలో రానున్న సంస్థాగత ఎన్నికలు, పార్టీ కమిటీలపై చర్చించి.. కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టుగా తెలుస్తోంది. సమావేశం ప్రారంభం కాగానే ముందుగా మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుతో పాటు కచ్చులూరు పడవ ప్రమాద మృతులకు పొలిట్‌బ్యూరో సంతాపం తెలుపనుంది. -
ఎంతకీ...కొలిక్కిరాదే!
సాక్షి, తిరుపతి : జిల్లాలో టీడీపీ టికెట్ల పంచాయితీ సాగుతూనే ఉంది. చిత్తూరు, తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, మదనపల్లి, పూతలపట్టు, నగరి, తంబళ్లపల్లి, గంగాధరనెల్లూరు అసెంబ్లీ స్థానాలకు టీడీపీ అభ్యర్థులను ఇంకా ఖరారు చెయ్యలేదు. చిత్తూరు, శ్రీకాళహస్తి, తంబళ్లపల్లి, సత్యవేడులో సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నా.. అక్కడ వారి పరిస్థితి బాగా లేకపోవడంతో వేరొకరిని బరిలో దింపాలనేది చంద్రబాబు ఆలోచన. సిట్టింగ్‌లు కాకుండా మరి కొందరు టికెట్ ఆశిస్తున్న వారిపై చంద్రబాబు సర్వే నిర్వహించారు. ఆ సర్వేలోనూ వారికీ అనుకూలంగా లేకపోవడంతో స్థానిక నాయకులను కొందరిని అమరావతికి పిలిపించుకున్నారు. జనంలో వ్యతిరేక ఉందని సర్వేలు చెబుతున్నది వాస్తవమా? కాదా? అని తెలుసుకునేందుకు అభిప్రాయాలు తీసుకోవడం ప్రారంభించారు. అందులో భాగంగా రోజూ ఒక్కో నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలను రకరకాల ప్రశ్నలు వేస్తూ గెలుపోటములపై అంచనా వేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలను పొమ్మనలేకుండా పొగబెట్టే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. శ్రీకాళహస్తి విషయంలో మాత్రం బొజ్జల కుటుంబానికే ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. తిరుపతి సిట్టింగ్ ఎమ్మెల్యే సుగుణమ్మ పేరు ఖరారు చెయ్యకపోయినా.. ఎన్నికల ప్రచారం చేసుకోమని చెప్పినట్లు తెలిసింది. మిగిలిన వారికి మరోసారి అవకాశం లేదని అమరావతిలో తిష్టవేసి ఉన్న టీడీపీ శ్రేణులు తేల్చిచెబుతున్నాయి. కొత్త వారి కోసం అన్వేషణ జిల్లాలోని పూతలపట్టు, సత్యవేడు, తంబళ్లపల్లి, గంగాధరనెల్లూరు అసెంబ్లీ స్థానాలకు కొత్త వారి కోసం చంద్రబాబు అన్వేషిస్తున్నారు. ప్రస్తుతం టికెట్ ఆశిస్తున్న వారికి సర్వేలో అనుకూలంగా లేకపోవడంతో వేరొకరికి కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. పూతలపట్టు అసెంబ్లీకి లలితకుమారి ఈసారి లేదని చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే రెండు పర్యాయాలు ఓటమి పాలయ్యారని, మరోసారి టికెట్ ఇచ్చి సాహసం చెయ్యలేని తేల్చిచెప్పినట్లు ఆమె అనుచరులు చెబుతున్నారు. దీంతో నాలుగేళ్ల క్రితం కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన సునీల పేరును పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈమె గతంలో కాంగ్రెస్‌లో ఉంటూ మాజీ మంత్రి గల్లా అరుణకుమారికి సన్నిహితురాలిగా ఉన్నట్లు తెలిసింది. పూతలపట్టు నుంచి ఈమె పేరును కొందరు ప్రతిపాదించడంతో సునీలను అమరావతికి పిలిపించినట్లు తెలిసింది. ఆమె శుక్ర, శనివారాల్లో సీఎం చంద్రబాబును కలిశారు. అదేవిధంగా మదనపల్లె నుంచి మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్, మాజీ ఎమ్మెల్సీ నరేష్‌కుమార్‌రెడ్డి, రాందాస్చౌదరికి సర్వేలు అనుకూలంగా లేవని తేలడంతో బీసీ మహిళకు ఇవ్వాలని భావిస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగా బోడిపాటి మమత పేరు తెరపైకి వచ్చినట్లు తెలిసింది. నగరి నేతలు వారం రోజులుగా అక్కడే.. నగరి విషయానికి వస్తే గాలి సోదరులు ఇద్దరు తనకు టికెట్ కావాలని డిమాండ్ చేస్తున్నారు. మరో వైపు అశోక్‌రాజు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వారం రోజులుగా అమరావతిలోనే ఉన్నా ఎవరివైపు చంద్రబాబు మొగ్గుచూపకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ముగ్గురిని కాకుండా కొత్తవారిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. తంబళ్లపల్లె విషయానికి వస్తే సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఈసారి టికెట్ ఇచ్చే పరిస్థితి లేదని తేల్చిచెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక్కడి నుంచి వేరొకరిని బరిలోకి దింపేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. గంగాధరనెల్లూరు విషయానికి వస్తే గుమ్మడి కుతూహలమ్మ కుమారుడి పేరు దాదాపు ఖరారు చేశారని చెబుతున్నా నియోజక వర్గంలో పరిస్థితి బాగోలేకపోవడంతో సందిగ్ధంలో పడినట్లు తెలిసింది. ప్రస్తుతం టికెట్ ఆశిస్తున్న వారి పరిస్థితి బాగోలేకపోవడం.. కొత్త వారు దొరక్కపోవడంతో చంద్రబాబు ఈ రోజు రేపు అంటూ వాయిదా వేస్తూ వస్తున్నారని టీడీపీ శ్రేణులు స్పష్టం చేస్తున్నాయి. -
ఆహ్వానం నుంచి అన్నా టీడీపీ!
సాక్షి, హైదరాబాద్ : నందమూరి హరికృష్ణ.. ఇటు సినిమా రంగంలో అటు రాజకీయాల్లో అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. తండ్రి ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ. అందులో ఎన్టీఆర్ రాష్ట్రాన్ని చుట్టుముట్టిన చైతన్య రథానికి హరికృష్ణ రథసారధి. అలాంటి హరికృష్ణకు సొంత తండ్రి స్థాపించిన తెలుగుదేశం పార్టీలో అవమానాలు తప్పలేదు. సొంత బావ చంద్రబాబు నాయుడు కారణంగా ఆయన పార్టీలో అవమానాలు ఎదుర్కోవలసి వచ్చింది. చంద్రబాబు నాయుడు అనేక సందర్భాల్లో హరికృష్ణను వాడుకుని వదిలేశారన్న విమర్శ ఉంది. మామకు వెన్నుపోటు పొడిచిన సందర్భంలో హరికృష్ణ ఆరోజుల్లో చంద్రబాబునాయుడు పక్షాన నిలిచారు. హరికృష్ణతో పాటు దగ్గుబాటి వెంకటేశ్వరరావు తో సహా మెజారిటీ కుటుంబ సభ్యులు చంద్రబాబు పక్షాన నిలిచారు. అనాడు అధికారం కోసం హరికృష్ణకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చినట్టు చంద్రబాబు వ్యవహరించారు. అయితే చంద్రబాబు మాత్రం హరికృష్ణను తన అవసరాలకు పావుగా వాడుకున్నారన్న విషయం ఆ తర్వాత పరిణామాలు స్పష్టం చేశాయి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఒక్కొక్కరినీ దూరం పెడుతూ వచ్చారు. చంద్రబాబు ఎత్తుగడలో ప్రధానంగా బలైంది నందమూరి హరికృష్ణ. ఎన్టీఆర్ ను గద్దెదింపి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన చంద్రబాబు ఆ తర్వాత కాలంలో హరికృష్ణను మంత్రివర్గంలోకి తీసుకుని రవాణా శాఖ అప్పగించారు. హరికృష్ణ ఎమ్మెల్యే కాకుండానే మంత్రిపదవిని చేపట్టారు. ఆరు మాసాల్లో శాసనసభకు ఎన్నిక కాని కారణంగా ఆయన మంత్రిపదవికి రాజీనామా చేయాల్సివచ్చింది. ఆ తర్వాత 1996లో ఆయన హిందూపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందినప్పటికీ చంద్రబాబు ఆయనను కేబినేట్ లో చేర్చుకోలేదు. ఎన్టీఆర్ మరణంతో ఖాళీ అయిన హిందూపూర్ శాసనసభ స్థానానికి ఉపఎన్నికను జాప్యం చేయించడంలో చంద్రబాబు పాత్ర ఉందని ఆరోజుల్లో వార్తలొచ్చాయి. ఎమ్మెల్యే కాకుండా హరికృష్ణ మంత్రిపదవి చేపట్టి ఆరు నెలలు పూర్తయిన కారణంగా ఆయన పదవికి రాజీనామా చేయాల్సివచ్చింది. పార్టీలో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన సందర్భంగా కూడా హరికృష్ణకు అవమానాలు తప్పలేదు. ఆ తర్వాత రెండోసారి రాజ్యసభ టికెట్టు నిరాకరించడం, పార్టీలో ప్రాధాన్యత తగ్గించడం, ఎన్నికల సమయాల్లో దగ్గరకు చేర్చుకోవడం, పార్టీలో పొలిట్ బ్యూరో సభ్యుడిగా నియమించడం వంటివి చేస్తూ అవసరం తీరగానే ఆయనను పక్కన పెట్టిన సందర్భాలు అనేకం ఉన్నాయని పార్టీ నేతలు గుర్తుచేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో మహానాడుకు ఆహ్వానించకపోవడం, పొలిట్ బ్యూరో సమావేశాల గురించి సమాచారం ఇవ్వకపోవడం వంటివి అనేక చేదు అనుభవాలు హరికృష్ణకు ఎదురయ్యాయి. ఇలాంటి అనేక అనుమానాలు, ఆటుపోట్ల మధ్య ఆయన చంద్రాబాబుపై తిరుగుబాటు జెండా ఎగురవేశారు. బావ దగ్గుబాటి వెంకటేశ్వరరావుతో కలిసి 1999 జనవరి 26 న "అన్నా తెలుగుదేశం పార్టీ'' స్థాపించారు. అబిడ్స్‌లోని తన సొంత హోటల్ ఆహ్వానం కేంద్రంగా ఆయన పార్టీని స్థాపించారు. అన్నా టీడీపీ తరపున ఆయన రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో పర్యటించారు. ఎన్నికల బరిలో ఆపార్టీ ప్రభావం చూపలేకపోయింది. 1999 ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్కసీటు కూడా గెలవలేకపోయింది. ఆ తర్వాత క్రమంలో ఆ తర్వాత కాలంలో కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు ఆయన తిరిగి టీడీపీలో చేరారు. 2008లో ఎట్టకేలకు రాజ్యసభకు పంపినా రాష్ట్ర విభజన తీరును నిరసిస్తూ 2013 ఆగస్ట్ 4న హరికృష్ణ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. -
టీడీపీ పొలిట్‌బ్యూరోలో ముస్లింలకు మొండిచేయి
-
ఏపీ సచివాలయం తెలంగాణకు అప్పగింత?
విజయవాడ: టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం ముగిసింది. హైదరాబాద్‌లో ఉన్న ఏపీ సచివాలయాన్ని తెలంగాణకు అప్పగించడంపై శుక్రవారం చర్చించారు. ఆ ప్రతిపాదనను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పొలిట్ బ్యూరో ముందు ఉంచారు. తెలంగాణకు అప్పగించేందుకు మెజారిటీ సభ్యులు అంగీకారం తెలిపారు. కాగా, ఢిల్లీలోని ఏపీ భవన్ తరహాలో హైదరాబాద్‌లో ఏపీకి ఓ భవనాన్ని కేటాయించేలా తెలంగాణ ప్రభుత్వాన్ని కోరాలని నిర్ణయించారు. అంతకు ముందు చంద్రబాబు నాయుడు గవర్నర్ నరసింహన్‌తో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. హైదరాబాద్‌లో ఏపీ సచివాలయం అప్పగింతపై ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. గవర్నర్ భేటీలో హైదరాబాద్ లో ఏపీ సచివాలయం భవనాలను తెలంగాణ రాష్ట్రానికి అప్పగించేందుకు చంద్రబాబు అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. -
నేడు టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశం శుక్రవారం జరగనుంది. గుంటూరు జిల్లా ఉండవల్లి సమీపంలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో జరిగే ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణలోని పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు హాజరుకానున్నారు. నవంబర్ 1 నుంచి చేపట్టనున్న జనచైతన్యయాత్రలు, సభ్యత్వ నమోదుపై ఈ సమావేశంలో చర్చిస్తారు. అలాగే ఈ నెల 22 నుంచి 24 వరకు జరిగే జిల్లాస్థాయి విసృ్తత సమావేశాలతో పాటు 26, 27 తేదీల్లో జరిగే నియోజకవర్గ సమావేశాలకు పంపించాల్సిన పరిశీలకుల జాబితాపై కూడా చర్చించనున్నారు. -
రైతులపై ప్రభుత్వ నిర్లక్ష్యం తగదు
పాలమూరు : ఎంతో మంది త్యాగాల ఫలితంగా వచ్చిన తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం రైతాంగాన్ని నిర్లక్ష్యం చేస్తోందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. కరువు మండలాల్లో రైతులకు ఎలాంటి సాయం అందటం లేదన్నారు. బ్యాంకులు రుణాలు ఇవ్వకుండా మొండిచేయి చూపుతున్నాయని విమర్శించారు. ఖరీఫ్ సీజన్లో రైతులకు రూ.1,400కోట్లకుగాను సగమైనా రుణాలు ఇవ్వలేకపోయాయన్నారు. రుణమాఫీ కింద విచ్చిన డబ్బులను బ్యాంకర్లు మిత్తికి జమ చేసుకుంటున్నారన్నారు. రెండున్నరేళ్లలో 2,560 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. కేఎల్‌ఐకి కేవలం రూ.243కోట్లు మాత్రమే ఖర్చు చేసి రూ.మూడు వేల కోట్లని టీఆర్ఎస్ నాయకులు ప్రచారం చేసుకుంటున్నారన్నారు. రూ.1,700కోట్లతో ఈ ప్రాజెక్టును టీడీపీ హయాంలోనే మంజూరు చేశామన్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈనెల 19, 20వ తేదీల్లో హైదరాబాద్‌లోని ఇందిరాపార్కులో ‘రైతు నిరసన దీక్ష’ చేపట్టనున్నామన్నారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయాకర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యలపై దాటవేసే ధోరణిలో వ్యవహరిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నాగేశ్వర్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు బక్కని నర్సిములు, ప్రధాన కార్యదర్శి రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఎం.చంద్రశేఖర్, సీతాదయాకర్‌రెడ్డి, మహబూబ్‌నగర్ నియోజకవర్గ ఇన్చార్జి ఎన్.పి.వెంకటేష్, ప్రచార కార్యదర్శి మాల్యాద్రిరెడ్డి, నాయకులు బాలయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
కేసీఆర్‌ది, మీదీ ఒకే విధానం: మోత్కుపల్లి
విజయవాడ: పార్టీ ఫిరాయింపుల విషయంలో కేసీఆర్‌ది, మీది ఒకే విధానమని టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశంలో ఏపీ సీఏం చంద్రబాబును ఉద్దేశించి తెలంగాణ నేత మోత్కుపల్లి నర్సింహులు వ్యాఖ్యానించారు. చంద్రబాబు స్పందించకుండా నవ్వి ఊరుకున్నారు. పార్టీ ఫిరాయింపులు ఇప్పుడు కొత్త కాదని, ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉన్నాయని ఆ తర్వాత చంద్రబాబు వ్యాఖ్యానించారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తుందని, అయితే అభివృద్ధికి ఆకర్షితులై ఎమ్మెల్యేలు పార్టీలోకి వస్తున్నారని చెప్పాలని నిర్ణయించారు. ప్రభుత్వంపై, స్పీకర్‌పై వైఎస్సార్సీపీ అవిశ్వాస తీర్మానం పెడితే రాజకీయంగా ఎదురుదాడి చేయాలని నిర్ణయించారు. -
లోకేష్‌కు జై... ప్రత్యేక హోదాకు నై
ఏయూలో అధికార టీడీపీ రాజకీయ సమావేశాలు నిర్వహిస్తే ఓకే...వీసీ, రిజిస్ట్రార్లు కూడా పాల్గొంటారు. దగ్గరుండీ మరీ టీడీపీ సభ్యత్వాలు చేయించి ఏయూను టీడీపీ ఆఫీసుగా మార్చేస్తారు. చాన్సలర్ గవర్నర్ ఫొటో అవసరం లేదు...యువరాజు లోకేష్ ఫోటో ఉంటే చాలు జై కొడతారు. లోకేష్ బర్త్‌డేను ఏయూ అధికారిక పండుగలా నిర్వహిస్తారు. వీసీ, రిజిస్ట్రార్లు కూడా పరస్పరం కేకులు తినిపించుకుంటూ ఛీర్స్ కొడతారు. ఇదంతా రాజకీయం కాదట... కానీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని ఎవరైనా ప్రొఫెసర్లు కోరితే ‘అమ్మో! అంతపని చేస్తావా!’అని మండిపడతారు. విద్యార్థులు ఏయూ వెలుపల రాజకీయాలకు అతీతంగా నిర్వహించిన సదస్సులో పాల్గొంటే క్రమశిక్షణరాహిత్యమని అంటారు. ప్రత్యేక హోదా సాధిస్తే యువతకు ఉపాధి అవకాశాలువస్తాయి... ప్రభుత్వానికే మంచిపేరు వస్తుందని సూచిస్తే... అది ‘రాజకీయం చేయడం’ కింద జమకడతారు. నోటీసులు జారీ చేస్తారు. ఎందుకంటే... ఏయూ ఉన్నతాధికారులు ప్రభుత్వ పెద్దల చేతుల్లో కీలుబొమ్మలు. ఉన్నత పదవులపై కన్నేసి ‘ప్రభువు’ మనసెరిగి మసలుకుంటున్నవారు. అందుకే ఏయూ ప్రతిష్ట మంటగలుస్తున్నా ప్రభుత్వ ప్రాపకం ఉంటే చాలన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఈ పరిణామాలపై విద్యార్థి లోకం మండిపడుతోంది. బుధవారం ఏయూ బంద్‌కు పిలుపునిచ్చింది. - సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం ప్రొఫెసర్లు ప్రసాదరెడ్డి, అబ్బులులకు నోటీసులు జారీ చేయడంపై ఏయూలోతీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ప్రత్యేక హోదా సాధన వల్ల ప్రయోజనాలను వివరిస్తూ ఆ దిశగా మార్గనిర్దేశం చేయడం ఎలా క్రమశిక్షణారాహిత్యమవుతుందని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. ప్రసాదరెడ్డి క్రమశిక్షణరాహిత్యానికి పాల్పడ్డారని ఇచ్చిన నోటీసులో ఏయూ ఉన్నతాధికారులు చూపించిన కారణాన్ని కూడా విద్యావేత్తలు, విద్యార్థులు తప్పుబడుతున్నారు. ‘ ప్రజాసంఘాలు, ప్రతిపక్షాలు విద్యార్థులతో కలసి పోరాడి ప్రత్యేక హోదా సాధిస్తే ప్రభుత్వానికే మంచిపేరు వస్తుంది. ఆ విషయం తెలిసీ రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రత్యేక హోదా కోసం పోరాడటం అభినందనీయం’ అని ప్రసాదరెడ్డి ప్రసంగించడాన్ని ఏయూ పెద్దలు తప్పుబడుతున్నారు. ఆ మాటల్లో రాజకీయంగానీ ఏయూ ప్రతిష్టకు భంగం కలిగించే అంశంకానీ ఏముందని విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు. అబ్బులు మాట్లాడుతూ ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రానికి వచ్చే రాయితీల వల్ల సివిల్ ఇంజినీరింగ్ రంగంలో ఉపాధి అవకాశాలు ఎంతగా పెరుగుతాయో వివరించారు. ఇందులోనూ రాజకీయపరమైన అంశం లేదు. ప్రభుత్వ పెద్దల ఒత్తిడికి లొంగి, వారి మెప్పు పొందేందుకే ఏయూ ఉన్నతాధికారులు ఇద్దరు ప్రొఫెసర్లకు నోటీసులు జారీ చేశారని క్యాంపస్‌లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఉన్నతాధికారులా?... టీడీపీ కార్యకర్తలా? ఉన్నతాధికారులు క్యాంపస్‌ను టీడీపీ ఆఫీసుగా మార్చేసి ఏయూ ప్రతిష్టను మంటగలిపుతున్నారని విద్యావేత్తలు, విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏడాదికాలంలో ఏయూలో వీసీ, రిజిస్ట్రార్ల సమక్షంలోనే నిర్వహించిన రాజకీయ కార్యకలాపాలను వారు ఉదాహరిస్తున్నారు. టీడీపీ అనుబంధ విభాగం టీఎన్ఎస్ఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఏయూలో నిర్వహించడం రాజకీయ కార్యక్రమం కాదా అని ప్రశ్నిస్తున్నారు. వీసీ, రిజిస్ట్రార్లు టీడీపీ నేతలతో కలసి టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేయించి ఆ పార్టీ కార్యకర్తల్లా వ్యవహరించారని విమర్శిస్తున్నారు. టీడీపీ అనుబంధ విభాగం క్యాంపస్‌లో నిర్వహించిన ఫ్రెషర్స్ డే వేడుకల్లో వీసీ, రిజిస్ట్రార్లు పాల్గొనడాన్ని విద్యార్థులు ప్రస్తావిస్తున్నారు. టీడీపీ అధ్యక్షుడి హోదాలో చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌ల ఫ్లెక్సీలను బ్యానర్‌గా పెట్టి ఆ వేడుకలను నిర్వహించారు. చాన్సలర్ గవర్నర్ ఫొటో లేదు. కానీ లోకేష్ ఫొటో మాత్రం ఉంటే చాలు అన్నట్లుగా వీసీ, రిజిస్ట్రార్లు ఆ కార్యక్రమంలో ఆసాంతం పాల్గొన్నారు. లోకేష్ జన్నదిన వేడుకలను ఏయూ అధికారిక పండుగ తరహాలో నిర్వహించగా అందులో కూడా వీసీ, రిజిస్ట్రార్లు పాల్గొని కేక్‌లు తినిపించుకున్నారు. ఇలా రాజకీయ కార్యకలాపాల్లో వీసీతోసహా ఉన్నతాధికారులు పాల్గొనడంపై విద్యావేత్తలు తీవ్రస్థాయిలో విమర్శించారు. కానీ అవేవీ పట్టని ఉన్నతాధికారులు ‘ప్రభువు’ సేవలో తరించేందుకు క్యాంపస్‌ను టీడీపీ ఆఫీసుగా మార్చేస్తున్నారు. కానీ ప్రత్యేక హోదా కావాలని కోరిన ప్రొఫెసర్లపై మాత్రం కక్షసాధింపునకు పాల్పొడుతున్నారు. ఉన్నతాధికారుల తీరును నిరసనగా బుధవారం ఏయూ బంద్‌కు విద్యార్థులు పిలుపునిచ్చారు. ఏయూ బాటలోనే సెయింట్ పాల్ బీఈడీ కాలేజీ సాక్షి, విశాఖపట్నం యువభేరీ సదస్సులో ఏయూ ప్రొఫెసర్లపైనే కాదు ప్రైవేటు విద్యా సంస్థల విద్యావేత్తలపైనా వేధింపుల పర్వం కొనసాగుతోంది. ప్రత్యేక హోదా ఆవశ్యకతను చెప్పేందుకు యువభేరీ’ సదస్సులో పాల్గొన్న సెయింట్ పాల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపాల్ మన్మథరావును ఆ కాలేజీ యాజమాన్యం వేధింపులకు గురిచేసింది. ఆయనకు నోటీసులు జారీ చేసింది. దాంతో తన ప్రిన్సిపాల్ పదవికి రాజీనామా చేశారు. ప్రత్యేక హోదా కోసం సదస్సులో పాల్గొనడం రాజకీయం ఎలా అవుతుందని ఆయన ప్రశ్నిస్తున్నారు. యాజమాన్యం తీరుకు నిరసనగా ఆయన స్వచ్ఛందంగా తన పదవికి రాజీనామా చేశారు. -
'కేసీఆర్ కేబినెట్లో రౌడీలు, దొంగలు'
ఖమ్మం : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమానికి ద్రోహం చేసిన రౌడీలు, దొంగలు ముఖ్యమంత్రి కేసీఆర్ కేబినెట్లో ఉన్నారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు రేవూరి ప్రకాశ్‌రెడ్డి ఆరోపించారు. ఖమ్మంలోని టీఎన్జీఓ హాల్లో ఆదివారం జరిగిన టీడీపీ జిల్లా స్థాయి మినీ మహానాడుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఉద్యమాన్ని వ్యతిరేకించిన మహేందర్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు మంత్రి పదవులు ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. అధికార వ్యామోహంతో పార్టీలు మారుతున్న వారిని టీఆర్ఎస్ అందలమెక్కిస్తోందని విమర్శించారు. ప్రజాక్షేత్రంలో వారికి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. టీడీపీని సెంటిమెంట్, అధికారంతో దెబ్బతీయలేరన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో కేసీఆర్ హైదరాబాద్‌లో గల్లీగల్లీ తిరుగుతూ మాయ మాటలు చెబుతున్నారని విమర్శించారు. అధికారంతో విర్రవీగుతున్న టీఆర్ఎస్కు ఈ ఎన్నికల్లో ప్రజలు తమ సత్తా ఏమిటో చూపించాలన్నారు. ఎన్నికల ముందు తెలంగాణ వస్తే ఇంటింటికి ఉద్యోగం, దళితులకు మూడెకరాలు, కేజీ టూ పీజీ, నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మిస్తామని చెప్పిన కేసీఆర్ హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. తుమ్మల నాగేశ్వరరావు, ఎంటీసీసీలు, జెడ్పీటీసీలు టీడీపీని వీడడంతో జిల్లాలో పార్టీ పనైపోయిందని ప్రచారం జరుగుతుందని, జిల్లాలో పార్టీకి పెట్టని కోటలా ఉన్న కార్యకర్తల బలమే తమ సత్తా ఏంటో నిరూపిస్తుందన్నారు. వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ మారిన ద్రోహులకు ఓటమి తప్పదన్నారు. అనంతరం టీడీపీ జిల్లా అధ్యక్షుడిని ఎన్నుకున్నారు. రెండోసారి తుళ్లూరి బ్రహ్మయ్య జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ మహానాడులో మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య నియోజకవర్గ ఇన్చార్జిలు పాల్గొన్నారు. -
గండిపేటలోనే మహానాడు...
-
టీడీపీ జాతీయ పార్టీ...విధివిధానాలపై కమిటీ
హైదరాబాద్: ఈ నెల 27, 28, 29 తేదీలలో గండిపేటలోనే మహానాడు నిర్వహించాలని టీడీపీ పోలిట్‌బ్యూరో సమావేశంలో నిర్ణయించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో జరిగిన పోలిట్‌బ్యూరో సమావేశం ముగిసింది. మహానాడు నాటికి అన్ని కమిటీలను భర్తీ చేయాలని నిర్ణయించారు. మహానాడుకు ముందే కర్ణాటక, తమిళనాడు, పాండిచ్చేరిలలో సభ్యత్వ కార్యక్రమం చేపట్టాలని తీర్మానించారు. జాతీయ పార్టీగా టీడీపీని రూపొందించేందుకు ఖరారు చేయవలసిన విధివిధానాలపై యనమల రామకృష్ణుడు, పయ్యావుల కేశవ్‌తో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. నేపాల్‌కు అయిదు కోట్ల రూపాయలు సాయం అందించాలని పోలిట్‌బ్యూరో నిర్ణయించింది. -
నేతలకోన్యాయం.. విద్యార్థులకోన్యాయమా?
కేసీఆర్‌పై మండిపడ్డ సోమిరెడ్డి సాక్షి, హైదరాబాద్: స్థానికత విషయంలో రాజకీయ నేతలకు ఓ న్యాయం, విద్యార్థులకోన్యాయమా అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. స్థానికతకు 1956ను కటాఫ్‌గా నిర్ణయించిన కేసీఆర్.. ఈ ఏడాది జరిగిన సాధారణ ఎన్నికల సమయంలో 1956కు ముందు తెలంగాణలో పుట్టిన వారికే టీఆర్ఎస్ టికెట్టు ఇస్తానని ఎందుకు ప్రకటించలేదో చెప్పాలన్నారు. సోమిరెడ్డి గురువారం ఎన్టీఆర్ భవన్లో విలేకరులతో మాట్లాడారు. 1973లో జారీ చేసిన రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం పదో తరగతికి ముందు నాలుగేళ్లు ఎక్కడ చదివితే అక్కడ స్థానికులవుతారని గుర్తు చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ అంశంలో తెలంగాణ ప్రభుత్వం అన్ని నియమ, నిబంధనలను కాలరాయడం శోచనీయమన్నారు. -
టీడీపీలో అసంతృప్తి జ్వాలలు
జిల్లా తమ్ముళ్లపై చంద్రబాబు తన రాజకీయాన్ని ప్రదర్శించారు. కిమిడి మృణాళినికి పదవిచ్చి జిల్లాకు మంత్రి వర్గంలో ప్రాతినిధ్యం కల్పించినట్టు పైకి కలర్ ఇస్తూ...మరో వైపు జిల్లాలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన కళా వెంకటరావుకు, శ్రీకాకుళం జిల్లాలో కింజరాపు కుటుంబానికి ఆధిపత్యం ఉండేలా జాగ్రత్త పడ్డారు. దీని కోసం జిల్లాకు చెందిన సీనియర్లకు మొండిచేయి చూపారు. కచ్చితంగా తమ నేతలకే మంత్రి పదవులు వస్తాయని ఆశించిన పతివాడ నారాయణ స్వామి నాయుడు, కోళ్ల లలిత కుమారి వర్గాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. సాక్షి ప్రతినిధి, విజయనగరం : టీడీపీలో అసంతృప్తి జ్వాలలు రేగాయి. అధినేత తీరుపై ఆ పార్టీ శ్రేణులు మండి పడుతున్నాయి. సీనియర్లకు చంద్రబాబు తీరని అన్యాయం చేశారని కార్యకర్తలు మండిపడుతున్నారు. పొరుగు జిల్లా నుంచి వచ్చిన నేతకు మంత్రి పదవి ఇచ్చి జిల్లాకు మొండి చేయి చూపారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏడు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికైన పతివాడ నారాయణస్వామినాయుడికి మంత్రి పదవి ఇస్తామని ఊరించి చివరి నిమిషంలో మొండి చేయి చూపడాన్ని ఆయన అనుచరులు జీర్ణిం చుకోలేకపోతున్నారు. ఎన్నికల సమయంలో శ్రీకాకుళం జిల్లా నుంచి కిమిడి మృణాళిని తీసుకొచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేయించారని, అంతటితో ఆగకుండా గెలవగానే మంత్రి పదవి కట్టబెట్టారని ఆక్రోషం వెళ్లగక్కుతున్నారు. పొరుగు జిల్లా నేతైన మృణాళినికి మంత్రి పదవి ఇచ్చి ఆ సామాజిక వర్గానికి చెందిన పతివాడ నారాయణస్వామినాయుడుకు అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో సీనియర్‌గా, విధేయుడిగా ఉన్న పతివాడకు మంత్రి పద వి ఇస్తామని ఊరించారని, పత్రికలు, ఛానళ్లలో కూడా పెద్ద ఎత్తున కథనాలొచ్చాయని కానీ చివరి నిమిషంలో మొండి చేయి చూపడం విచారకరమని ఆవేదన చెందుతున్నారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం డెంకాడ మం డలం పెద తాడివాడలోని ఓ కల్యాణ మండపంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు ప్రత్యేకంగా సమావేశమై చంద్రబాబు తీరును దుయ్యబట్టారు. పార్టీలో చంద్రబాబు కన్నా సీనియర్ అయిన పతివాడకు మంత్రి పదవి ఇవ్వకపోవడం ఆక్షేపణీయమన్నారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న చందం గా చంద్రబాబు వ్యవహరించారని ఆ పా ర్టీ శ్రేణులు విమర్శిస్తున్నాయి. శ్రీకాకు ళం జిల్లాలో కింజరాపు అచ్చన్నాయుడు ఆధిపత్యం కొనసాగాలని కిమిడి కళా వెంకటరావుకు మంత్రి పదవి ఇవ్వలేద ని, అదే సందర్భంలో కిమిడి అసంతృప్తి గురి కాకూడదని ఉద్దేశ్యంతో ఆయన మరదలైన మృణాళినికి విజయనగరం జిల్లా తరపున మంత్రి పదవి ఇచ్చారని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో అదే సామాజిక వర్గానికి చెందిన పతివాడ నారాయణస్వామినాయుడికి మొండి చేయి చూపారని ధ్వజమెత్తుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో కింజరాపు ఫ్యామిలీ ఆధిపత్యం ఉండేలా, విజయనగరం జిల్లాలో కళా వెంకటరావు హవా కొనసాగేలా పథక రచన చేసి జిల్లా నేతలకు దెబ్బకొట్టారని మండి పడుతున్నారు. కోళ్ల లలితకుమారి వర్గీయులు ఇదే తరహాలో విరుచుకుపడుతున్నారు. కాకపో తే, ప్రత్యేకంగా సమావేశం కాలేదు. ఈనెల 12వ మంత్రి విస్తరణ ఉందని, ఆ రోజు బెర్త్ దక్కకపోతే బయటపడదామ నే ఆలోచనలో ఉన్నారని తెలిసింది. వెల మ సామాజిక వర్గం నుంచి ఒకరికి ఇచ్చే అవకాశం ఉందని, ఆ ఛాన్స్ తనకే వస్తుందని ఆశతో కోళ్ల లలితకుమారి ఉన్నారు. ఆ ఉద్దేశ్యంతోనే రోడ్డెక్కొద్దని తన అనుచరులను కోళ్ల సముదాయించి నట్టు తెలిసింది. కక్కలేక, మింగలేక చంద్రబాబు తీసుకున్న నిర్ణయంపై మంత్రి పదవి ఆశించిన పతివాడ నారాయణస్వామినాయుడు, కోళ్ల లలితకుమారి కక్కలేక మింగలేక సతమతమవుతున్నారు. తమ ఆవేదనను బయటపెడితే అధినేత కన్నెర్ర చేస్తారేమోనని భయపడుతున్నారు. రోడ్డెక్కితే భవిష్యత్‌లో వచ్చే అవకాశాలను కోల్పోతామేమోనన్న అభద్రతా భావంలో ఉన్నారు. ఈ క్రమంలోనే వ్యక్తిగతంగా బయటపడకుండా తమ అనుచరుల చేత ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. చంద్రబాబును కలిసేందుకు నిర్ణయం పతివాడకు జరిగిన అన్యాయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాలని సోమవారం సాయంత్రం జరిగిన ప్రత్యేక సమావేశం లో నెల్లిమర్ల నియోజకవర్గ నేతలు నిర్ణయించుకున్నారు. ఈనెల 12న విశాఖ క్యాబినెట్ సమావేశం నిర్వహించినప్పు డు నేతలందరు కలిసికట్టుగా వెళ్లి చంద్రబాబు విజ్ఞాపన పత్రాన్ని ఇవ్వనున్నారు. ఒకవేళ విశాఖలో క్యాబినెట్ సమావేశం జరగకపోతే హైదరాబాద్ వెళ్లి కలవాలని నిర్ణయించారు. అదే విధంగా మంగళవారం అశోక్ బంగ్లాకు వెళ్లి జిల్లా పార్టీ అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్‌ను కలిసి వినతి పత్రం ఇవ్వనున్నారు. పెదతాడివాడలో జరిగిన సమావేశంలో నెల్లిమర్ల మండలం నుంచి సువ్వాడ రవిశేఖర్, గేదెల రాజారావు, బొంతు వెంకటరమ ణ, అవనాపు సత్యనారాయణ, కర్రోజు వెంకట రాజినాయుడు, చింతపల్లి వెంకటరమణ, పూసపాటిరేగ మండలం నుంచి మహంతి చిన్నంనాయుడు, ఆకిరి ప్రసాద్, భూలొక, డెంకాడ మండలం నుంచి కంది చంద్రశేఖర్, పల్లి భాస్కరరావు, పతివాడ అప్పలనాయుడు, భోగాపురం మండలం నుంచి కర్రోతు బంగార్రాజు, కర్రోతు సత్యనారాయణ, సూర్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
డిష్యుం..డిష్యుం
సాక్షి, నెల్లూరు: తెలుగుదేశంలో మాటల యుద్ధం ముగిసి తన్నుల యుద్ధం మొదలైంది. పాతకాపులు, వలస నేతల మధ్య దాడులు షురూ అయ్యాయి. కొత్తగా పార్టీలో చేరిన సర్వేపల్లి ఎమ్మెల్యే ఆదాల ప్రభాకరరెడ్డి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వర్గాలు సోమవారం బాహాబాహీ తలపడ్డాయి. నువ్వెంతంటే.. నువ్వెంతంటూ సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకున్నాయి. వలస నేతల రాకను ఆహ్వానిస్తున్నట్లు నేతలు కడుపులో కత్తులు పెట్టుకొని గాంభీర్యాన్ని ప్రదర్శించినా కార్యకర్తలు దీనిని జీర్ణించుకోలేకున్నారు. టీడీపీలో తుపాను ముందు ప్రశాంతత మాదిరిగా ఉన్న సందర్భంలో చిన్నపాటి సంఘటన పెద్ద తగువుకు తెరలేపింది. ఇదే అదనుగా కొత్త, పాత తెలుగు తమ్ముళ్లు మరింత రెచ్చిపోయారు. ఇందుకు ఇందుకూరుపేట వేదికైంది. వివరాలలోకి వెళితే.. ఇందుకూరుపేట మండలం కొత్తూరుకు చెందిన ఆదాల ప్రభాకర్‌రెడ్డి వర్గీయుడు కైలాసం ఆదిశేషారెడ్డి తమ్ముడు కృష్ణారెడ్డి సతీమణి కైలాసం సుప్రియ కొత్తూరు-2 ఎంపీటీసీ స్థానానికి టీడీపీ తరపున నామినేషన్ వేసింది. ఇదే స్థానానికి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వర్గీయుడైన మాజీ ఎంపీటీసీ సభ్యుడు మునగాల రంగారావు సతీమణి మునగాల సుజాత కూడా నామినేషన్ వేసింది. అయితే సోమిరెడ్డి వర్గానికి చెందిన మునగాల సుజాతకే బీఫాం ఇవ్వాలని పార్టీ నిర్ణయించిందని టీడీపీ మండల అధ్యక్షుడు వీరేంద్ర ఈ విషయాన్ని ఆదిశేషారెడ్డి వర్గీయులకు చె ప్పాడు. దీంతో ఆగ్రహం చెం దిన ఆదాల వర్గీయుడు ఆదిశేషారెడ్డి తాము పోటీ నుంచి ఉపసంహరిం చుకుంటామంటూ అనుచరులతో కలసి ఎన్నికల అధికారి వద్దకు వచ్చారు. అప్పటికే టీడీపీ మండల అధ్యక్షుడు వీరేంద్రతోపాటు సోమిరెడ్డి వర్గీయుడు రంగారావు సైతం అనుచరులతో కలసి ఎన్నికల అధికారి వద్దకు చేరుకున్నారు. ఒకరికొకరు ఎదురు పడిన ఇరువర్గాలు ఒక్కసారిగా ఆగ్రహావేశాలతో రెచ్చిపోయారు. దూషణల పర్వానికి దిగారు. మీరెంత అంటే మీరెంత అంటూ దుర్భాషలాడుకున్నారు. మరింత రెచ్చిపోయిన ఇరువర్గాల వారు తోపులాటకు దిగి పిడిగుద్దులు గుద్దుకున్నారు. సై అంటే సై అంటూ సవాల్ విసురుకున్నాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఎస్సై నాగేశ్వరరావు పోలీసు బలగాలతో అక్కడి చేరుకున్నారు. సోమిరెడ్డి, ఆదాల వర్గాలను చెదరగొట్టారు. పరిస్థితి అదుపు తప్పితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. పరిస్థితి అదుపులోకి వచ్చింది. చివరకు పాతకాపైన సోమిరెడ్డి వర్గీయుడు రంగారావును కాదని కాదని ఆదాల వర్గీయుడైన ఆదిశేషారెడ్డి వర్గానికే టీడీపీ బీఫాం ఇచ్చారు. దశాబ్దాలుగా పార్టీ జెండాలు మోసిన వారికి తీవ్ర అన్యాయం జరుగుతోందని ఓ టీడీపీ సీనియర్ నేత ‘సాక్షి’తో వాపోయారు. గొడవలు ఇంతటితో ఆగవన్నారు. వలస నేతలతో పార్టీ నిలువునా మునగడం ఖాయమన్నారు. -
సమైక్యాంధ్ర సాధనకు ఉద్యమం తీవ్రతరం
నెల్లూరు(దర్గామిట్ట), న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర సాధన కోసం టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర ఆధ్వర్యంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేయనున్నట్లు ఆ పార్టీ నగర నియోజకవర్గ ఇన్చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి తెలిపారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా టీడీపీ అధినేత చంద్రబాబు సోమవారం ఢిల్లీలో ఆమరణ దీక్ష చేస్తున్న నేపథ్యంలో సంఘీభావంగా నెల్లూరులో రాస్తారోకోలు నిర్వహించనున్నట్లు వివరించారు. మైపాడు గేట్, ఆత్మకూరు బస్టాండ్, గాంధీబొమ్మ, వీఆర్సీ, హరనాథపురం, చిల్డ్రన్స పార్క్ సమీపంలోని జాతీయ రహదారిపై ఉదయం 11 నుంచి 12 గంటల వరకు అన్ని చోట్ల ఒకేసారి రాస్తారోకో నిర్వహించనున్నట్లు వివరించారు. సీఎం పదవి కోసం రామనారాయణరెడ్డి గుంటనక్కలా కాచుకొని ఉద్యమాన్ని ఎగతాళి చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీ నాయకులు మండవ రామయ్య, మున్వర్, ధర్మవరపు సుబ్బారావు, బాలకృష్ణచౌదరి, రామకృష్ణారెడ్డి, పడవల కృష్ణమూర్తి, సుబ్బారావు, మురళి, తదితరులు పాల్గొన్నారు.