
సాక్షి,అమరావతి: టీడీపీ పొలిట్‌బ్యూరోలో కొత్త ముఖాలు కనిపించనున్నాయి. కొత్తగా ముగుర్గు సభ్యుల్ని పొలిట్‌బ్యూర్‌లోకి తీసుకుంటున్నట్టు ఆ పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. పార్టీ సీనియర్ నాయకులు గల్లా జయదేవ్, అచ్చెన్నాయుడు, వర్ల రామయ్యలకు పొలిట్‌బ్యూరోలో చోటు కల్పించనున్నట్టు పేర్కొంది. కాగా, టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం గురువారం ఉదయం 11 గంటలకు గుంటూరులోని రాష్ట్ర టీడీపీ కార్యాలయంలో జరగనుంది. ఈ సమావేశంలో రానున్న సంస్థాగత ఎన్నికలు, పార్టీ కమిటీలపై చర్చించి.. కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టుగా తెలుస్తోంది. సమావేశం ప్రారంభం కాగానే ముందుగా మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుతో పాటు కచ్చులూరు పడవ ప్రమాద మృతులకు పొలిట్‌బ్యూరో సంతాపం తెలుపనుంది.
Comments
Please login to add a commentAdd a comment