
సాక్షి, అమరావతి : ప్రభుత్వ సొమ్మును దొంగతనం చేశాడు కాబట్టే టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు జైలుకు వెళ్లాడని ఉప ముఖ్యమంత్రి సుభాష్ చంద్రబోస్ అన్నారు. తమ దగ్గర స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని తెలిపారు. బుధవారం శాసన మండలిలో అచ్చెన్నాయుడు అరెస్ట్‌పై టీడీపీ ఎమ్మెల్సీ జగదీశ్వర రావు చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. పార్లమెంట్ చరిత్రలో.. మీ జన్మలో బీసీలను రాజ్యసభకు పంపించారా?.. టీడీపీ పాలనలో బీసీలకు బడ్జెట్ పెట్టారా? అని ప్రశ్నించారు. బీసీల గురించి మాట్లాడే హక్కు టీడీపీ నేతలకు లేదని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment