
టీడీపీ జాతీయ పార్టీ...విధివిధానాలపై కమిటీ
హైదరాబాద్: ఈ నెల 27, 28, 29 తేదీలలో గండిపేటలోనే మహానాడు నిర్వహించాలని టీడీపీ పోలిట్బ్యూరో సమావేశంలో నిర్ణయించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో జరిగిన పోలిట్బ్యూరో సమావేశం ముగిసింది. మహానాడు నాటికి అన్ని కమిటీలను భర్తీ చేయాలని నిర్ణయించారు. మహానాడుకు ముందే కర్ణాటక, తమిళనాడు, పాండిచ్చేరిలలో సభ్యత్వ కార్యక్రమం చేపట్టాలని తీర్మానించారు.
జాతీయ పార్టీగా టీడీపీని రూపొందించేందుకు ఖరారు చేయవలసిన విధివిధానాలపై యనమల రామకృష్ణుడు, పయ్యావుల కేశవ్తో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. నేపాల్కు అయిదు కోట్ల రూపాయలు సాయం అందించాలని పోలిట్బ్యూరో నిర్ణయించింది.