సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశం శుక్రవారం జరగనుంది. గుంటూరు జిల్లా ఉండవల్లి సమీపంలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో జరిగే ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణలోని పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు హాజరుకానున్నారు. నవంబర్ 1 నుంచి చేపట్టనున్న జనచైతన్యయాత్రలు, సభ్యత్వ నమోదుపై ఈ సమావేశంలో చర్చిస్తారు. అలాగే ఈ నెల 22 నుంచి 24 వరకు జరిగే జిల్లాస్థాయి విసృ్తత సమావేశాలతో పాటు 26, 27 తేదీల్లో జరిగే నియోజకవర్గ సమావేశాలకు పంపించాల్సిన పరిశీలకుల జాబితాపై కూడా చర్చించనున్నారు.
నేడు టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం
Published Fri, Oct 21 2016 1:00 AM | Last Updated on Sat, Aug 18 2018 3:49 PM
Advertisement
Advertisement