స్థానికత విషయంలో రాజకీయ నేతలకు ఓ న్యాయం, విద్యార్థులకోన్యాయమా అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు.
కేసీఆర్‌పై మండిపడ్డ సోమిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: స్థానికత విషయంలో రాజకీయ నేతలకు ఓ న్యాయం, విద్యార్థులకోన్యాయమా అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. స్థానికతకు 1956ను కటాఫ్‌గా నిర్ణయించిన కేసీఆర్.. ఈ ఏడాది జరిగిన సాధారణ ఎన్నికల సమయంలో 1956కు ముందు తెలంగాణలో పుట్టిన వారికే టీఆర్‌ఎస్ టికెట్టు ఇస్తానని ఎందుకు ప్రకటించలేదో చెప్పాలన్నారు.
సోమిరెడ్డి గురువారం ఎన్టీఆర్ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. 1973లో జారీ చేసిన రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం పదో తరగతికి ముందు నాలుగేళ్లు ఎక్కడ చదివితే అక్కడ స్థానికులవుతారని గుర్తు చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ అంశంలో తెలంగాణ ప్రభుత్వం అన్ని నియమ, నిబంధనలను కాలరాయడం శోచనీయమన్నారు.