NTR Bhavan
-
రాష్ట్రవ్యాప్తంగా రాజకోటల్లా టీడీపీ ఆఫీసులు
సాక్షి, అమరావతి: సర్కారు స్థలాలు, పేదల భూములను లాక్కుని పచ్చ భవనాలు నిర్మించుకున్న టీడీపీ పెద్దలు సుద్దులు వల్లించడం గురివింద సామెతను గుర్తు చేస్తోంది. అధికారంలో ఉండగా ఎన్టీఆర్ భవన్ల పేరుతో అత్యాధునిక కార్యాలయాలు సమకూర్చుకున్న టీడీపీ రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. వాగు పోరంబోకు, రైతుల భూమిని కబ్జా చేసి మంగళగిరిలో అత్యంత విలాసవంతమైన టీడీపీ జాతీయ కార్యాలయాన్ని నిర్మించుకోగా విశాఖలో దసపల్లా భూముల్లో పాగా వేసి పచ్చ భవనాలు కట్టుకున్నారు. విజయవాడ ఆటోనగర్‌లో ఇరిగేషన్ స్థలం.. శ్రీకాకుళంలో దళితులకు కేటాయించిన భూమి.. కాకినాడలో జెడ్పీ స్థలం.. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లెక్క చాంతాడును తలపిస్తుంది. ఇవన్నీ ఎన్టీఆర్ భవన్‌లే. అధికారం మాటున చంద్రబాబు సమకూర్చుకున్న పార్టీ కార్యాలయాలు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఉంటున్న ఉండవల్లి కరకట్ట నివాసమే అక్రమాలకు కేరాఫ్ అడ్రస్ లాంటిది. నిబంధనలు, చట్టాలకు తూట్లు పొడిచి కృష్ణా నది ఒడ్డున కట్టిన ఆ విలాస రాజ భవనంలోనే చంద్రబాబు ఎనిమిదేళ్లుగా నివాసం ఉంటున్నారు. అక్రమాల బాటలో రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్ భవన్ల పేరుతో విలాసవంతమైన కోటలు కట్టేశారు. వీటిని కప్పిపుచ్చి నిస్సిగ్గుగా వైఎస్సార్సీపీ కార్యాలయాలపై బురద జల్లడంపై విస్మయం వ్యక్తమవుతోంది.పార్టీలకు భూముల జీఓ ఇచ్చిందే బాబునిజానికి చంద్రబాబు గతంలో అధికారంలో ఉన్నప్పుడే రాజకీయ పార్టీలకు భూములు కేటాయించే విధానాన్ని తెచ్చారు. ఇందుకోసం 2016 జూలై 21న జీఓ నెంబర్ 826 విడుదల చేశారు. రాజధానిలో మూడు కేటగిరీలుగా పార్టీలకు భూములు కేటాయించాలని అందులో పేర్కొన్నారు. మొదటి కేటగిరీలో జాతీయ రాజకీయ పార్టీ / గుర్తింపు పొందిన రాష్ట్ర రాజకీయ పార్టీకి అసెంబ్లీలో 50 శాతానికి పైగా బలం ఉంటే 4 ఎకరాలు కేటాయించాలి. రెండో కేటగిరీ కింద అసెంబ్లీలో 25 నుంచి 50 శాతం బలం ఉన్న పార్టీలకు అర ఎకరం కేటాయించాలి. మూడో కేటగిరీలో 25 శాతం కంటే తక్కువ ఉన్న పార్టీలకు వెయ్యి గజాల స్థలం కేటాయించాలి. దీని ప్రకారం అప్పట్లో టీడీపీకి 4 ఎకరాలు, నాడు 67 స్థానాలతో ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్సీపీకి అర ఎకరం పొందే అర్హత లభించింది. జిల్లా కేంద్రాల్లోనూ ఇదే విధానం ప్రకారం మొదటి కేటగిరీలో ఉన్న పార్టీలకు రెండు ఎకరాలు, రెండో కేటగిరీలో ఉన్న పార్టీలకు వెయ్యి గజాలు, మూడో కేటగిరీలో ఉన్న పార్టీలకు 300 గజాలు ఇవ్వాలన్నది జీవో సారాంశం. ఏడాదికి వెయ్యి రూపాయల చొప్పున 33 ఏళ్ల లీజుకు ఈ విధానంలో భూములు కేటాయించాలని నిర్ణయించారు. నియోజకవర్గ కేంద్రాల్లోనూ ఇదే విధానం ప్రకారం 30 సెంట్లు కేటాయించాలని 2017 డిసెంబర్ 8న మరో జీఓ 340 జారీ చేశారు.గతంలో చంద్రబాబు ప్రభుత్వం జారీ చేసిన జీవో రాజకీయ పార్టీలకు భూముల కేటాయింపులకు సంబంధించి 2016లో చంద్రబాబు ప్రభుత్వం జారీ చేసిన జీవో లీజు నిబంధనలు బేఖాతర్తాను ఇచ్చిన జీవోకు అనుగుణంగా రాజధానితోపాటు జిల్లా కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల్లో టీడీపీ కార్యాలయాల కోసం చంద్రబాబు వరసగా భూములు కేటాయించుకున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుల పేరిట ఈ భూములు కేటాయిస్తూ ప్రత్యేకంగా జీవోలు జారీ చేశారు. 175 నియోజకవర్గాల్లోనూ టీడీపీ కార్యాలయాల నిర్మాణానికి ప్రణాళిక రూపొందించి చాలాచోట్ల భూములు కేటాయించి ఆగమేఘాల మీద భవనాలు కూడా కట్టేశారు. నాడు చంద్రబాబు ప్రకటించిన విధానం ప్రకారం 33 ఏళ్ల లీజుకు భూములు కేటాయించాలి. అయితే ఆ నిబంధనను కొన్నిచోట్ల ఉల్లంఘించి ఏకంగా 99 ఏళ్ల పాటు లీజుకు కేటాయించేసుకున్నారు. మంగళగిరి, కాకినాడ, శ్రీకాకుళంలో 99 ఏళ్ల లీజుకు భూములు తీసుకున్నారు. ముఖ్యమైన నగరాలు, పట్టణాల్లో అత్యంత విలువైన భూముల్లో స్థలాలు కేటాయించుకొని కార్యాలయాలు నిర్మించి ఇప్పుడు అక్కడి నుంచే పార్టీ కార్యకలాపాలు నడిపిస్తున్నారు. అదే జీవో ప్రకారం వివిధ జిల్లాల్లో వైఎస్సార్సీపీ 33 ఏళ్లకు లీజుకు తీసుకుంటే అదేదో ఘోరం అనే రీతిలో దుష్ప్రచారానికి తెర తీశారు.హైదరాబాద్‌లో రాత్రికి రాత్రేఉమ్మడి రాష్ట్రంలోనూ చంద్రబాబు అత్యంత విలువైన స్థలాలను టీడీపీ కార్యాలయాల కోసం సొంతం చేసుకున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లో అత్యంత ఖరీదైన ఎకరం స్థలాన్ని రాత్రికి రాత్రే కేటాయించేసుకున్నారు. వాణిజ్య భూమిగా హైదరాబాద్ పట్టణాభివృద్ధి సంస్థ (హుడా) చేతిలో ఉన్న ఆ స్థలాన్ని 1997 ఏప్రిల్ 30న జూబీ్లహిల్స్ మున్సిపాలిటీ నుంచి షేక్‌పేట ఎమ్మార్వోకు బదలాయించారు. ఆయన అదేరోజు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టీగా ఉన్న డి.శ్రీనివాసరావు పేరు మీదకు మార్చారు. అదే రోజున ట్రస్టుకు స్థలాన్ని కేటాయిస్తూ ప్రభుత్వం జీవో ఇవ్వటం గమనార్హం. ఈ పనులన్నీ గంటల వ్యవధిలో జరిగిపోయాయి. అంతటి విలువైన స్థలాన్ని నెలకు రూ.7,500 అద్దెకు చంద్రబాబు కేటాయించుకున్నారు. హైటెక్ సిటీ నిర్మాణ బాధ్యతలు దక్కించుకున్న ఎల్ అండ్ టీ సంస్థ ద్వారా అత్యాధునిక హంగులతో ఎన్టీఆర్ భవన్‌ను నిర్మించుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో జిల్లాల వారీగా టీడీపీ కార్యాలయాలకు భూములు కేటాయించుకున్న చంద్రబాబు 2014లో అధికారంలోకి వచ్చాక కూడా అదే తీరును కొనసాగించారు.పోరంబోకు భూమికి మంగళం!ప్రస్తుతం చంద్రబాబు, టీడీపీ నేతలు సకల విలాసాలతో దర్జాగా మీడియా, పార్టీ సమావేశాలు నిర్వహిస్తున్న మంగళగిరిలోని టీడీపీ కార్యాలయం స్థలం కోల్‌కతా–చెన్నై హైవేను ఆనుకుని ఉంది. 3.65 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ స్థలం విలువ రూ.75 కోట్లకుపైనే ఉంటుంది. ఇందులో వాగు పోరంబోకు, కాలువ భూమి, రైతులకు కేటాయించిన డి పట్టా భూములూ ఉన్నాయి. కాలువను పూడ్చి... పోరంబోకు భూమిని ఆక్రమించి... రైతుల భూములను కబ్జా చేసి మరీ టీడీపీ జాతీయ కార్యాలయం కట్టారు. 99 ఏళ్ల లీజుకు కేటాయించుకున్న ఈ స్థలానికి ఏడాదికి చెల్లించేది ఎకరాకు రూ.1,000 మాత్రమే. నిజానికి ఆ భూమికి సంబంధించి 1974లోనే బొమ్ము రామిరెడ్డి పేర 0.65 సెంట్లు, కొల్లా రాఘవరావు పేరిట 1.75 ఎకరాలు, కొల్లా భాస్కరరావు పేరిట 1.75 ఎకరాలను డి పట్టాలుగా ఇచ్చారు. వారిని బలవంతంగా తరిమేసి సాగు చేస్తున్న పంటలను పొక్లెయిన్లతో దున్నేసి రాత్రికి రాత్రే టీడీపీ నేతలు స్వాధీనం చేసుకున్నారు. బాధిత రైతులు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నా పట్టించుకోకుండా చంద్రబాబు పార్టీ భవనం కట్టేశారు. ఆ రైతుల తరపున మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు ఇప్పుడు సుప్రీంకోర్టు విచారణలో ఉంది. 8 అంతస్తుల విలాసవంతమైన ఈ ఎన్టీఆర్ భవన్‌ను అనుమతి లేకుండా నిర్మించేశారు. ఉల్లంఘనలు, అక్రమాలకు పర్యాయపదం టీడీపీ జాతీయ కార్యాలయం.గుంటూరులోనూ గుటకాయ స్వాహాతొలుత 2015లో గుంటూరు అరండల్‌పేటలోని పిచుకలగుంటలో టీడీపీ రాష్ట్ర కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. వెయ్యి గజాల స్థలాన్ని కార్పొరేషన్ నుంచి లీజుకు తీసుకుని అదనంగా పక్కనే ఉన్న మరో 1,500 గజాల స్థలాన్ని ఆక్రమించి ఈ భవనాన్ని నిర్మించారు. మున్సిపల్ స్థలాలను లీజుకు ఇచ్చే పరిస్థితి లేకపోయినా చంద్రబాబు బలవంతంగా ఈ భూమిని లీజుకు తీసుకున్నారు. అధికారులపై ఒత్తిడి తెచ్చి కౌన్సిల్లో తీర్మానం చేయించి ఆక్రమించిన స్థలంతో కలిపి 2,500 గజాల స్థలాన్ని క్రమబద్ధీకరించుకుని పార్టీ భవనం కట్టేశారు.సిక్కోలులో దళితుల భూమిలో పాగాశ్రీకాకుళంలో ఎస్సీల ఇళ్ల స్థలాల కోసం సాంఘిక సంక్షేమ శాఖ సేకరించిన భూమిని టీడీపీ కార్యాలయానికి తీసుకున్నారు. ఉడా, కార్పొరేషన్ అధికారుల అనుమతి లేకుండా పార్టీ భవనాన్ని నిర్మించారు. అంతటితో ఆగకుండా పక్కనే ఉన్న మరికొంత స్థలాన్ని ఆక్రమించేశారు. 80 అడుగుల ప్రధాన రోడ్డులో ఉన్న ఈ స్థలం విలువ 2017లోనే అనధికారికంగా రూ.20 కోట్లు ఉంది. ఏడాదికి రూ.25 వేల చొప్పున 99 సంవత్సరాల లీజుకు తీసుకున్న ఈ స్థలంలో టీడీపీ కార్యాలయాన్ని నిర్మించి 2019 ఎన్నికలకు నాలుగు నెలల ముందు స్వయంగా చంద్రబాబే ప్రారంభించారు.కాకినాడలో జెడ్పీ స్థలంపై కన్నేసి..కాకినాడలో విలువైన జిల్లా పరిషత్ స్థలాన్ని టీడీపీ కార్యాలయానికి కేటాయించుకుని విలాసవంతమైన భవనాన్ని కట్టారు. మేడలైన్ ఆఫ్ కాకినాడ ప్రాంతంలో 2 వేల గజాలను 99 ఏళ్ల లీజుకి జిల్లా పరిషత్ తీర్మానం ద్వారా టీడీపీ పరం చేశారు. ఈమేరకు 2016 నవంబర్ 1న భూమిని కేటాయిస్తూ జీవో జారీ చేశారు. దీని విలువ రూ.10 కోట్లకు పైమాటే.బెజవాడ నడిబొడ్డున రూ.40 కోట్ల స్థలంవిజయవాడ నడిబొడ్డున ప్రజావసరాలకు ఉపయోగపడే విలువైన భూమిని అప్పటి జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా ఒత్తిడితో టీడీపీ కార్యాలయానికి అప్పగించారు. గుణదల పరిధిలోకి వచ్చే ఆటోనగర్–గురునానక్ కాలనీకి ఆనుకుని ఇరిగేషన్ శాఖకు 95 సెంట్ల భూమి ఉంది. ఇరిగేషన్ విభాగం ఫ్లోరేజి, ఇతర పనుల కోసం దీన్ని వినియోగించేవారు. ఇందులో కార్యాలయం కూడా ఉండేది. అయితే టీడీపీ ఆఫీసు కోసం దీన్ని ఇవ్వాలని అధికార యంత్రాంగంపై ఒత్తిడి తెచ్చి కూల్చేశారు. ఇరిగేషన్ మెటీరియల్, యంత్రాలను మరోచోటకు తరలించారు. అన్ని అభ్యంతరాలనూ తోసిరాజని 99 ఏళ్ల లీజుకిచ్చేశారు. ఆటోనగర్ పరిధిలో ఉన్న ఈ స్థలాన్ని పారిశ్రామిక అవసరాలకు మాత్రమే వాడాలనే నిబంధన ఉన్నా ఐలా పాలకవర్గాన్ని బెదిరించి నోరు మూయి ంచారు. వాణిజ్య భూమిగా కన్వర్షన్ చేసి టీడీపీ కార్యాలయం నిర్మించుకున్నారు. దీని విలువ రూ.40 కోట్లకు పైమాటే. విశాఖలో దసపల్లా కొండను తొలచి..విశాఖపట్నంలో దసపల్లా కొండను తొలిచి మరీ టీడీపీ కార్యాలయాన్ని కట్టేశారు. దసపల్లా భూముల్లో 2 వేల గజాల్ని 33 ఏళ్ల పాటు ఏడాదికి రూ.25 వేలు లీజు చొప్పున 2002లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం టీడీపీకి కేటాయించింది. ఆ స్థలంతోపాటు పక్కనే ఉన్న కొండను (మరో వెయ్యి గజాల మేర) కూడా ఆక్రమించి 2016లో టీడీపీ కార్యాలయాన్ని నిర్మించారు. టౌన్ ప్లానింగ్ అనుమతులు లేకుండానే జీ+3 భవనం నిర్మించి 2018లో లోకేశ్ ప్రారంభించారు. -
అవును.. అప్పుడు పేదలు గట్కే తిన్నరు
సాక్షి, హైదరాబాద్: ‘నాడు ఆకలి రాజ్యమేలింది. తెలంగాణ, రాయలసీమల్లోని కొన్ని ప్రాంతాల్లో జొన్న గట్క, సజ్జలు, ఒట్టు వడ్లు, నల్లవడ్లు, మొక్కజొన్న గట్క తిని పేదలు బతికేవారు. మా ఊళ్లో మేం గట్క తిని, గంజి తాగేవాళ్లం. ఎన్టీఆర్ తీసుకొచ్చిన రెండు రూపాయలకు కిలోబియ్యం పథకం వల్లే ఆకలి రాజ్యంపోయింది’అని తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు. ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ధ్వజమెత్తిన నేపథ్యంలో కాసాని సోమవారం ఎన్టీఆర్ భవన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు వ్యాఖ్యలను సమర్థిస్తూ నిరంజన్‌రెడ్డి దొరలు రాసిచ్చిన స్క్రిప్టు చదవడం మానేయాలని ఎద్దేవా చేశారు. 15 రోజులలోనే ఒట్టు వడ్ల పంట వచ్చేదని, ఆ 15 రోజులలోనే కొన్ని వేలమంది ప్రజలు తిండికి అలమటించేవారని గుర్తుచేశారు. అలాంటి గడ్డు పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ పేదలకు కడుపు నిండా తినే అవకాశం రూ.2 కిలో బియ్యం పథకం ద్వారా ఇచ్చారని పునరుద్ఘాటించారు. కారంతో ముద్ద తిని ఆకలి తీర్చుకున్న ఆ రోజుల్లో ధమ్ బిర్యానీ ఎక్కడ దొరికిందో నిరంజన్‌రెడ్డి చెప్పాలని, హైదరాబాద్‌లోని పాతబస్తీ హోటళ్లలో దొరికిన ధమ్ బిర్యానీ మహబూబ్‌నగర్‌లో దొరికిందా అని ప్రశ్నించారు. దొరలకు కూడా ఆనాడు సన్న బియ్యం దొరికేది కాదని, రాజహంస అనే బియ్యం అక్కడక్కడ లభించేవని పేర్కొన్నారు. పచ్చజొన్నలు తినడం కరెక్టు కాదా? ఎన్టీఆర్ రూ.2 కిలో బియ్యం ఇచ్చారా.. లేదా..? ఆహార భద్రత తెలుగుదేశం పార్టీ వచ్చాకే వచ్చిందనడం వాస్తవం కాదా? చర్చకు ఎక్కడకు రమ్మంటే అక్కడకు వస్తామని ఆయన సవాల్ విసిరారు. -
సైకిల్ పైనే షాపింగ్.. పార్టీ ఆఫీసుల కోసం బరితెగించింది చంద్రబాబే
సాక్షి, అమరావతి: నిబంధనలకు లోబడి వైఎస్సార్సీపీ కార్యాలయాల కోసం రెండుమూడు చోట్ల రాష్ట్ర ప్రభుత్వం భూములు కేటాయించడాన్ని చిలవలు పలువలు చేసి రాద్ధాంతం చేస్తున్న ‘ఈనాడు’కు చంద్రబాబు హయాంలో అడ్డగోలుగా టీడీపీ కార్యాలయాలకు భూ సంతర్పణలు కానరాలేదు. ఐదేళ్ల టీడీపీ పాలనలో రూ.వందల కోట్ల విలువైన భూములు ఆ పార్టీ పరమయ్యాయి. నాడు చంద్రబాబు కేవలం తమ పార్టీకే భూములు దక్కేలా 2016లో ఒక జీవో ఇచ్చారు. దాన్ని అడ్డుపెట్టుకుని అత్యంత విలువైన భూములను 33ఏళ్లు, మరికొన్నింటిని 99 ఏళ్ల లీజుపై కారుచౌకగా టీడీపీకి కట్టబెట్టారు. సమీపంలోని ప్రభుత్వ, పేదల స్థలాలను సైతం ఆక్రమించి టీడీపీ కార్యాలయాలను నిర్మించుకున్నారు. పసుపు రంగుతో కనిపించే విలాసవంతమైన టీడీపీ కార్యాలయ భవనాల వెనుక ఎన్నో దురాగతాలు, అన్యాయాలున్నాయి. రైతుల కడుపుకొట్టి.. వాగు భూమిని ఆక్రమించి ప్రస్తుతం చంద్రబాబు దర్జాగా సమావేశాలు నిర్వహిస్తున్న మంగళగిరిలోని టీడీపీ రాష్ట్ర కార్యాలయమైన ఎన్టీఆర్ భవన్ పునాదుల్లో పేద రైతు కుటుంబాలు ఛిద్రమైపోయాయి. జాతీయ రహదారి పక్కన కబ్జా చేసిన స్థలంలో విలాసవంతంగా కార్పొరేట్ హంగులతో భవన నిర్మాణంపై కోర్టు కేసులు దాఖలయ్యాయి. ఆత్మకూరు సర్వే నెంబర్ 392లో 3.65ఎకరాల భూమిని 99 ఏళ్ల లీజుపై టీడీపీ కార్యాలయానికి చంద్రబాబు కేటాయించుకున్నారు. సుమారు రూ.50కోట్ల విలువైన ఈ భూమిని ఏడాదికి ఎకరానికి రూ.వెయ్యి లీజుపై కేటాయిస్తూ 2017లో చంద్రబాబు ప్రభుత్వం జీవో ఇచ్చింది. అయితే ఇదే భూమిని 1974లో ప్రభుత్వం అదే గ్రామానికి చెందిన బొమ్ము రామిరెడ్డి, కొల్లా రఘురాఘవరావు, కొల్లా భాస్కరరావు మరికొందరు రైతులకు కేటాయించి పట్టాలు ఇవ్వడం గమనార్హం. వారంతా అప్పటి నుంచి అందులో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. తమకు జరిగిన అన్యాయంపై రైతులు కోర్టుకెళ్లి స్టే ఆర్డర్ తెచ్చుకున్నా అధికారమదంతో చంద్రబాబు సర్కారు ఖాతరు చేయలేదు. పక్కనే ఉన్న వాగు స్థలాన్ని కూడా పూడ్చేసి టీడీపీ కార్యాలయాన్ని నిర్మించారు. అన్యాయానికి గురైన రైతుల్లో కొందరు టీడీపీ సానుభూతిపరులూ ఉండటం గమనార్హం. బెజవాడ ఆటోనగర్‌లో రూ.25 కోట్ల స్థలం విజయవాడ నడిబొడ్డున ఆటోనగర్–గురునానక్ నగర్ కాలనీ మధ్యలో ఉన్న 93 సెంట్ల స్థలాన్ని 2016 జూలైలో టీడీపీ కాజేసింది. అప్పట్లోనే దీని విలువ రూ.25 కోట్ల పైమాటే. ఇరిగేషన్ శాఖకు చెందిన అత్యంత విలువైన స్థలాన్ని నాటి మంత్రి దేవినేని ఉమ కృష్ణా జిల్లా టీడీపీ కార్యాలయానికి ధారాదత్తం చేశారు. ఇరిగేషన్ అవసరాలకు ఈ స్థలం కావాలని అధికారులు చెబుతున్నా వినకుండా జిల్లా పార్టీ అధ్యక్షుడితో స్థలం కోసం దరఖాస్తు చేయించి వెంటనే ఇచ్చేశారు. ఏడాదికి కేవలం రూ.వెయ్యి చొప్పున 33ఏళ్లు లీజుకిచ్చారు. గుంటూరులో కార్పొరేషన్ స్థలం కబ్జా.. గుంటూరు అరండల్‌పేటలోని వెయ్యి గజాల విలువైన స్థలాన్ని టీడీపీ కారుచౌకగా కొట్టేసింది. ఉమ్మడి రాష్ట్రంలో 1999 జూలై 1న ఈ స్థలాన్ని 30 ఏళ్ల లీజుకు టీడీపీ నేతలు తీసుకున్నారు. అనంతరం ఆ స్థలంతోపాటు పక్కనే ఉన్న 1,637 గజాల కార్పొరేషన్ స్థలాన్ని కూడా కబ్జా చేసి పార్టీ కార్యాలయాన్ని నిర్మించేశారు. లీజు డబ్బులను కూడా చెల్లించలేదు. ఆ భవనానికి ఎలాంటి అనుమతులు లేకపోవడం గమనార్హం. దసపల్లా భూముల్లో టీడీపీ ఆఫీసు విశాఖ మహారాణిపేటలోని దసపల్లా భూమిని పార్టీ కార్యాలయం కోసం చంద్రబాబు కేటాయించుకున్నారు. సర్వే నం.1196/7లోని రెండు వేల గజాల స్థలాన్ని 33 ఏళ్ల పాటు ఏడాదికి రూ.25 వేలు చొప్పున లీజుపై టీడీపీ కార్యాలయానికి 2002లో కేటాయించుకున్నారు. 2014లో అధికారంలో ఉండగా అక్కడ పార్టీ కార్యాలయాన్ని కట్టేశారు. పక్కన ఉన్న కొండను తొలగించి 160గజాలు ఆక్రమించి కార్యాలయాన్ని నిర్మించారు. శ్రీకాకుళం దళితుల భూమిలో.. శ్రీకాకుళంలో దళితుల ఇళ్ల స్థలాల కోసం సేకరించిన స్థలాన్ని టీడీపీ గుంజుకుని పార్టీ కార్యాలయాన్ని నిర్మించుకుంది. నగరంలోని 80 అడుగుల రోడ్డులో దళితులకు ఇళ్ల స్థలాల కోసం సాంఘిక సంక్షేమ శాఖ గతంలో భూముల్ని సేకరించి పంచింది. అందులో రెండు ఎకరాలు మిగలగా గురుకుల హాస్టల్ కట్టాలని భావించారు. దీనిపై కన్నేసిన టీడీపీ నేతలు 2015 సెప్టెంబర్‌లో కారుచౌకగా 99 ఏళ్లకు ఏడాదికి రూ.25వేల చొప్పున పార్టీ కార్యాలయం కోసం లీజుకు తీసుకున్నారు. దాని విలువ ఇప్పుడు రూ.40 కోట్ల పైమాటే. కాకినాడలో జడ్పీ స్థలం.. కాకినాడ కచేరిపేట (మేడ్లైన్ ప్రాంతం)లోని సర్వే నెంబర్ 60/1లో జిల్లా పరిషత్‌కు చెందిన రెండు వేల గజాల స్థలాన్ని టీడీపీ అప్పనంగా సొంతం చేసుకుంది. ఎన్టీఆర్ ట్రస్టు భవన్ పేరుతో ఏటా రూ.25 వేల లీజుతో 99 ఏళ్లకు కేటాయించారు. 2015లో జీవో తెచ్చి వెంటనే పార్టీ కార్యాలయాన్ని నిర్మించారు. ఇది కాకినాడలోనే అత్యంత ఖరీదైన ప్రాంతం కావడం గమనార్హం. మరికొన్ని నిర్వాకాలివీ.. ►చిలకలూరిపేటలో నాగార్జున సాగర్ కాలువ భూమి 20 సెంట్లు (2017లో) ►అనంతపురం జిల్లా రాప్తాడులో 1.10 ఎకరాల దేవుడి మాన్యం ►కర్నూలులో 25 సెంట్ల మున్సిపల్ స్థలం ►చిత్తూరులోని గాండ్లపల్లిలో 1.20 ఎకరాలు ఇతరులకు అవకాశం లేకుండా.. 2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే పార్టీ కార్యాలయాల ముసుగులో విలువైన భూముల్ని కొట్టేయడానికి చంద్రబాబు పథకం రూపొందించారు. అన్ని జిల్లా కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాలు, కుదిరితే మండల కేంద్రాల్లో కూడా భూముల్ని కాజేసేందుకు తెర తీశారు. పార్టీ కార్యాలయాలకు నామమాత్రపు ధరకు 99 ఏళ్ల లీజుపై కేటాయించేందుకు వీలుగా 2016 జూలై 22న ఉత్తర్వులు జారీ చేశారు. టీడీపీ మినహా మరే ఇతర పార్టీకి భూములు దక్కకుండా నిబంధనలు విధించారు. గతంలో హైదరాబాద్‌లో ఎన్టీఆర్ ట్రస్టు భవన్ కోసం సీఎం హోదాలో తానే దరఖాస్తు చేసుకుని, తానే కేటాయించుకున్న ఘనచరిత్ర చంద్రబాబుది. -
‘బాబు ఆ పని చేస్తే ఎన్టీఆర్ ఆత్మ శాంతిస్తుంది’
సాక్షి, అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ట్విటర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. హైదరాబాద్‌లో ఖాళీగా పడున్న ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌ను కరోనా ఆస్పత్రికి ఇచ్చి చంద్రబాబు తెలంగాణ ప్రజల రుణం తీర్చుకోవాలని సూచించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఆయన వరస ట్వీట్లు చేశారు. ‘హైదరాబాద్ లో ఖాళీగా పడున్న ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ను కరోనా హాస్పిటల్ కు ఇస్తే తెలంగాణా ప్రజల రుణం తీర్చుకున్నట్టవుతుందని బాబుకు అభ్యర్థనలు వెల్లువెత్తుతున్నాయి. ఇటువంటి క్లిష్ట సమయంలో పెద్ద మనసు కనబర్చాలి. పార్టీ వ్యవస్థాపకుడి ఆత్మ కూడా శాంతిస్తుంది’ అని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. (చదవండి : రాజకీయ దుర్బుద్ధి తప్ప.. ప్రజలపై ప్రేమ ఏదీ!) ‘బాబు పబ్లిసిటీ స్టంట్ల కైపులో మునిగి తేలిన టీడీపీ నేతలు, జగన్ గారు ఎటూ వెళ్లరా అని శోకాలు పెడుతున్నారు. అతనికి టాబ్లెట్ వేయండి, ఇతనికి టెంపరేచర్ చూడండి అని బాబులా డ్రామాలాడాలట! ప్రభుత్వ యంత్రాంగం స్వేచ్ఛగా పనిచేస్తోంది. సిఎం గారు పర్యవేక్షిస్తున్నారు. కనిపించడం లేదా?’ అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ‘కేంద్రానికి తానే లేఖా రాయలేదని నిమ్మగడ్డ ఏఎన్ఐ వార్తా సంస్థకు చెప్పాడు. పోలీసులకు ఫిర్యాదు వెళ్లేటప్పటికి కాదు నేనే రాశా అన్నాడు. లెటర్ బయటి నుంచి వచ్చిందని సిఐడి ప్రాథమికంగా నిర్థారించింది. 35 ఏళ్లు సివిల్ సర్వెంట్ గా చేసిన వ్యక్తి ఎవరి చేతిలో పావుగా మారాడో గ్రహించాలి’ అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. -
టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు వీరే..నా!
సాక్షి, హైదరాబాద్ : పదకొండు అసెంబ్లీ స్థానాలకు టీడీపీ అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఖమ్మంలో నామా నాగేశ్వరరావు, సత్తుపల్లి- సండ్ర వెంకట వీరయ్య, అశ్వరావు పేట- మచ్చ నాగేశ్వరరావు, వరంగల్ పశ్చిమ- రేవూరి ప్రకాశ్ రెడ్డి, మక్తల్-కొత్తకోట దయాకర్ రెడ్డి, మహబూబ్ నగర్- ఎర్ర శేఖర్, ఉప్పల్- వీరేందర్ గౌడ్, శేరిలింగంపల్లి- భవ్య ఆనంద్ ప్రసాద్, కూకట్పల్లి- పెద్దిరెడ్డి, నిజామాబాద్ రూరల్- మండవ వెంకటేశ్వరరావుల పేర్లను టీడీపీ ఖరారు చేసినట్లు సమాచారం. ఇవే కాకుండా ఆలేరు, నకిరేకల్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం, కోదాడ, పఠాన్ చెరువు, నారాయణ ఖేడ్‌లలో ఏవైనా నాలుగు స్థానాలలో టీడీపీ పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా టీడీపీ నుంచి అధికారికంగా అభ్యర్థు పేర్లను ప్రకటించలేదని టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ పేర్కొన్నారు. పదకొండు మంది పేర్లను ప్రకటించారడనం అసత్య ప్రచారం అని తెలిపారు. అభ్యర్థుల పూర్తి జాబితాను మంగళవారం ప్రకటిస్తామని రమణ పేర్కొన్నారు. సీట్ల సర్దుబాటుపై ఈ రోజు సాయంత్రానికి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో కూటమి నేతలంతా కలిసి ఒకే వేదికపై అభ్యర్థులను ప్రకటిస్తామని ఆయన చెప్పారు. -
ఎన్టీఆర్ భవన్‌కు నిరసన సెగ
-
ఏ స్థానం అడుగుదాం..
సాక్షిప్రతినిధి, నిజామాబాద్ : మహాకూటమి పొత్తు లో భాగంగా ఉమ్మడి జిల్లాలో ఎన్ని స్థానాలు, ఏయే స్థానాలు అడగాలనే అంశంపై జిల్లా తెలుగుదేశం పార్టీ నేతలు శుక్రవారం ప్రాథమికంగా సమాలోచనలు జరిపారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్లో మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్రావు, మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ ఈ అంశంపై ఉమ్మడి జిల్లాకు చెందిన కొద్ది మంది నాయకులతో చర్చించారు. ఉమ్మడి జిల్లా నుంచి ఒక స్థా నం టీడీపీకి కేటాయించాలని కోరుతూ అధినేత చంద్రబాబుకు ప్రతిపాదించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్, బాన్సువాడ, బోధన్ స్థానాల్లో ఏ స్థానాన్ని అడగాలనే అనే అంశం చర్చకొచ్చినట్లు సమాచారం. పొత్తులో భాగంగా టీడీపీకి బాల్కొండ స్థానం కేటాయించే అవకాశాలున్నట్లు రాజకీయవర్గాల్లో మొదటి నుంచి చర్చ జరుగుతోంది. అన్నపూర్ణమ్మ కుమారుడు మల్లికార్జున్‌రెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేస్తారనే ప్రచారం ఉంది. టీడీపీ గుర్తు సైకిల్‌పై పోటీ చేస్తే కాంగ్రెస్‌కు పడే ఓట్లు తమవైపు మళ్లే అవకాశాలు లేవని భావిస్తున్న మల్లికార్జున్‌రెడ్డి.., కాంగ్రెస్ గుర్తు నుంచే పోటీ చేసేందుకే ఆసక్తి చూపుతున్నట్లు అనుచరవర్గం పేర్కొంటోంది. ఇన్నాళ్లూ ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న మండవ ఎన్నికల వేళ ఉమ్మడి జిల్లా నేతలతో సమాలోచనలు జరపడం గమనార్హం. కాగా ఇదంతా సాధారణ సమావేశమేనని, పొత్తుల గురించి అసలు ప్రస్తావన రాలేదని మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ ‘సాక్షి’ ప్రతినిధితో తెలిపారు. ఎలాంటి తీర్మానాలు కూడా చేయలేదని చెప్పారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి, జిల్లా నాయకులు అమర్‌నాథ్‌బాబు, గోపాల్‌రెడ్డి, కొడాలి రాము, రమాదేవి తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. -
ప్రజాసంఘాల నేతల అరెస్టు, విడుదల
హైదరాబాద్: ఏవోబీలో జరిగిన బూటకపు ఎన్‌కౌంటర్‌పై న్యాయ విచారణ జరిపించాలని గురువారం అర్థరాత్రి ప్రజాసంఘాల నేతలు ఆందోళనకు దిగారు. ఎన్టీఆర్ భవన్ వద్ద విరసం నేత వరవరరావు తదితరులు ధర్నాలో పాల్గొన్నారు. సమావేశం జరుపుకుంటున్న మావోయిస్టు నేతలను కావాలనే కాల్చి చంపారని ఆరోపించారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని గోషామహల్ స్టేడియంకు తరలించారు. కొద్దిసేపటి తర్వాత వారినందరినీ విడుదల చేశారు. -
ఎన్టీఆర్ భవన్ ముట్టడి
-
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వద్ద ఉద్రిక్తత
► ఎన్టీఆర్ భవన్ ముట్టడి ► బూటకపు ఎన్కౌంటర్లు ఆపాలంటూ ప్రజాసంఘాల డిమాండ్ హైదరాబాద్: ఏఓబీ ఎన్‌కౌంటర్‌కు నిరసనగా ప్రజా సంఘాలు, హక్కుల సంఘాలు గురువారం రాత్రి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌ను ముట్టడించాయి. వరవరరావు నేతృత్వంలో పెద్ద సంఖ్యలో ప్రజాసంఘాల నేతలు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వద్ద ఆందోళన చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బూటకపు ఎన్కౌంటర్లను నిలిపివేయాలని... పోలీసుల అదుపులో ఉన్న మావోయిస్టులను వెంటనే కోర్టులో హాజరుపర్చాలని డిమాండ్ చేశారు. ఆపరేషన్ ఆర్కే పేరుతో చేపట్టిన కూంబింగ్‌ను తక్షణమే నిలిపివేయాలని, ఎన్‌కౌంటర్‌పై న్యాయ విచారణ చేపట్టాలని కోరారు. ఈ సందర్భంగా కొందరు కార్యకర్తలు ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లోకి దూసుకెళ్లేందుకు యత్నించారు. వారిని పోలీసులు అడ్డుకోగా.. తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నాయి. పోలీసులు వరవరరావును అదుపులోకి తీసుకుని గోషామహల్ స్టేడియానికి తరలించారు. దీంతో ప్రజా సంఘాలు, హక్కుల సంఘాల నేతలు ఎన్టీఆర్ ట్రస్ట్భవన్ ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఏపీ ప్రభుత్వం బూటకపు ఎన్కౌంటర్లను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఏఓబీ ఎన్కౌంటర్లో కేంద్రం, ఏపీ, ఛత్తీస్గడ్ రాష్ట్రాల పోలీసు బలగాలు చాలా మంది మావోయిస్టులు, ఆదివాసీలను చంపేశాయని నేతలు ఆరోపించారు. ఆందోళన చేస్తున్న ప్రజాసంఘాల నేతలు, కార్యకర్తలను అరెస్టు చేసేందుకు పోలీసులు పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో.. దాదాపు రెండు గంటల పాటు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆ ప్రాంతమంతా ట్రాఫిక్ స్తంభించి పోయింది. -
అవినీతికి అడ్డాగా గజ్వేలు: వంటేరు
హైదరాబాద్: గజ్వేలును అవినీతికి అడ్డాగా మార్చేశారని తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు వంటేరు ప్రతాప్‌రెడ్డి విమర్శించారు. ఈ నియోజకవర్గ పరిధిలోని ఎస్సై రామకృష్ణ మరణం వెనుక డీఎస్పీ హస్తం ఉందని ఆయన ఆరోపించారు. ఎన్టీఆర్ భవన్లో బుధవారం ఆయన విలేక రులతో మాట్లాడుతూ, ఈ సంఘటనపై హోం మంత్రి గానీ, జిల్లా మంత్రి హరీశ్‌రావు కానీ స్పందించలేదని పేర్కొన్నారు. తాను రూ.15 లక్షలు వసూలు చేయలేనని డీఎస్పీకి ఫోన్లో చెప్పి మరీ ఎస్సై ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. ఒక్క పోలీస్ శాఖలోనే ఇంత అవినీతి ఉంటే ఇతర ప్రభుత్వ శాఖ ల్లో ఎంత అవినీతి జరుగుతుందో ఊహించవచ్చన్నారు. స్నేహపూర్వక పోలీస్ వ్యవస్థను అమలు చేస్తున్నామని ప్రభుత్వం చెప్పుకుంటోందని, అయితే ఏ పోలీస్ స్టేషన్లో కూడా ఆ వ్యవస్థ లేదని, ప్రజలన -
తెలంగాణ టీడీపీలో కలహాలు
- లోకేశ్‌తో భేటీలో బయట పడ్డ అభిప్రాయ భేదాలు - రేవంత్‌పై నేతల ఫిర్యాదు సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ టీడీపీ నేతల మధ్య ఉన్న లుకలుకలు మరోమారు బయట పడ్డాయి. టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్‌తో శనివారం ఎన్టీఆర్ భవన్లో జరిగిన ముఖ్యనేతల భేటీలో పలువురు నేతలు వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి వ్యవహార శైలిపై ఫిర్యాదు చేశా రు. పార్టీ వర్గాల ద్వారా అందిన సమాచారం మేరకు.. పార్టీ భవిష్యత్ కార్యాచరణ గురించి చర్చించారు. కొన్నాళ్లుగా నేతల మధ్య కొనసాగుతున్న ఆధిపత్య పోరు ఒక్కసారిగా బయట పడింది. మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్వాసితులకు మద్దతుగా వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి చేపట్టిన దీక్షపై విమర్శలు వ్యక్తమయ్యాయి. దీక్షా స్థలిలో ఏర్పాటు చేసిన బ్యానర్లలో పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్, జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఫొటోలు పెట్టకపోవడాన్ని సీనియర్లు కొత్తకోట దయాకర్‌రెడ్డి, నామా నాగేశ్వర్రావు, రావుల చంద్రశేఖర్‌రెడ్డి సహా పలువురు తప్పుపట్టారు. మరోవైపు పార్టీ అధ్యక్షుడు, కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎవరికి వారుగా వేర్వేరు కార్యక్రమాలతో కార్యకర్తలకు అందుబాటులో లేకపోవడం సరికాదని, ఇద్దరిలో ఎవరో ఒకరు అందుబాటులో ఉండాలని లోకేశ్ సూచించారు. అవసరమైతే ప్రతివారం తాను ముఖ్యులతో సమావేశమవుతానని, అవసరాన్నిబట్టి చంద్రబాబు కూడా మాట్లాడతారన్నారు. వివిధ అంశాలపై పార్టీ కమిటీలను ఏర్పాటు చేశారు. వ్యవస్థలను నిర్వీర్యం చేస్తోంది... అనంతరం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి సమావేశ నిర్ణయాలు తెలిపారు. టీఆర్ఎస్ అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తోందన్నారు. టీడీఎల్పీలో గదుల తొలగింపుపై న్యాయ పోరాటం చేస్తామన్నారు. ఆరు కమిటీలు ఏర్పాటు చేశామన్నారు. ఇరిగేషన్ కమిటీకి రేవూరి ప్రకాశ్‌రెడ్డి, హౌసింగ్ - అరవింద్‌కుమార్‌గౌడ్, ట్రైబల్ వెల్ఫేర్-రమేష్ రాథోడ్, మైనారిటీ వెల్ఫేర్- సాజిద్, పెద్దిరెడ్డి, 3 ఎకరాల భూమి - సండ్ర వెంకటవీరయ్య, రుణమాఫీ కమిటీకి అరికెల నర్సారెడ్డిలను ఇన్చార్జులుగా నియమించామని రావుల తెలిపారు. -
టీ.టీడీపీ నేతలతో లోకేశ్ భేటీ
హైదరాబాద్: తెలంగాణలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా టీ.టీడీపీ నేతలతో లోకేశ్ శనివారం భేటీయ్యారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో జరుగుతున్న ఈ సమావేశానికి పార్టీ ముఖ్యనేతలు హాజరయ్యారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై చర్చించడంతో పాటు పార్టీ బలోపేతంపై ప్రధానంగా లోకేశ్ నేతలతో చర్చించనున్నారు. -
తెలంగాణ పాలిట విషనాగు చంద్రబాబు
తెలంగాణ బీసీ ఫోరం అధ్యక్షులు ఆంజనేయగౌడ్ ఉస్మానియా యూనివర్సిటీ: ఏపీ సీఎం చంద్రబాబు పగబట్టిన విషనాగులా మారి తెలంగాణ అభివృద్ధిని, ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారని రాష్ట్ర బీసీ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు, టీఆర్ఎస్ నాయకులు డాక్టర్ ఆంజనేయగౌడ్ ధ్వజమెత్తారు. ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ బీసీ ఫోరం, తెలంగాణ పరిరక్షణ ఫోరం, ఓయూ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో సాగునీటి ప్రాజెక్టుల వివాదంపై గురువారం చర్చ నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన ఆంజనేయగౌడ్ మాట్లాడుతూ తెలంగాణలో నిర్మించతలపెట్టిన ప్రాజెక్టులను అడ్డుకుంటే హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌ను కూల్చివేస్తామని హెచ్చరించారు. చంద్రబాబు తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేక పోతున్నారన్నారు. తెలంగాణలో నిర్మించతలపెట్టిన ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఏపీ క్యాబినెట్ చేసిన తీర్మానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ తీర్మానాన్ని కేంద్రప్రభుత్వం తిరస్కరించాలని కోరారు. చంద్రబాబు తన బుద్ధి మార్చుకోకుంటే ప్రజలు తగిన బుద్ది చెబుతారని హెచ్చరించారు. ప్రాజెక్టుల నిర్మాణాల కోసం నిరంతరం పోరాడుతామని భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించారు. ఈ నెల 8న బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ‘తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులు-ఏపీ ప్రభుత్వ దుశ్చర్యలు’ అనే అంశం పై రౌండ్‌టేబుల్ సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో విద్యార్థి నాయకులు కిరణ్‌గౌడ్, శ్రావణ్, తెలంగాణ పరిరక్షణ సమితి నేతలు అశోక్, రాజేష్, వెంకట్‌యాదవ్, నర్సింగ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీ ‘ఎంపీ’ రేసులో మీడియా అధిపతులు!
తెలుగుదేశం అధినేత బాబు వద్దకు పలుమార్గాల్లో రాయబారాలు సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పార్టీకి విభిన్న కోణాల్లో సహకరిస్తున్నందున తమను తెలుగుదేశం తరఫున రాజ్యసభకు పంపాలని పలు టీవీ చానళ్లు, పత్రికల యజమానులు, ప్రతినిధులు, వారి బంధువులు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును కోరుతున్నారు. టీడీపీకి ప్రత్యక్షంగా, పరోక్షంగా అనుకూలంగా వ్యవహరించిన అనేక సందర్భాలను గుర్తుచేస్తుండటంతో పాటు తమ అర్హతల గురించి పార్టీలోని ఇతర ముఖ్య నేతల వద్ద ఏకరువు పెడుతున్నారు. తమకు అవకాశం ఇస్తే భవిష్యత్తులో తెలుగుదేశానికి ఇంకెంతగా ఉపయోగపడతామనేది వివరించడానికి కూడా వారు పోటీపడుతున్నారనేది సమాచారం. పలువురు మీడియా అధిపతులు చంద్రబాబును కలిసి తమ మనసులోని మాటను బయట పెట్టగా ఆయన పరిశీలిస్తానని హామీనిచ్చినట్లు సమాచారం. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు రాజ్యసభ సీటు తమకు కేటాయించాలని చంద్రబాబును కోరిన విషయం తెలిసిందే. కేంద్ర మంత్రి సుజనాచౌదరి మరోసారి తనను రాజ్యసభకు పంపాలని ఆశిస్తుండటంతో పాటు భాజపా కూడా రాజ్యసభ సీటును కోరుతున్నట్లు తెలుస్తోంది. తమనూ ఏపీ కోటాలో రాజ్యసభకు పంపే అవకాశాన్ని పరిశీలించాలని తెలంగాణకు చెందిన పలువురు నాయకులు చంద్రబాబును ఇదివరకే కలసి కోరారు. కష్టపడుతున్నాంగా.. కరుణించండి... పత్రిక-టీవీ చానల్ యజమాని ఒకరు టీడీపీ రాజ్యసభ రేసులో ఉన్నారని గట్టి ప్రచారం జరుగుతోంది. టీడీపీతో ఎంతో కాలంగా తనకు ఉన్న వ్యక్తిగత, సంస్థాగత సంబంధాల దృష్ట్యా రాజ్యసభ సీటు తనకు ఇవ్వాలని ఆయన కోరుతున్నట్లు టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక సమయం సమీపిస్తుండటంతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రతిపక్ష ఎమ్మెల్యేల కొనుగోలు ప్రణాళికలను ఆయనే అమలు చేస్తున్నారని వినిపిస్తోంది. అందులో భాగంగా ఆయన తన పత్రిక, చానల్ ద్వారా ప్రతిపక్షపార్టీ ప్రజాప్రతి నిధుల గురించి ముందుగా పుకార్లు షికార్లు చేయించడం, ఆ తరువాత వారితో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మంతనాలు, సమాలోచనలు జరపడం వంటివి చేస్తున్నారని టీడీపీ వర్గాలే అంటున్నాయి. ఫలానా వారు పార్టీని వీడుతున్నారంటూ ఉన్నవీ, లేనివీ ప్రచారం చేయడం ఓ పథకం ప్రకారం జరుగుతోందనే చర్చ రాజకీయవర్గాల్లో కొనసాగుతోంది. ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారాలు, ప్రలోభాలు మొదలు ప్రతి అంశంలోనూ ఆ పత్రిక, చానల్ అధిపతి కీలకంగా వ్యవహరిస్తున్నారని, రాజ్యసభకు వెళ్లాలన్న ముందస్తు ప్రణాళికలో భాగంగానే అలా వ్యవహరిస్తున్నారని టీడీపీ వర్గాలు బాహాటం గానే వ్యాఖ్యానిస్తున్నాయి. మరో చానల్ చైర్మన్ కూడా టీడీపీ రాజ్యసభ రేసులో ఉన్నారని సమాచారం. తమకు దేశ వ్యాప్తంగా ఉన్న చానల్ నెట్వర్క్ ద్వారా పార్టీ విస్తృతికి, ప్రభుత్వ విధానాల ప్రచారానికి సహ కరిస్తానని, గతంలో పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇదే రకమైన సహకారం పలు సందర్భాల్లో అందించానని టీడీపీ పెద్దల వద్ద ఆయన చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. పత్రికలు, టీవీ చానళ్ల పెద్దలు ఎవరు ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినా పార్టీకి దక్కేది మూడు రాజ్యసభ సీట్లే కాబట్టి చంద్రబాబు మాత్రం ఎలాంటి స్పష్టమైన హామీ ఇవ్వలేదని ఎన్టీఆర్ భవన్ వర్గాల సమాచారం. ‘మీకోసం’ మేం.. మాకోసం మీరు.. చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరుకు చెందిన ఓ టీవీ చానల్ అధినేత టీడీపీ రాజ్యసభ అభ్యర్థిత్వానికి గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. కొద్దిమంది టీడీపీ నేతల ద్వారా ఇప్పటికే తన మనసులోని మాటను పార్టీ అధినేత దృష్టికి తీసుకెళ్లారని తెలిసింది. పార్టీ కష్టకాలంలో ఉన్నపుడు, చంద్రబాబు మీకోసం, బస్సుయాత్ర, పాదయాత్ర తదితర సమయాల్లో ప్రత్యేకంగా సిబ్బందిని కేటాయించి వార్తలు కవర్ చేయించానని, పార్టీ అధికారంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా సానుకూల కథనాలు ప్రసారం చేశానని ఆయన బాబుకు పార్టీ నేతలతో చెప్పించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈనాడు చైర్మన్ సీహెచ్. రామోజీరావు దగ్గరి బంధువు ఒకరు రాజ్యసభ సీటుకోసం ప్రయత్నం చేస్తున్నారని, ఈయనకు చంద్రబాబుతో సుదీర్ఘకాలంగా సాన్నిహిత్యం ఉందని అంటున్నారు. -
ఎన్టీఆర్ భవన్ మూతపడుతుంది
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కథ ముగిసిపోయింది. ఒక్క నాయకుడు లేని టీడీపీ ప్రధాన కార్యాలయమైన ఎన్టీఆర్ భవన్ కూడా త్వరలో మూతపడుతుంది. 50 ఏళ్ల కాలంలో ఎన్నడూ లేనంత అభివృద్ధిని కేవలం 20 నెలల వ్యవధిలోనే సీఎం కేసీఆర్ చేసి చూపించారు. అభివృద్ధిలో భాగస్వామ్యం కావడం కోసమే టీడీపీ ఎమ్మెల్యేలందరూ టీఆర్ఎస్లో చేరారు. మహారాష్ట్రతో సీఎం కేసీఆర్ చేసుకున్న చరిత్రాత్మక ఒప్పందం వల్ల తెలంగాణ బీడు భూముల్లో బంగారుపంటలు పండనున్నాయి. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలు చరిత్రలో నిలిచిపోతాయి. - జీవన్‌రెడ్డి, టీఆర్ఎస్ -
టీడీపీ గ్రేటర్ అభ్యర్థులకు శిక్షణా శిబిరం
-
'వారు నా కుటుంబ సభ్యుల కంటే ఎక్కువ'
హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నా కుటుంబ సభ్యుల కంటే ఎక్కువ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్లో టీడీపీ కేంద్ర కమిటీ అధ్యక్షుడిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ... కార్యకర్తలను పూర్తిగా ఆదుకున్న పార్టీ టీడీపీ అని తెలిపారు. దేశంలోనే అత్యధికంగా సభ్యత్వాలు నమోదు చేసిన పార్టీ కూడా టీడీపీయే అని చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలుగు జాతి ఆత్మగౌరవం కోసమే ఎన్టీఆర్ పార్టీ పెట్టారన్నారు. టీడీపీ నిర్మాణంలో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అహర్నిశలు కష్టపడ్డారని చెప్పారు. ఎన్టీఆర్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి అని చంద్రబాబు కీర్తించారు. తెలుగు వారి భవిష్యత్తు కోసమే ఎన్డీఏతో పొత్తు పెట్టుకున్నామని చంద్రబాబు వెల్లడించారు. అలాగే కొత్త, పాత కలయికతో కమిటీని టీడీపీ కేంద్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కమిటీలను నియమించామని చంద్రబాబు చెప్పారు. -
టీడీపీ, టీఆర్ఎస్ మహిళా కార్యకర్తల తోపులాట
హైదరాబాద్: ఇద్దరు నేతల మధ్య పరస్పరం చేసుకున్న ఘాటు వ్యాఖ్యలు ఇరు పార్టీ కార్యకర్తల మధ్య ఉద్రిక్తతకు దారి తీసింది. మా నేతను అంటారా అంటే మరి మా నేతను అంటారా అంటూ వారు ఆందోళనకు దిగుతున్నారు. మహాసంకల్ప సభలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విరుచుపడిన విషయం తెలిసిందే. అలాగే, సీఎం చంద్రబాబును కూడా కేసీఆర్ ఘాటుగా విమర్శించారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ మహిళా కార్యకర్తలు మంగళవారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ముందు ఆందోళనకు దిగారు. చంద్రబాబునాయుడికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడే ఉన్న టీడీపీ మహిళా కార్యకర్తలు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకొని తోపులాట నెలకొంది. -
మహానాడులో 20కి పైగా తీర్మానాలు
హైదరాబాద్: ఈ నెల 27 నుంచి 29 వరకు నిర్వహించే మహానాడులో 20కి పైగా తీర్మానాలు చేయాలని టీడీపీ నిర్ణయించింది. ఇందులో రాజకీయ తీర్మానం, కేంద్ర ప్రభుత్వంతో సంబంధాలు, తెలుగు భాష, తెలుగుజాతి ఐక్యత, టీడీపీని జాతీయ పార్టీగా మార్చడం వంటివి ఉమ్మడిగా ఉంటాయి. మిగిలినవి తెలంగాణ, ఏపీల్లో పార్టీ వైఖరికి అనుగుణంగా ఉంటాయి. మంగళవారం రాత్రి ఎన్టీఆర్ భవన్లో మహానాడు తీర్మానాల కమిటీ సమావేశం జరిగింది. అనంతరం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా నేతల సమావేశం జరిగింది. ఈ రెండు సమావేశాలకు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు అధ్యక్షత వహించారు. మహానాడును ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని బాబు సూచించారు. కాగా మహానాడులో చేయనున్న తీర్మానాల ముసాయిదా ప్రతులను జిల్లాలకు పంపనున్నారు. వాటిపై ఈ నెల 21 నుంచి 25 వరకు జరిగే జిల్లా మహానాడుల్లో నేతలు చర్చించి సూచనలు, సలహాలు చేయాలి. వాటిలో ప్రధానమైన వాటిని పొందుపరిచి తీర్మానాలకు తుది రూపం ఇస్తారు. -
'ఆంధ్రాలో టీడీపీ సర్కారును గద్దె దింపుతాం'
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపుతామని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హెచ్చరించారు. ఎస్సీవర్గీకరణ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని మండిపడ్డారు. ఆదివారం మంగళగిరిలో జరిగిన ఎమ్మార్పీఎస్ జాతీయ కార్యవర్గం సమావేశంలో మందకృష్ణ మాదిగ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో టీడీపీని భూస్థాపితం చేయడంతోపాటు, ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ సర్కారును గద్దె దింపుతామన్నారు. ఈ రోజు ఎమ్మార్పీఎస్ కార్యకర్తులు పలుచోట్ల ధర్నా చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం ఎన్టీయార్ ట్రస్ట్ భవన్ ముందు ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు నిరసన కార్యక్రమం చేపట్టారు ఎస్సీ వర్గీకరణకు తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తూ వారు ఆందోళన బాటపట్టారు. -
ఎన్టీయార్ భవన్ ముందు ఎమ్మార్పీఎస్ ధర్నా
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం ఎన్టీయార్ ట్రస్ట్ భవన్ ముందు ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ధర్నా చేశారు. ఎస్సీ వర్గీకరణకు తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు పలువురు ఎమ్మార్పీఎస్ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. నిజమాబాద్‌లో జిల్లా టీడీపీ సమావేశం సందర్భంగా శనివారం ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ధర్నా చేపట్టడం ఉద్రిక్తతకు దారితీసిన సంగతి తెలిసిందే. టీడీపీ నాయకుల వైఖరికి నిరసనగా నిజమాబాద్ జిల్లాల్లో బోధన్, నబీపేట్లో ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. -
ఎన్టీఆర్ భవన్లో టీడీపీ విస్తృతస్థాయి సమావేశం
-
జిల్లా కలెక్టరా.. ఎన్టీఆర్ భవన్ కార్యదర్శా
సిద్ధార్థజైన్‌కు సభా హక్కుల నోటీసులు ఇస్తాం ఐఏఎస్సా? లేక టీడీపీ వారికి ‘అయ్యా ఎస్సా?’ నిబంధనలు పాటించకుంటే మంత్రుల పర్యటనను అడ్డుకుంటాం ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి హెచ్చరిక తిరుపతి రూరల్: జిల్లా పరిపాలనాధికారిగా కాకుండా టీడీపీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ కార్యదర్శిలా జిల్లా కలెక్టర్ సిద్ధార్థజైన్ వ్యవహరిస్తున్నారని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి విమర్శించారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడా రు. అత్యున్నత ఐఏఎస్ చదివిన సిద్ధార్థ జైన్ ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారన్నారు. ఆయన ఐఏఎస్‌లా కాకుండా టీడీపీ కార్యకర్తలకు ‘అయ్యా ఎస్’ అనే స్థాయికి కలెక్టర్ పదవిని దిగజార్చుతున్నారని చెవిరెడ్డి తీవ్రంగా విమర్శించారు. అధికారిక కార్యక్రమాలను సైతం టీడీపీ కార్యక్రమంలా మార్చుతున్నారని విమర్శించారు. చంద్రగిరి నియోజకవర్గంలో గత 10 రోజుల్లో చాలా అధికారిక కార్యక్రమాలు జరిగాయని, ఇందులో మంత్రులతో పాటు అధికారిక ప్రముఖులు, వీఐపీలు పాల్గొన్నారన్నారు. కానీ స్థానిక శాసనసభ్యులైన తనకు మాత్రం కలెక్టర్ సమాచారం ఇవ్వలేదన్నారు. ప్రభుత్వం జారీచేసిన జీవో ఎంఎస్ నెం.348 ప్రకారం ఏదైనా నియోజకవర్గంలో అధికార కార్యక్రమాలు జరిగినా, మంత్రులు, వీఐపీలు పాల్గొన్న స్థానిక శాసనసభ్యుడికి కచ్చితంగా సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టంగా పేర్కొన్నట్టు ఆయన చెప్పారు. కానీ జిల్లాలో వైఎస్ఆర్సీపీ శాసనసభ్యుల విషయంలో కలెక్టర్ ప్రోటోకాల్‌ని పాటించడం లేదని తెలిపారు. కలెక్టర్ తీరు సభాహక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందన్నారు. ఆయనకు సభా ఉల్లంఘన నోటీసు ఇస్తామని, అసెంబ్లీ ముందు దోషిగా నిలబెడ తామని హెచ్చరించారు. ప్రోటోకాల్ పాటించకుంటే శాసనసభ్యుల హక్కుకు భంగం కలిగించే ఏ అధికారినీ వదలమన్నారు. మంత్రులనూ అడ్డుకుంటాం ప్రోటోకాల్ పాటించకుంటే నియోజకవర్గాలకు వచ్చే మంత్రులను ఎక్కడికిక్కడ ప్రజలతో కలసి అడ్డుకుంటామని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఈ సందర్భంగా హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా జరిగే అధికారిక కార్యక్రమాలవద్ద ఎలాంటి సంఘటనలు జరిగినా అధికారులే బాధ్యత వహించాల్సి ఉం టుందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా అధికారప్రతినిధి చిన్నియాదవ్, చంద్రగిరి మండల కోఆప్షన్ మెంబర్ మస్తాన్, వాసు, సునీల్, గజ, ప్రసాద్ నాయక్ పాల్గొన్నారు. -
ఎన్టీఆర్ భవన్లో ప్రభుత్వ తీర్మానాల తయారీ
టీడీపీ నాలెడ్జ్ సెంటర్లో తయారైన బీసీ తీర్మానం అవే ప్రతులను మండలిలో పంచిపెట్టిన సర్కారు హైదరాబాద్: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కి, ప్రభుత్వానికి తేడా లేకుండా పోయింది. అధికార పార్టీ చట్టసభలను సైతం చులకన చేస్తోంది. ప్రభుత్వం తయారు చేయాల్సిన బీసీ తీర్మానం ప్రతులను ఎన్టీఆర్ భవన్లో తయారుచేయడమే కాకుండా శనివారం ఆ తీర్మానం ప్రతులను శాసనమండలిలో సభ్యులకు అందజేశారు. (తీర్మా నం ప్రతి పేజీ చివర్లో ‘సి/డాటాపీఎం05/టీడీపీ నాలెడ్జి సెంటర్ పేజి నెం.28 అని స్పష్టంగా ఉం ది). దీనిపై పెద్దల సభలో సభ్యులు తీవ్ర అభ్యం తరం వ్యక్తంచేస్తూ ప్రభుత్వంపై దండెత్తారు. ఒక పార్టీ కార్యాలయంలో తయారైన తీర్మానాన్నిమండలిలో ఎలా అనుమతిస్తారంటూ నిలదీశా రు. మండలి చైర్మన్ చక్రపాణి అసహనం వ్యక్తం చేశారు. మండలిలో విషయం బయటపడటం తో శాసనసభకు వచ్చేసరికి దాన్ని సవరించారు. టీడీపీ ఆఫీసులో తయారైనట్లు తెలిపే లైన్‌ను చించేసి కొత్తగా జిరాక్సు ప్రతులు తయారుచేసి ఇచ్చారు. సభలో సీఎం చంద్రబాబు బీసీల కోసం తీర్మానం పెట్టినప్పుడు టీడీపీ మేనిఫెస్టో పుస్తకాన్ని చదవడం ఆశ్చర్యానికి గురిచేసింది. మండలిలో తీవ్ర నిరసన మంత్రి కొల్లు రవీంద్ర బీసీ తీర్మానం మండలిలో ప్రవేశపెట్టగానే విపక్ష సభ్యులందరూ మూకుమ్మడిగా తీవ్ర నిరసన తెలిపారు. ఆ ప్రతులు టీ డీపీ ఆఫీసులోని నాలెడ్జ్ సెంటర్ నుంచి తయా రైనట్లు ముద్రించి ఉండటాన్ని కాంగ్రెస్ పక్షనేత సి.రామచంద్రయ్య తప్పుపట్టారు. పార్టీ కార్యాలయంలో ముద్రించిన ప్రతులను సభలో ప్రవేశపెట్టడానికి అర్హత లేదని కాంగ్రెస్ పార్టీ సభ్యుడు మహమ్మద్ జానీ ప్రతిని సభలో చింపేశారు. చైర్మన్ ఎ.చక్రపాణి కలుగచేసుకొని ఈ పద్ధతి మంచిదికాదని మంత్రికి అక్షింతలు వేశారు. మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ఇకముందు ఇలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. తర్వాత హడావిడిగా టీడీపీ నాలెడ్జ్ సెంటర్ అన్నది తొలగించి కొత్త ప్రతులను సభ్యులకు పంపిణీ చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసమే... వాస్తవానికి శుక్రవారమే డిమాండ్లు అన్నీ పూర్తవ్వడంతో రాజకీయ ప్రయోజనాల కోసం శని వారం సభలో ఏదో ఒక తీర్మానం ప్రవేశపెట్టాలని టీడీపీ నిర్ణయించుకుంది. శుక్రవారం రాత్రి బాబు సమక్షంతో పార్టీ నేతలు సమావేశమై తమకు రాజకీయంగా లాభం చేకూర్చే ప్రచారం జరిగేలా తీర్మానం ఏది చేస్తే బాగుంటుందోనని బుర్రలు బద్దలుకొట్టుకున్నారు. శనివారం బాబు తో ఆయన చాంబర్లో నాయకులు సమావేశమై తర్జనభర్జనపడ్డారు. చివరకు బీసీలకు చట్టసభల్లో 33.33 శాతం రిజర్వేషన్లు తదితర అంశాలపై కేంద్రాన్ని కోరుతూ తీర్మానం చేయాలని నిర్ణయించారు. తీర్మానం గురించి స్పీకర్ కోడెల కు తెలియచేశారు. తీర్మానం కాపీని ప్రభుత్వం అసెంబ్లీకి, మండలికి సమర్పించాలి. కానీ తీర్మా నం కాపీని ప్రభుత్వంతో కాక టీడీపీ కార్యాలయమైన ఎన్టీఆర్ ట్రస్టుభవన్లో రూపొందించారు. కొసమెరుపు కేంద్రంలో 25 శాతం నిధులను బీసీలకు ఉప ప్ర ణాళిక కేటాయించాలని చెబుతున్న బాబు రాష్ట్ర బడ్జెట్లో వారికి మొండిచేయే చూపించారు. బీసీలకు బడ్జెట్లో నిధులు ఇచ్చారంటే అదీలేదు. బా బు చేసిన సూచనల ప్రకారం 25 శాతం నిధులు బీసీలకు ఇవ్వాలంటే రాష్ట్ర బడ్జెట్లో రూ.27,750 కోట్లు కేటాయించాలి. కానీ బాబు బీసీలకు విదిలించింది రూ.3,130 కోట్లు మాత్రమే.