ఇద్దరు నేతల మధ్య పరస్పరం చేసుకున్న ఘాటు వ్యాఖ్యలు ఇరు పార్టీ కార్యకర్తల మధ్య ఉద్రిక్తతకు దారి తీసింది. మా నేతను అంటారా అంటే మరి మా నేతను అంటారా అంటూ వారు ఆందోళనకు దిగుతున్నారు.
హైదరాబాద్: ఇద్దరు నేతల మధ్య పరస్పరం చేసుకున్న ఘాటు వ్యాఖ్యలు ఇరు పార్టీ కార్యకర్తల మధ్య ఉద్రిక్తతకు దారి తీసింది. మా నేతను అంటారా అంటే మరి మా నేతను అంటారా అంటూ వారు ఆందోళనకు దిగుతున్నారు. మహాసంకల్ప సభలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై విరుచుపడిన విషయం తెలిసిందే.
అలాగే, సీఎం చంద్రబాబును కూడా కేసీఆర్ ఘాటుగా విమర్శించారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ మహిళా కార్యకర్తలు మంగళవారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ముందు ఆందోళనకు దిగారు. చంద్రబాబునాయుడికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడే ఉన్న టీడీపీ మహిళా కార్యకర్తలు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకొని తోపులాట నెలకొంది.