నాకు పాతికేళ్ల అనుభవం.. ఆ వాయిస్ బాబుదే | i know clearly that voice is of chandrababu | Sakshi
Sakshi News home page

నాకు పాతికేళ్ల అనుభవం.. ఆ వాయిస్ బాబుదే

Published Thu, Jun 11 2015 6:41 PM | Last Updated on Fri, Aug 10 2018 8:13 PM

నాకు పాతికేళ్ల అనుభవం.. ఆ వాయిస్ బాబుదే - Sakshi

నాకు పాతికేళ్ల అనుభవం.. ఆ వాయిస్ బాబుదే

న్యూఢిల్లీ: వాయిస్ రికార్డుల్లో ఉన్నది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాటలేనని, ఇదేదో తాను ఊరికే చెప్పడంలేదని టీడీపీతో పాతికేళ్ల అనుభవం ఉండి చెప్తున్న మాటలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఎంపీ పదవికి రాజీనామా చేసిన అనంతరం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు.

సెబాస్టియన్, స్టీఫెన్ సన్తో మాట్లాడింది తానో కాదో చెప్పకుండా చంద్రబాబు దబాయించడం సిగ్గుమాలిన పని అని చెప్పారు. ఏపీ సీఎంతోపాటు తాము ఎవరి ఫోన్లు ట్యాప్ చేయలేదని అన్నారు. గత ఏడాదిగా తమ పాలనే ఒక్క ఆంధ్రులపై కూడా దాడి జరగలేదని, ఒక్క ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదని చెప్పారు. అయ్యప్ప సొసైటీ ఆక్రమణలను కూల్చివేతలో తెలంగాణకు చెందిన వారి ఇళ్లు కూడా ఉన్నాయని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement