women leaders
-
తెలంగాణ భవన్‌ను ముట్టడించిన కాంగ్రెస్
సాక్షి, హైదరాబాద్/మణికొండ: మహిళలను కించపరిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ మహిళా నేతలు బీఆర్ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్‌ను ముట్టడించారు. ఖబడ్దార్ కౌశిక్‌రెడ్డి అంటూ కల్వ సుజాతతోపాటు పలువురు మహిళా నేతలు ప్లకార్డులను ప్రదర్శించారు. ముట్టడి సమాచారం తెలుసుకున్న పోలీసులు ముందస్తుగా భవన్ ఎదుట బందోబస్తు ఏర్పాటు చేశారు. వారిని లోనికి రాకుండా అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ నేతలు రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు. లోనికి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులు అడ్డుకోగా కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. అనంతరం ఆందోళనకు దిగిన మహిళా నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా మహిళా నేతలు మాట్లాడుతూ కౌశిక్ రెడ్డి మహిళలను కించపరిచేలా చీర, గాజులను చూపారని ధ్వజమెత్తారు. మహిళలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేకుంటే కౌశిక్ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. కౌశిక్ క్షమాపణ చెప్పకపోతే గవర్నర్‌ను, స్పీకర్‌ను కలిసి చర్యలు తీసుకోవాలని కోరతామన్నారు.కౌశిక్‌రెడ్డి.. ఖబడ్దార్ కాంగ్రెస్ నాయకుల జోలికి వస్తే కౌశిక్‌రెడ్డి హైదరాబాద్‌లో తిరిగే పరిస్థితి ఉండదని ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, టి.ప్రకాశ్‌గౌడ్ హెచ్చరించారు. నార్సింగి పోలీస్‌స్టేషన్‌లో పోలీసుల అదుపులో ఉన్న ఎమ్మెల్యే అరికెపూడి గాం«దీకి సంఘీభావం తెలిపేందుకు వారు తమ అనుచరులతో కలిసి అక్కడికి వెళ్లారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ కౌశిక్‌రెడ్డి పిల్ల బచ్చా అని, తన స్థాయి మరచి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. హరీశ్‌రావు సీజనల్ పొలిటీషియన్ అని, వారు మళ్లీ అధికారంలోకి వస్తామనే భ్రమ నుంచి బయటకు రావాలన్నారు. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ కొనుగోలు చేయలేదా అని ప్రశ్నించారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేందుకు కౌశిక్ యత్నిస్తున్నారని, దానిని ప్రతి ఒక్కరు ఖండించాలన్నారు. రాష్టం విడిపోయినా అన్నదమ్ములుగా కలిసి ఉన్న వారి మధ్య చిచ్చు పెట్టాలని చూస్తే ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఎమ్మెల్సీ యెగ్గె మల్లేçశం, మాజీ ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఫయూమ్ పాల్గొన్నారు. కేసీఆర్ స్పందించాలి: అద్దంకి దయాకర్ పీఏసీ చైర్మన్ అరికెపూడి గాంధీని ఆంధ్రోడు అన్న కౌశిక్ మాట లు హాస్యాస్పదమని, ఈ మాటలపై కేసీఆర్ స్పందించాలని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ డిమాండ్ చేశారు. పదేళ్లు అరికెపూడి గాంధీ బీఆర్ఎస్లోనే ఉన్నాడని, అప్పుడు ఆంధ్రోడని ఎందుకు అనలేదో చెప్పాలన్నారు. సెంటిమెంట్‌ను వాడుకొని పబ్బం గడుపుకుంటున్న వాళ్లను పార్టీ నుంచి సస్పెండ్ చేయాల ని డిమాండ్ చేశారు. కౌశిక్ లాంటి కమెడియన్‌ను ఎందుకు ఎన్నుకున్నామా అని హుజూరాబాద్ ఓటర్లు ఫీలవుతున్నారని పీసీసీ కార్యదర్శి గజ్జి భాస్కర్ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నాయకులకు మహిళలంటే చిన్న చూపని ఫిషరీష్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి విమర్శించారు. అధికారం పోగానే మళ్లీ ఆంధ్ర.. తెలంగాణ లొల్లి గుర్తుకొచ్చిందని ఎద్దేవా చేశారు. కౌశిక్ ఆంధ్రోళ్ల పేరుతో మళ్లీ తెలంగాణ సెంటిమెంటును రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. కౌశిక్ వ్యాఖ్యలను సమర్థించకపోతే కేసీఆర్ ఆయనను బీఆర్ఎస్ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. -
విచారణకు వెళ్తున్న కేటీఆర్.. అడ్డుకున్న కాంగ్రెస్ మహిళలు
-
షర్మిల చీప్ పాలిటిక్స్..మహిళా నేతలు ఆగ్రహం
-
Lok sabha elections 2024: శ్రుతి మించుతోంది
ఒకప్పుడు ఎన్నికలొస్తే ప్రత్యర్థుల భావజాలం, అవినీతి, ప్రభుత్వ విధానాల వంటివాటిపై పారీ్టల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు సాగేవి. కానీ ఇప్పుడు నేతల నోళ్లు అదుపు తప్పుతున్నాయి. మాటలు హద్దులు దాటుతున్నాయి. ఎన్నికల బరిలో దిగుతున్న మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసే పెడ ధోరణి పెరిగిపోతోంది. వారిని కించపరచడం, లింగవివక్షతో కూడిన వెకిలి కామెంట్లు చేయడం పరిపాటిగా మారుతోంది. చివరికి మహిళా నేతలు ప్రత్యర్థి పార్టీల్లోని సాటి మహిళలపై నోరు పారేసుకోవడానికి వెనకాడటం లేదు! బీజేపీ లోక్‌సభ అభ్యరి్థ, సినీ నటి కంగనాపై కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా శ్రీనేత్ వ్యాఖ్యలు అందుకు నిదర ్శనమే. నారీ శక్తి అంటూ పార్టీలు ఇస్తున్న నినాదాలు మాటలకే పరిమితమవుతున్న వైనం ఆందోళన కలిగిస్తోంది... ‘మండీలో ఇప్పుడు ఏ రేటు పలుకుతోందో!’ – ఇది కంగనాపై కాంగ్రెస్ ఐటీ విభాగం చీఫ్ సుప్రియ మూడు రోజుల కింద ఇన్‌స్టాగ్రాంలో పెట్టిన పోస్టు. కంగనా హిమాచల్‌ప్రదేశ్‌లోని తన స్వస్థలమైన మండి నుంచి లోక్‌సభకు పోటీ చేస్తున్నారు. మండి అంటే బజారు అన్న అర్థాన్ని సాకుగా తీసుకుని, కంగనా ఫొటో పెట్టి మరీ చేసిన ఈ నీచమైన వ్యాఖ్యలపై దుమారం రేగింది. బీజేపీ వెంటనే దీన్ని అందిపుచ్చుకుంటూ కాంగ్రెస్ అంటేనే సంస్కారరాహిత్యానికి మారుపేరంటూ మండిపడింది. ఆ పార్టీ అగ్ర నేత రాహుల్‌గాంధీ మొదలుకుని పలువురు నేతలు చేసిన ఇలాంటి కామెంట్లన్నింటినీ ప్రస్తావిస్తూ దుమ్మెత్తిపోసింది. దాంతో ఆ పోస్టుతో తనకు సంబంధం లేదని, ఎవరో తన ఇన్‌స్టా అకౌంట్‌ను హాక్ చేసి ఈ పని చేశారని సుప్రియ వివరణ ఇచ్చుకున్నా కాంగ్రెస్‌కు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ‘‘ఓ యువకునికి టికెట్ దక్కితే అతని భావజాలంపై దాడి! అదే ఒక యువతి ఎన్నికల బరిలో దిగితే లింగవివక్షతో కూడిన ఇలాంటి వ్యాఖ్యలు! ఈ నీచమైన పోకడకు ఇకనైనా తెర పడాలి. సెక్స్ వర్కర్ల జీవితాలు ఎంతో దుర్భరం. వాటినిలా మహిళలపై బురదజల్లేందుకు సరుకుగా వాడుకోవడం సరికాదు’’ అంటూ కంగనా హుందాగా ఇచ్చిన రిప్లై అందరి మనసులూ గెలుచుకుంది. భారత్‌లో ఎన్నికల వేళ మహిళా నేతలపై ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు కొత్తేమీ కాదు. కానీ ఈసారి మాత్రం ఎన్నికల వేడి మొదలవుతూనే ఈ తరహా దూషణ పర్వం ఊపందుకోవడం ఆందోళన కలిగిస్తోంది. రాహుల్ కూడా అయోధ్య రామాలయంలో విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి మోదీ సర్కారు కేవలం వీఐపీలనే పిలిచిందంటూ తప్పుబట్టే క్రమంలో నటి ఐశ్వర్యారాయ్‌పై అభ్యంతకర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఆ కార్యక్రమాన్ని మీరంతా చూశారు కూదా! ఐశ్వర్య, అమితాబ్, మోదీ... ఇలాంటివాళ్లే ఉన్నారు. కార్యక్రమంలో ఐశ్వర్య డ్యాన్సులు చేసింది. కానీ అక్కడ ఓబీసీలు, ఇతర సామాన్యులు ఒక్కరన్నా కన్పించారా?’’ అన్న రాహుల్ కామెంట్లపై తీవ్ర విమర్శలే వచ్చాయి. వాటిపై నెటిజన్లు కూడా దుమ్మెత్తిపోశారు. కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ కూడా ఇలాంటి వ్యాఖ్యల బాధితురాలే. అమేథీ నియోజకవర్గానికి ఆమె కేవలం అప్పుడప్పుడూ వచ్చి తన హావభావాలతో జనాన్ని ఆకర్షించి వెళ్లిపోతారంటూ కాంగ్రెస్ నేత అజయ్‌రాయ్ ఇటీవల నోరుపారేసుకున్నారు. బీజేపీ నేతలు కూడా... మహిళా నేతలపై అభ్యంతరకర వ్యాఖ్యల విషయంలో అధికార బీజేపీ నాయకులూ ఏమీ తక్కువ తినలేదు. తాజాగా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీపై రాష్ట్ర బీజేపీ నేత దిలీప్ ఘోష్ చేసిన వ్యాఖ్యలు కూడా మంటలు రేపాయి. ‘‘మమత గోవాకు వెళ్తే తాను గోవా కూతురినంటారు. త్రిపురకు వెళ్తే త్రిపుర బిడ్డనని చెప్పుకుంటారు. ముందుగా మమత తన తండ్రెవరో గుర్తించాలి’’ అంటూ తీవ్ర అభ్యంతకరకర వ్యాఖ్యలు చేశారాయన. సుప్రియా, ఘోష్ ఇద్దరికీ కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా తలంటింది. వారి వ్యాఖ్యలకు వివరణ కోరుతూ తాఖీదులిచ్చింది. ఘోష్‌కు బీజేపీ అధినాయకత్వం కూడా షోకాజ్ నోటీసిచ్చింది. అడ్డగోలు వ్యాఖ్యలు చేయడం ఆయనకు కొత్తేమీ కాదు. 2021 పశి్చమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ మమత కాలికి గాయమైంది. దాంతో కొంతకాలం వీల్‌చైర్‌లోనే ప్రచారం చేశారు. ఆ ఎన్నికల్లో తృణమూల్‌తో హోరాహోరీ తలపడ్డ బీజేపీ ఇదంతా సానుభూతి స్టంటేనంటూ ఎద్దేవా చేసింది. ఆ క్రమంలో, ‘బెర్ముడాలు (నిక్కర్లు) వేసుకుంటే సౌలభ్యంగా ఉంటుంది’ అంటూ అప్పట్లో మమతపై ఘోష్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఇక కేరళలో బీజేపీ నేత, సినీ నటుడు సురేశ్ గోపీ ప్రెస్‌మీట్ సందర్భంగా ఓ మహిళా జర్నలిస్టును పదేపదే అభ్యంతరకరంగా తాకడమూ వివాదం రేపింది. ఆమె ఒకటికి రెండుసార్లు ఆయన చేయిని అడ్డుకుంటూ నెట్టేసినా అలాగే వ్యవహరించారు. దీనిపై గొడవ పెద్దదవడంతో తప్పనిసరైన క్షమాపణలు చెప్పినా, పితృవాత్సల్యంతో అలా చేశానంటూ సమర్థించుకున్నారు. చిర్రెత్తుకొచ్చిన సదరు జర్నలిస్టు ఆయనపై కేసు పెట్టేదాకా వెళ్లింది. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ అగ్ర నేత కైలాశ్ విజయవర్గీయ కూడా ఇలాగే నోరు పారేసుకున్నారు. అభ్యంతరకర దుస్తులు ధరించే మహిళలు శూర్పణఖల్లా కనిపిస్తారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగకుండా, ‘‘దేవుడు మీకు అందమైన శరీరమిచ్చాడు. మంచి బట్టలేసుకోవచ్చుగా’’ అన్నారు. వీటిని సుప్రియా శ్రీనేత్ అప్పట్లో తీవ్రంగా తప్పుబట్టడం, మహిళలంటే బీజేపీకి గౌరవం లేదంటూ దుయ్యబట్టడం విశేషం! రాజకీయాలు అర్థం కాకుంటే ఇంటికెళ్లు వంట చేసుకొమ్మంటూ ఎన్సీపీ నేత సుప్రియా సులేను ఉద్దేశించి మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ వ్యాఖ్యలు కూడా అప్పట్లో మంటలు రేపాయి. ఆందోళనకరమే.. మన దేశంలో ఎన్నికల వేళ మహిళా నేతలపై అభ్యంతరకర వ్యాఖ్యలు పెరిగిపోతాయని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా పరిశోధన తేలి్చంది. ‘‘2019 లోక్‌సభ ఎన్నికల్లోనైతే వారిపై వ్యక్తిగత విమర్శలు అనూహ్య స్థాయిలో పెరిగిపోయాయి. 95 మంది మహిళా నేతలకు వచ్చిన 1.14 లక్షల ట్వీట్లను పరిశీలిస్తే 14 శాతం దాకా లింగవివక్షతో కూడిన అభ్యంతరకర విమర్శలే. అంటే ఒక్కొక్కరికీ రోజుకు సగటున ఇలాంటి 113 ట్వీట్లొచ్చాయి!’’ అని పేర్కొంది. బీజేపీ తరఫున యూపీలో రాంపూర్ నుంచి పోటీ చేసిన జయప్రదపై సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజం ఖాన్ ‘ఖాకీ లో దుస్తులు’ వ్యాఖ్యలు, ప్రియాంకా గాంధీ ‘పప్పూ కీ పప్పీ’ అంటూ బీజేపీ నేతల ఎద్దేవా, సినీ నటి హేమమాలిని ఓట్ల కోసం డ్యాన్సులు చేస్తారంటూ ప్రత్యర్థుల విమర్శలు... ఇలా 2019 ఎన్నికల్లో వివాదాలకు దారితీసిన ఉదంతాలెన్నో! ఇలా మహిళా నేతల వ్యక్తిత్వ హననానికి పూనుకునే ధోరణి మన దేశ రాజకీయాల్లో నేటికీ పెద్ద సవాలుగానే ఉందని విశ్లేషకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకరకంగా మన సమాజపు పురుషాహంకార వైఖరికి ఇది అద్దం పడుతోందని వారంటున్నారు. నిజానికి పోలింగ్ బూత్‌లకు వచ్చేందుకు పురుషుల నిరాసక్తత నేపథ్యంలో భారత్‌లో కొన్నేళ్లుగా ఏ ఎన్నికల్లోనైనా మహిళల ఓట్లు కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో నాయకురాళ్లను కించపరిస్తే మహిళల ఓట్లకు గండి పడవచ్చని తెలిసి కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేస్తుండటం ఆందోళనకర పరిణామమేనంటున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మహిళా నేతలనూ వంచించిన బాబు
సాక్షి, అమరావతి : చంద్రబాబు అంటేనే మోసం అన్న విషయం తెలుగుదేశం పార్టీలోని మహిళా నేతలకూ అనుభవపూర్వకంగా తెలిసివచ్చింది. రాజకీయాల్లో మహిళలను ప్రోత్సహిస్తానని, వారి పట్ల తనకు ఎనలేని గౌరవం ఉందంటూ చంద్రబాబు చెప్పే మాటలన్నీ వంచనపూరితమేనని స్పష్టమైంది. టీడీపీ కోసం సుదీర్ఘకాలం పనిచేసిన పలువురు మహిళలకు ఆయన అవమానకర రీతిలో సీట్లు నిరాకరించారు. గత టీడీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మాజీ మంత్రి పీతల సుజాతను అవమానకర రీతిలో పక్కన పెట్టారు. పార్టీ కోసం ఆమె సేవలను ఉపయోగించుకుని చింతలపూడి సీటు ఇవ్వకపోగా, ఆమె వల్ల ఎలాంటి ఉపయోగం లేదంటూ అవమానించారు. చింతమనేని ప్రభాకర్, మాగంటి బాబు వంటి నేతల అహంకారానికి దళిత మహిళనైన తాను బలైనట్లు ఆమె వాపోతున్నారు. వారు చెప్పినట్టు నడుచుకోలేదనే కారణంతోనే చంద్రబా బు సీటు తిరస్కరించారన్న వాదన పార్టీలో ఉంది. పనబాకను మోసం చేసిన బాబు టీడీపీలో మరో కీలక నేత, కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మికి చంద్రబాబు మొండిచేయి చూపారు. గత ఎన్నికల్లో తిరుపతి ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆమెను తిరుపతి ఉప ఎన్నికల్లోనూ పోటీ చేయించారు. వైఎస్సార్సీపీ బలంగా ఉన్నప్పటికీ, చంద్రబాబు మాట విని పార్టీ కోసం ఓటమికి సిద్ధమయ్యే పోటీకి దిగారు. వాస్తవంగా తిరుపతి ఉప ఎన్నికలో పోటీ చేయడానికి టీడీపీ నేతలెవరూ ముందుకు రాలేదు. ఉప ఎన్నికలో పోటీ చేస్తే వచ్చే ఎన్నికల్లో తిరుపతి ఎంపీ సీటుతోపాటు ఆమె భర్త కృష్ణయ్యకు ఎమ్మెల్యే సీటు కూడా ఇస్తానని చంద్రబాబు మభ్యపెట్టి పనబాకను పోటీకి దింపారు. అసలు ఎన్నికలు వచ్చేసరికి చంద్రబాబు ఆమెను వంచించారు. ఈ ఎన్నికల్లో పూర్తిగా పక్కనపెట్టేశారు. బాపట్ల, తిరుపతి ఎంపీ స్థానాల్లో ఏదో ఒక చోట అవకాశమివ్వాలని కోరినా పట్టించుకోలేదు. కష్టకాలంలో పార్టీ వెంట నిలబడ్డ తనను చంద్రబాబు మోసం చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిభా భారతికి మొండిచేయి టీడీపీలో సీనియర్ నేత, మాజీ స్పీకర్ కావలి ప్రతిభా భారతికీ బాబు సీటు నిరాకరించారు. ఆమె తన కుమార్తె గ్రీష్మకు శ్రీకాకుళం జిల్లా రాజాం సీటు ఇవ్వాలని కోరినా చంద్రబాబు పట్టించుకోలేదు. గ్రీష్మ టీడీపీ మహానాడులో తొడకొట్టి మరీ వైఎస్సార్సీపీ నేతలపై విరుచుకుపడడం చర్చనీయాంశమైంది. అలాంటి నేతలకు పార్టీలో అవకాశాలు ఇస్తామని చంద్రబాబు చెప్పారు. కానీ చివరికి రాజాం సీటును కొండ్రు మురళీమోహన్కి ఇచ్చారు. తన తండ్రి హయాం నుంచి టీడీపీని నమ్ముకున్న ఆమె కుటుంబానికి టీడీపీలో న్యాయం జరగలేదని ఆమె అనుచరులు చెబుతున్నారు. శ్రీకాకుళంలోనూ ఆది నుంచి పార్టీకి దన్నుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి స్థానంలో ధనబలం ఉన్న గొండు శంకర్‌కు సీటిచ్చారు. అప్పుడు మభ్యపెట్టారు.. ఇప్పుడు మోసగించారు 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున పాడేరు, రంపచోడవరం, పామర్రు అసెంబ్లీ స్థానాల్లో గెలిచిన గిడ్డి ఈశ్వరి, వంతల రాజేశ్వరి, ఉప్పులేటి కల్పనలను మభ్యపెట్టి చంద్రబాబు టీడీపీలో చేర్చుకున్నారు. గత ఎన్నికల్లో ఆ ముగ్గురూ ఓడిపోయినా నియోజకవర్గాల్లో తిరుగుతూ పనిచేశారు. కానీ సమీకరణలు, ధన బలం లేదనే కారణంతో ఈ ఎన్నికల్లో వారికి సీట్లు ఇవ్వకుండా అవమానించారు. చంద్రబాబు తమను నమ్మించి మోసం చేశారని గిడ్డి ఈశ్వరి, వంతల రాజేశ్వరి ఆందోళన వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ నుంచి గెలిచిన తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని కూడా మభ్యపెట్టి టీడీపీలో చేర్చుకుని ఇప్పుడు సీటు లేకుండా చేశారు. చంద్రబాబు మోసం చేశారనే ఉద్ధేశంతో రాజకీయాలు ఎలా ఉంటాయో తనకు ఇప్పుడు అర్థమైందంటూ ఆమె ఎక్స్(ట్విటర్)లో వాపోయారు. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున రాజమండ్రి నుంచి గెలిచిన ఒకే ఒక ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీకి ఈసారి సీటు లేకుండా చేశారు. భవానీ బదులు ఆమె భర్తకు అవకాశం ఇచ్చారు. ఉమ్మడి కర్నూలు జిల్లా ఆలూరులో కోట్ల సుజాతమ్మకు కూడా హ్యాండిచ్చేందుకు చంద్రబాబు సిద్ధమైనట్లు తెలుస్తోంది. -
వచ్చే పదేళ్లలో 50 శాతం మహిళా సీఎంలు
కొచ్చీ: కాంగ్రెస్ సంస్థాగత నిర్మాణంలో మహిళలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, వారిని మరింత ప్రోత్సహించాలని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. పార్టిలో ఇంకా చాలామంది మహిళా నాయకులను తయారు చేయాలని, దేశంలో వచ్చే పదేళ్లలో 50 శాత మంది మహిళా ముఖ్యమంత్రులు ఉండాలన్నదే తమ కాంగ్రెస్ లక్ష్యమని స్పష్టం చేశారు. శుక్రవారం కేరళలోని కొచీ్చలో మహిళా కాంగ్రెస్ నేతల సదస్సు ‘ఉత్సాహ్’ను రాహుల్ గాంధీ ప్రారంభించారు. ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి మహిళా ముఖ్యమంత్రి ఎవరూ లేరని అన్నారు. ముఖ్యమంత్రులు కావడానికి అవసరమైన అన్ని అర్హతలు కలిగిన మహిళా నాయకులు కాంగ్రెస్‌లో ఎంతోమంది ఉన్నారని చెప్పారు. ప్రయతి్నంచాలి, లక్ష్యం సాధించాలి అని సూచించారు. ఈరోజు నుంచి వచ్చే పది సంవత్సరాల్లో దేశంలో 50 శాతం మంది ముఖ్యమంత్రులు మహిళలే ఉండాలని, అదే మన లక్ష్యమని ఉద్ఘాటించారు. మహిళా బిల్లు అమల్లో జాప్యమెందుకు? ఆర్ఎస్ఎస్, బీజేపీపై రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. అవి రెండూ పూర్తిగా పురుషాధిక్య సంస్థలని ఆరోపించారు. అధికారంలో మహిళలకు భాగస్వామ్యం కల్పించడానికి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం అంగీకరించదని చెప్పారు. మొత్తం ఆర్ఎస్ఎస్ చరిత్రను గమనిస్తే ఏనాడూ ఆ సంస్థలో మహిళల భాగస్వామ్యం లేదని గుర్తుచేశారు. మహిళలను ప్రోత్సహించే విషయంలో కాంగ్రెస్, ఆర్ఎస్ఎస్ మధ్య ఎంతో వ్యత్యాసం ఉందన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందినప్పటికీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వెంటనే అమలు చేయకపోవడం దారుణమని రాహుల్ మండిపడ్డారు. జాప్యం ఎందుకని ప్రశ్నించారు. పార్లమెంట్లో ఆమోదం పొందాక దశాబ్దం తర్వాత అమలు చేసే బిల్లును తాను ఏప్పుడూ చూడలేదని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. మహిళా బిల్లు విషయంలో మాత్రమే ఇలా జరుగుతోందని తప్పుపట్టారు. ఇదంతా బీజేపీ ప్రభుత్వ నిర్వాకమేనని ఆక్షేపించారు. మైక్రోఫోన్‌ను ప్రజల వైపు మళ్లిస్తున్నా.. ఢిల్లీలో ఉండే కొందరు నాయకులు లౌడ్స్పీకర్లు, కెమెరాలను వారివైపే తిప్పుకుంటున్నారని రాహుల్ గాంధీ పరోక్షంగా బీజేపీ నాయకులపై ధ్వజమెత్తారు. తాను మాత్రం మైక్రోఫోన్‌ను ప్రజల వైపు మళ్లిస్తున్నానని చెప్పారు. సమస్యలను చెప్పుకొనే అవకాశం ప్రజలకు ఇస్తున్నానని తెలిపారు. -
కొండా Vs ఎర్రబెల్లి.. తెర వెనుక ఏం జరుగుతోంది?
సాక్షి, వరంగల్: వరంగల్ డీసీసీ అధ్యక్ష పదవి.. కాంగ్రెస్‌లో చిచ్చుపెట్టిందా.. ఇద్దరు మహిళా నేతల మధ్య ఆధిపత్య పోరుకు ఆజ్యం పోసిందా.. తూర్పు టిక్కెట్ రాజకీయంగా దూమారం రేపుతుందా?.. అంటే ఔననే సమాధానం వస్తుంది. డీసీసీ తొలి సమావేశంలో వర్గ విబేధాలు బహిర్గతంకావడం కాంగ్రెస్‌లో కలకలం సృష్టిస్తుంది. తూర్పులో కొండా వర్సెస్ ఎర్రబెల్లి అన్నట్లు రాజకీయాలు సాగుతున్నాయి. ఉద్యమాల ఖిల్లా వరంగల్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాలు రచ్చకెక్కాయి. తూర్పులో రెండు వర్గాల మధ్య ఆధిపత్యపోరు సాగుతుంది. రాబోయే కాలానికి కాబోయే ఎమ్మెల్యే తానే అంటు మాజీమంత్రి కొండా సురేఖ ప్రచారం సాగిస్తుండగా అనూహ్యంగా డీసీసీ అధ్యక్ష పదవి దక్కించుకున్న మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఇద్దరి మధ్య ఇప్పుడు పచ్చిగడ్డి వస్తే భగ్గుమనే స్థాయిలో గ్రూప్ రాజకీయాలు సాగుతున్నాయి. వరంగల్ డిసీసీ అధ్యక్ష పదవి తమ అనుచరులకు ఇప్పించుకునేందుకు కొండ సురేఖ-మురళీ దంపతులు విశ్వప్రయత్నం చేశారు. చివరకు ఎర్రబెల్లి స్వర్ణకు డీసీసీ పదవి దక్కింది. అప్పటి నుంచి గుర్రుగా ఉన్న కొండా దంపతులు పార్టీలో తమ ప్రాధాన్యతను చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. డీసీసీ అధ్యక్ష పదవి బాధ్యతల స్వీకరణ సందర్బంగా ఎర్రబెల్లి స్వర్ణ వరంగల్ తూర్పునియోజకవర్గంలో తొలిసారి పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. జిల్లాలోని నాయకులతోపాటు పక్క జిల్లాలకు చెందిన పార్టీ సీనియర్ నేతలు హజరయ్యారు. తూర్పు టిక్కెట్ ఆశిస్తు ప్రచారం సాగిస్తున్న కొండా దంపతులు మాత్రం ఆ సమావేశానికి హాజరుకాలేదు. వారి అనుచరులను సైతం సమావేశానికి హాజరుకాకుండా కట్టడి చేశారు. కానీ కొండా వర్గానికి చెందిన కట్టస్వామి హాజరయ్యారు. తమకు పార్టీలో ప్రాధాన్యత ఇవ్వడం లేదని ప్రశ్నించే ప్రయత్నం చేయగా అతనిపై పరకాల నియోజకవర్గానికి చెందిన ఇనుగాల వెంకట్రాంరెడ్డి వర్గానికి చెందినవారు దాడి చేశారు. చొక్కా చించేసి చితకబాదారు. పార్టీ ముఖ్యనాయకుల సమక్షంలోనే రెండు వర్గాలు పరస్పరం తన్నుకోవడంతో సమావేశం రసాభసగా మారింది. ముందుగా ఎర్రబెల్లి స్వర్ణ-వరదరాజేశ్వర్‌రావు, కొండా సురేఖ-మురళీ వర్గీయులే కొట్టుకున్నారని ప్రచారం సాగింది. ఆ ప్రచారాన్ని ఎర్రబెల్లి వర్గీయులు కొట్టిపారేశారు. పార్టీలో గ్రూప్‌లు లేవని, తామందరిది ఒకే గ్రూప్ కాంగ్రెస్ అని ఎర్రబెల్లి వరదరాజేశ్వర్‌రావు స్పష్టం చేశారు. డీసీసీ సమావేశానికి కొండా దంపతులు దూరంగా ఉన్నప్పటికి సాయంత్రం లేబర్ కాలనీలో కొండా మురళీ పర్యటించి పలువురిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. అక్కడ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. కొండా దంపతుల పని అయిపోయిందని, సురేఖ ఇటురాదని, వేరే వాళ్లు వస్తారని ప్రచారం కావడంపై మురళీ ఘాటుగానే స్పందించారు. సురేఖ ఎటూ పోదు..తూర్పు నుంచే పోటీ చేస్తుందని మురళి స్పష్టం చేశారు. ఇరువర్గాల నేతల వ్యాఖ్యలు కాస్త పార్టీలో కలకలం సృష్టిస్తున్నాయి. పైకి అంతాకలిసి ఉన్నామని పోజులిచ్చినప్పటికి అంతర్గతంగా గ్రూప్ రాజకీయాలతో రగిలిపోతున్నారు. వర్గ విబేధాలకు ప్రధాన కారణం వరంగల్ తూర్పు అసెంబ్లీ టిక్కెట్, డీసీసీ అధ్యక్ష పదవేనని తెలుస్తుంది. పనిచేసే వారికి అధిష్టానం డీసీసీ పదవి ఇచ్చిందని ఎర్రబెల్లి వర్గం భావిస్తుండగా, ఏకాభిప్రాయం లేకుండా ఎలా డీసీసీ అధ్యక్ష పదవిని ఖరారు చేస్తారని కొండా వర్గీయులతోపాటు అసంతృప్తివాదులు మడిపడుతున్నారు. ఇంతకాలం నివురు గప్పిన నిప్పులా ఉన్న టికెట్ పోరు ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన టీపీసీసీ సమావేశంతో సైతం బహిర్గతమైనట్లు సమాచారం. ఆ సమావేశంలో పార్టీ గెలుపే లక్ష్యంగా నాయకులు కార్యకర్తలు పనిచేయాలని పార్టీ పెద్దలు సూచించారట. పీసీసీ నాయకత్వం కొండా సురేఖను పరకాల నుంచి పోటీ చేయాలని సూచించగా, సురేఖ మాత్రం వరంగల్ తూర్పు నుంచే పోటీ చేస్తానని పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పీసీసీ నాయకత్వం కొండా ప్రతిపాదనలకు భిన్నంగా ఎర్రబెల్లి స్వర్ణను డీసీసీ అధ్యక్షురాలిగా నియమించడంతో తూర్పు తమదేనంటూ ప్రచారం సాగిస్తున్న కొండా దంపతులకు మింగుడు పడడంలేదట. అందులో భాగంగానే గ్రూప్ రాజకీయాలు నడుస్తున్నాయట. తూర్పు అభ్యర్థిగా సురేఖ స్వయంగా ప్రకటించుకుని నియోజకవర్గంలో ప్రచారం సాగిస్తున్నారు. ప్రస్తుతం డీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించన ఎర్రబెల్లి స్వర్ణ సైతం తూర్పులో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారట. డీసీసీ అధ్యక్ష పదవి తమ అనుచరులకు ఇవ్వకుండా ఎర్రబెల్లి స్వర్ణకు కట్టబెట్టడమే కాకుండా తెరచాటుగా తూర్పు నియోజకవర్గంపై స్వర్ణ కన్నెయ్యడంతో కొండా దంపతులు అసంతృప్తితో పరోక్షంగా హెచ్చరిస్తున్నట్లు సమాచారం. చదవండి: కొండా వర్గీయుడిపై ఇనుగాల వర్గీయుల దాడి ఎవరైనా తూర్పులో కాంగ్రెస్ కార్యకర్తల జోలికి వస్తే క్రేన్‌కు వేలాడదీస్తామని, పాత కొండా మురళిని చూస్తారని హెచ్చరించినట్లు స్థానికులు భావిస్తున్నారు. ఇద్దరు మహిళా నేతల మధ్య టికెట్ పోరు అటు పార్టీ పెద్దలను ఇటు కార్యకర్తలను అయోమయానికి గురిచేస్తున్నాయి. పరోక్ష హెచ్చరికలు, గ్రూప్ రాజకీయాలు ఎటువైపు దారితీస్తాయోనని పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. కర్నాటకలో కాంగ్రెస్ ఘనవిజయంతో పార్టీ శ్రేణులు నూతనోత్సాహంతో ముందుకు సాగుతుంటే వర్గ విభేదాలు, గ్రూప్ తగాదలు తలనొప్పిలా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
సీఎం వైఎస్ జగన్ తో మహిళా నాయకులు సెల్ఫీ
-
రాజ్‌భవన్ వద్ద ఉద్రిక్తత.. మేయర్ విజయలక్ష్మి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: రాజ్‌భవన్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రాజ్‌భవన్ గేటు ముందు బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. బండి సంజయ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బండి సంజయ్ వ్యాఖ్యలపై ఫిర్యాదు చేసేందుకు గవర్నర్ తమిళిసైని కలవడానికి మేయర్ బృందం ప్రయత్నించగా, గవర్నర్ అపాయింట్మెంట్ లేదని రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి. దీంతో రాజ్‌భవన్ వద్ద బైఠాయించి నిరసనకు దిగిన మహిళా నేతలు.. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రాజ్‌భవన్ గోడకు వినతి పత్రం అంటించారు. ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో మేయర్ విజయలక్ష్మిని పోలీసులు అరెస్ట్ చేశారు. అపాయింట్మెంట్ అడిగినా గవర్నర్ స్పందించలేదని.. ఆమెను కలిసే వరకూ ఇక్కడే ఉంటామని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తేల్చి చెప్పారు. బండి సంజయ్.. మహిళలను అవమానించారని మేయర్ మండిపడ్డారు. ‘‘మహిళల పట్ల సంజయ్ సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారు.. సంజయ్‌ను నోటిని ఫినాయిల్‌తో కడగాలి. సంజయ్ వ్యాఖ్యలు సమాజం తలదించుకునేలా ఉన్నాయి. బేషరతుగా మహిళలకు సంజయ్ క్షమాపణలు చెప్పాలని మేయర్ విజయలక్ష్మి డిమాండ్ చేశారు. చదవండి: కవితపై అనుచిత వ్యాఖ్యలు.. బండి సంజయ్‌పై కేసు నమోదు.. -
కళ్లలో కారం చల్లి, కర్రలతో దాడి
లబ్బీపేట, కృష్ణలంక (విజయవాడ తూర్పు): విజయవాడలో టీడీపీ వర్గీయులు వైఎస్సార్సీపీ మహిళా నేతలు, కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు. వైఎస్సార్సీపీ విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి దేవినేని అవినాష్ చేపట్టిన ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో పాల్గొనడానికి మంగళవారం తారకరామ నగర్లో పలువురు వైఎస్సార్సీపీ మహిళా నేతలు ఎదురు చూస్తున్నారు. అంతలో టీడీపీకి చెందిన షేక్ ఫాతిమా రమీజా మరికొందరు అక్కడికి వచ్చి వారితో దురుసుగా వ్యవహరించారు. మాటలతో రెచ్చగొడుతూ వారిపైకి దూసుకెళ్లారు. వెంట తెచ్చుకున్న కారం వారి కళ్లల్లో చల్లి.. కర్రలతో దాడి చేస్తూ భయానక వాతావరణం సృష్టించారు. ఈ దాడిలో వైఎస్సార్సీపీకి చెందిన బచ్చు మాధవి, సునీత మరికొందరికి గాయాలయ్యాయి. అక్కడే ఉన్న వలంటీర్ శాంతిరెడ్డిపైనా దాడికి యత్నించారు. టీడీపీ దాడిలో గాయపడిన సునీత, బచ్చు మాధవి సౌత్ ఏసీపీ రవికిరణ్, కృష్ణలంక సీఐ దుర్గారావు పోలీసు సిబ్బందితో వచ్చి పరిస్థితిని చక్కదిద్దారు. గాయపడ్డ వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తమ కళ్లల్లో కారం చల్లి, దాడి చేశారని బి.సునీత.. టీడీపీకి చెందిన షేక్ ఫాతిమా, రమీజా, శైలు, మరో 10 మందిపై ఫిర్యాదు చేసింది. ఇదిలా ఉండగా విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు కృష్ణలంక పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని, వైఎస్సార్సీపీ నేతలే తమ వాళ్లపై దాడి చేశారని ఆందోళన చేపట్టారు. బచ్చు మాధవి, రామిరెడ్డి, దామోదర్, మరో 11 మంది తమపై దాడి చేశారంటూ ఫాతిమా, రమీజా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇరు వర్గాల ఫిర్యాదులను స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేస్తామని తెలిపారు. నియోజకవర్గంలో తనకు లభిస్తున్న ఆదరణ చూసి ఓటమి భయంతోనే టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని దేవినేని అవినాష్ మండిపడ్డారు. -
సాహితీ కొండపల్లికి ‘విమెన్ లీడర్స్ ఫోరం’ అవార్డు
సాక్షి, హైదరాబాద్: వైద్యపరికరాలు, మందుల (మెడికల్ డివైసెస్ అండ్ ఫార్మాసిటిక్స్)కు సంబంధించిన రెగ్యులేటరీ రైటింగ్ కంపెనీ క్రైటీరియన్ ఎడ్జ్ డైరెక్టర్ సాహితీ కొండపల్లిని ‘విమెన్ లీడర్స్ ఫోరం–2022’ అవార్డు వరించింది. మంగళవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆమె అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమెను విమెన్ లీడర్స్ ఫోరం జ్యూరీ టీమ్ అభినందించింది. ‘విమెన్ లీడర్ అవార్డ్ ఇన్ లీడర్షిప్’ కేటగిరీలో ఈ అవార్డును అందజేసినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. సాహితి 40 మందికి పైగా మెడికల్ రైటర్స్ బృందానికి నేతృత్వం వహిస్తూ వివిధ లక్ష్యాల సాధనలో తమదైన పాత్రను, నైపుణ్యాలను చూపుతున్నారు. వైద్య, ఆరోగ్యరంగంలో ఆయా బృందాలకు నేతృత్వం వహిస్తూ నైపుణ్యాల అభివృద్ధిలో తోడ్పాటునందిస్తున్నారు. -
మహిళలపై దౌర్జన్యాలు టీడీపీకి నిత్యకృత్యాలా?
పాలకొల్లు సెంట్రల్: మహిళల పట్ల దౌర్జన్యం, వారిని అగౌరవ పరచడం టీడీపీ నేతలకు వెన్నతో పెట్టిన విద్యలా ఉందని వైఎస్సార్ సీపీ మహిళా నేతలు మండిపడ్డారు. అమరావతి రైతుల పాదయాత్రపై ప్రశ్నించిన మహిళ పట్ల పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు దురుసుగా ప్రవర్తించడాన్ని నిరసిస్తూ పట్టణంలోని గాంధీ బొమ్మల సెంటర్ వద్ద సోమవారం వారు నల్ల బెలూన్లతో ధర్నా నిర్వహించారు. ఎమ్మెల్యే ఫ్లెక్సీని దహనం చేశారు. వైఎస్సార్ సీపీ మహిళా నేతలు మాట్లాడుతూ మహిళ పట్ల దురుసుగా ప్రవర్తించిన ఎమ్మెల్యే రామానాయుడు తన పదవికి రాజీమానా చేసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. యలమంచిలి ఎంపీపీ రావూరి వెంకటరమణ, సర్పంచ్‌లు దిడ్ల మణివజ్రం, కడలి నాగమణి, మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు. -
సీఎం వైఎస్ జగన్‌కు రాఖీలు కట్టిన మహిళా నేతలు
-
సీఎం జగన్‌కు రాఖీలు కట్టిన మహిళా నేతలు
సాక్షి తాడేపల్లి: రక్షాబంధన్ (రాఖీ పౌర్ణమి) సందర్భంగా సీఎం నివాసంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి హోంమంత్రి తానేటి వనిత, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని, మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వీఎంఆర్డీఏ చైర్పర్సన్ అక్రమాని విజయనిర్మల, రుడా చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, మహిళా కమిషన్ సభ్యులు కర్రి జయశ్రీ, గెడ్డం ఉమ రాఖీలు కట్టారు. వీరితో పాటు ఈశ్వరీయ బ్రహ్మకుమారి ప్రతినిధులు రాజయోగిని బ్రహ్మకుమారి శాంత దీదీ జీ, సిస్టర్స్ పద్మజ, మానస.. సీఎంకు రాఖీలు కట్టారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా సెప్టెంబర్‌లో మౌంట్ అబూలో జరిగే గ్లోబల్ సమ్మిట్‌కు ముఖ్యమంత్రిని బ్రహ్మకుమారి ప్రతినిధులు ఆహ్వానించారు. చదవండి: రూ.6కే మధ్యాహ్న భోజనం కాగా, రాఖీ పండుగ సందర్భంగా రాష్ట్రంలోని ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు.. ప్రతి ఒక్క పాపకు, ప్రతి ఒక్క మహిళకు సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. రక్షాబంధనం అనేది ఆత్మీయతలు, అనురాగాల పండుగ అని.. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, విద్యాపరంగా, రక్షణపరంగా మహిళలకు మంచి చేసే విషయంలో దేశంలోనే ముందున్న మనందరి ప్రభుత్వానికి రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మలందరి చల్లని దీవెనలు, దేవుడి ఆశీస్సులు కలకాలం లభించాలని కోరుకుంటున్నట్లు సీఎం జగన్ బుధవారం తన సందేశంలో పేర్కొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
తిట్టుకున్న టీడీపీ మహిళా నేతలు.. గొడవ ఎందుకంటే?
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ జిల్లా మహిళా నేతల మధ్య రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత సాక్షిగా విబేధాలు మరోసారి భగ్గుమన్నాయి. మద్యపాన నిషేధంపై శనివారం ఉదయం పార్టీ కార్యాలయం నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకూ టీడీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈక్రమంలో తెలుగు మహిళ రాష్ట్ర అధికార ప్రతినిధి ఈతలపాక సుజాత.. విశాఖ పార్లమెంట్ అధ్యక్షురాలు అనంతలక్ష్మి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ ర్యాలీలో తనకు చోటు కల్పించకుండా ఎందుకు పక్కకు నెడుతున్నారంటూ అనంతక్ష్మిని నిలదీశారు. దీంతో వివాదం మొదలైంది. చదవండి: బాబూ.. తిట్టేశాం! చంద్రబాబుకు చెప్పుకున్న తిరుపతి టీడీపీ నేతలు కార్యక్రమాలు మేం నిర్వహిస్తున్నామంటూ అనంతలక్ష్మి బదులియ్యడంతో.. పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలి ఆధ్వర్యంలో ఏం చేస్తున్నారో అందరికీ తెలుసనీ.. పదవి వచ్చిన తర్వాత.. ఇష్టం వచ్చినట్లు ఎవరుపడితే వాళ్ల దగ్గర నోటికొచ్చినట్లు మాట్లాడటం సరికాదని సుజాత అన్నారు. ఎవరికి పదవి ఎలా వచ్చిందో తమకు తెలుసనీ.. సభ్యతగా మాట్లాడాలని అనంతలక్ష్మికి ఆమె సూచించారు. సామాజిక వర్గాన్ని తక్కువ చేసి నోరుజారి మాట్లాడితే అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని సుజాత హెచ్చరించారు. ఇరువురి మధ్య వాగ్వాదం తారస్థాయికి చేరుతుండటంతో అనిత కలుగజేసుకుని మీడియా ఉన్న దగ్గర గొడవలు వద్దని సర్ది చెప్పారు. ఇలా తెలుగు మహిళల మధ్య మొదలైన ప్రోటోకాల్ వివాదం.. వ్యక్తిగత దూషణల వరకూ వెళ్లింది. అనంతలక్ష్మి వ్యవహారంపై టీడీపీ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌కు సుజాత ఫిర్యాదు చేశారు. -
బతుకంతా బాలల కోసం!
మీనా స్వామినాథన్ మరణం తరాలుగా ఆమె పని నుండి స్ఫూర్తిని పొందిన పరిశోధకులకు, అభ్యాసకులకు, కార్య కర్తలకు తీరని లోటు. అన్నింటికంటే కూడా భారతదేశ అంగన్వాడీ రంగానికి నష్టం. ఆమె ఒక మార్గదర్శక విద్యావేత్త, పరిశోధకురాలు, మహిళా సమానత్వం కోసం కృషి చేసిన కార్యకర్త. ఆమె భారతదేశ బాలలకు, ముఖ్యంగా అభాగ్యులకు విరామమెరుగక సేవలందించిన స్నేహితురాలు. స్వాతంత్య్రానంతర దశాబ్దాలలో, మీనా స్వామినాథన్‌తో పాటుగా ఒక తరం మహిళా నాయకులు కొన్ని విశిష్టమైన ఆలోచనలకు ఊపిరి పోశారు. కొత్తగా రెక్కలొచ్చిన దేశంలో ఆ ఆలోచనలు పలు వర్గాలవారి సంక్షేమ కార్యక్రమాలకు పునాదులు వేశాయి. సెంటర్ ఫర్ ఉమెన్స్ డెవలప్మెంట్ స్టడీస్ (సీఎస్డీఎస్), సంచార శిశు లాలన కేంద్రాల వంటి వినూత్న సదుపాయాల కల్పనకు ఆచరణ రూపం ఇవ్వడంలో మీనా విస్తృత∙భాగస్వామిగా ఉన్నారు. భారతదేశంలో ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ (ఐసీడీఎస్) ఏర్పాటుకు మూలం అయిన నివేదిక బృందానికి ఆమె నేతృత్వం అత్యంత కీలకమైనది. మీనా 1933లో జన్మించారు. ఆమె తల్లి ప్రముఖ తమిళ రచయిత్రి ‘కృతిక’ మధురం. తండ్రి సుబ్రహ్మణ్యం భూతలింగం. ఆయన ప్రభుత్వోద్యోగి, ఆర్థికవేత్త. మీనా కేంబ్రిడ్జ్‌లో తన కాబోయే భర్త, ప్రపంచ ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్‌ను కలుసుకున్నారు. స్వతంత్ర భారతదేశంలో దేశ నిర్మాణానికి ఈ దంపతులిద్దరూ కట్టుబడి ఉన్నారు. బెంగాల్ కరవు వల్ల సంభవించిన వినాశనం తరువాత, స్వామినాథన్ వ్యవసాయ శాస్త్రాన్ని అభ్యసించారు. భారతదేశంలో ‘హరిత విప్లవ పితామహుడు’గా గుర్తింపు పొందారు. ప్రతిష్ఠాత్మకమైన ‘వరల్డ్ ఫుడ్ ప్రైజ్’ తొలి విజేత కూడా! దేశానికి మీనా అందించిన సేవలు, కృషి కూడా అంతే విస్తృతమైనవి. 1970లో శిశు అభివృద్ధి అధ్యయన బృందానికి అధ్యక్షురాలయ్యే అవకాశం ఆమెకు లభించింది. ఈ బృందంలో చిత్రా నాయక్, జేపీ నాయక్, అనిల్ బోర్డియా వంటి ప్రముఖులు ఉన్నారు. 1972లో వెలువడిన ఆ బృందం నివేదిక ఒక శక్తి మంతమైన సంకల్పానికి పిలుపునిచ్చింది. ‘‘సాధారణ బాలలు, అభాగ్యులైన బాలల మధ్య ఏటా అంతరం పెరుగుతూ వస్తోంది. కనుక పాఠశాలకు పూర్వ దశలోనే సామాజిక న్యాయంతో ఆ అంతరాన్ని తగ్గించాలి. ఎందుకంటే మొదటి ఐదు సంవత్సరాలే బాలల్లో అన్ని రకాల అభివృద్ధికి కీలకం’’ అని మీనా వ్యాఖ్యా నించారు. ఆ నివేదిక ప్రపంచంలోనే అతిపెద్ద కార్యక్రమం అయిన ఐసీడీఎస్ ఆవిర్భావానికి మూలం అయింది. పిల్లలకు, తల్లులకు మెరుగైన సదుపాయాలు, సహాయ సహకారాలు ఉండాలని మీనా విశ్వసించారు. ‘‘నా బిడ్డను చూసు కోవాల్సిన అవసరం ఉన్నందున నేను పని చేయడం మానేశాను’’ అని ఒక స్త్రీ చెప్పినప్పుడు, సమాజం దానిని సహజమైన విష యంగా భావిస్తుంది. ఇది సరైన భావన కాదు. ఏదో కన్నాం, పుట్టారు అని కాకుండా... సంతోషం కోసమే సంతానం అనుకున్న ప్పుడు ఆ బిడ్డల సంరక్షణను తండ్రి, కుటుంబ సభ్యులు కూడా స్వీకరించాలి. సమాజానికి, ప్రభుత్వానికి కూడా పిల్లల వికా సంలో ప్రమేయం ఉండాలి’’ అంటారు మీనా. తల్లిపాలే ఆరోగ్యం అని ప్రచారం చేస్తున్నప్పుడు తల్లికి పౌష్టికాహారపు అవసరం తెలియజెప్పాలని కూడా మీనా చెబుతారు. 1979లోనే మీనా పట్టణ పేదల పిల్లల ఆరోగ్యం, వికాసం గురించి అనేక అధ్యయన పత్రాలను సమర్పించారు. పట్టణ పేదరికంలో పెరుగుతున్న లక్షలాది మంది పిల్లలు విధాన నిర్ణేతలకు కనిపించడం లేదని ఆమె విమర్శించారు. ప్రభుత్వాలు గ్రామీణ భారతదేశంపై ప్రత్యేక దృష్టి పెట్టడం వల్ల కూడా పట్టణ బాలల్లో పేదరికం లేదన్న భావన ఏర్పడుతోందని అంటూ.. ‘‘ఫౌంటైన్లు, పార్కులు, నగర సుందరీకరణ కోసం నిధులు అక్కరలేదు. అదే వనరులను పేద పిల్లలకు అవసరమైన కార్య క్రమాల కోసం ఉపయోగించలేరా?’’ అని ఘాటుగా ప్రశ్నించారు. మీనా 1985లో సీఎస్డీఎస్ కోసం భారతదేశంలోని తక్కువ ఆదాయం కలిగిన శ్రామిక మహిళల కోసం పిల్లల సంరక్షణ సౌకర్యాలపై ‘హూ కేర్స్?’ అనే పేరుతో ఒక అధ్యయనాన్ని నిర్వహించారు. ‘కాళి ఫర్ ఉమెన్’ అనే స్త్రీవాద ప్రచురణాలయం దీనిని అచ్చు వేసింది. ముందుమాటలో వినా మజుందార్: ‘రాజ్యాంగంలోని సమానత్వ నిబంధనల నుంచి ప్రయోజనం పొందగలమని ఆశించిన మన మొదటి తరం మహిళల మాదిరిగానే... స్వాతంత్య్రం వచ్చినప్పుడు మహిళల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని మీనా స్వామినాథన్ కూడా నమ్మారు’’ అని రాశారు. కానీ మహిళల సమస్యలు అలాగే ఉండిపోయాయి. మహిళలు సాధారణంగా అతి స్వల్ప వేతనం లభించే పిల్లల సంరక్షణ వంటి తక్కువ నైపుణ్యాలు అవసరమైన పనిలోకి వెళ్లే విధంగా సామాజిక, కుటుంబ పరమైన ఒత్తిళ్లకు గురవుతారు. తద్వారా వారు శ్రామికశక్తిలో భాగంగా కనిపించకుండా పోతారు. మీనా విద్యావేత్త. తన జీవితమంతా స్త్రీ, శిశు సంక్షేమానికి అవసరమైన అధ్యయనాలు చేస్తూ ప్రభుత్వానికి, పలు సంస్థలకు మార్గదర్శకంగా ఉన్నారు. ‘‘చివరికొచ్చే సరికి పరిశోధనా ఫలితాలన్నవి ఆచరణకు ప్రేరణవ్వాలి’’ అని అంటారు మీనా. యాభై సంవత్సరాల క్రితం, దేశవ్యాప్తంగా అంగన్వాడీలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించడమంటే అదెంతో సాహస వంతమైన దృక్పథం అనే చెప్పాలి. మీనా అలాంటి ఆలోచన చేయగలిగారు. నేడు భారతదేశంలో పది లక్షల కంటే ఎక్కువ అంగన్వాడీలు ఉన్నాయి. అంతకు రెట్టింపుగా అంగన్వాడీ కార్య కర్తలు అనేక లక్షల మంది తల్లులకు, పిల్లలకు బహుళ సేవలను అందిస్తున్నారు. జార్జ్ బెర్నార్డ్ షా నాటకంలోని పాత్ర ఒకటి ఈ సందర్భంగా నాకు గుర్తుకు వస్తోంది: ‘‘మీరు జరుగుతున్నవి చూస్తారు. ‘ఎందుకు?’ అనుకుంటారు. కానీ నేను జరగనివాటిని కలగంటాను. ‘ఎందుకు కాదు?’ అని అడుగుతాను’’ అంటుంది ఆ పాత్ర. భారతదేశపు పిల్లల తరఫున మీనా స్వామినాథన్ అడిగిందీ ఇదే.. ‘ఎందుకు కాదు?’ అని! వ్యాసకర్త ఐఏఎస్ అధికారి (‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ సౌజన్యంతో) -
టీడీపీ కార్యాలయం ఎదుట తెలుగు మహిళల ధర్నా
మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ రాష్ట్ర కార్యాలయం ఎదుట తెలుగు మహిళ నాయకులు, కార్యకర్తలు బుధవారం ధర్నా నిర్వహించారు. టీడీపీలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, మైనార్టీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని వాపోయారు. లోకేష్ పీఏ సాంబశివరావు బృందం టీడీపీలోని మహిళా కార్యకర్తలను లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపించారు. నాయకులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. తక్షణమే న్యాయం చేయకపోతే పార్టీ కార్యాలయం ఎదుట ఆమరణ దీక్షకు దిగుతామని హెచ్చరించారు. ఈ సందర్భంగా పెదవడ్లపూడి గ్రామానికి చెందిన మహిళా టీడీపీ నాయకురాలు పాలేటి కృష్ణవేణి మాట్లాడుతూ.. పార్టీ కోసం తాము పనిచేస్తుంటే అకారణంగా తమను ఎందుకు సస్పెండ్ చేశారో సమాధానమివ్వాలని డిమాండ్ చేశారు. పార్టీ కోసం పనిచేసే బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, మైనార్టీలకు తీవ్ర అన్యాయం, అవమానాలు జరుగుతున్నాయన్నారు. బడుగు బలహీనవర్గాలకు, దళితులకు టీడీపీలో సరైన ప్రాతినిధ్యం లేదని వాపోయారు. దళితులకు మంగళగిరి నియోజకవర్గంలో ఒక్కరికైనా మండల అధ్యక్ష పదవి కేటాయించారా అని ప్రశ్నించారు. చంద్రబాబు నిలబెట్టిన అభ్యర్థులను ఓడిస్తున్న పార్టీ మాజీ ఇన్చార్జి పోతినేని శ్రీనివాసరావును ఎందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేయడం లేదని నిలదీశారు. పార్టీలో చంద్రబాబు సామాజిక వర్గానికి మాత్రమే ప్రాధాన్యత ఉంటోందని, మరే సామాజిక వర్గానికి పార్టీలో ప్రాధాన్యత ఉండటం లేదని వాపోయారు. అన్ని సామాజిక వర్గాలు గుర్తించాలని కోరారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. తాము ఏ తప్పు చేశామో తమకు సమాధానం చెప్పాలని, లేదంటే పార్టీ కార్యాలయం ముందు ఆమరణ నిరాహార దీక్షకు వెనుకాడబోమన్నారు. మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు చేరుకుని రాష్ట్ర పార్టీ కార్యాలయం ఎదుట ధర్నాలు చేయడం సమంజసం కాదన్నారు. సమస్యను రాతపూర్వకంగా తెలియజేస్తే అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామనడంతో మహిళలు ఆనంద్‌బాబుకు వినతిపత్రం అందజేసి ఆందోళన విరమించారు. -
‘తెలంగాణ మంత్రులకు చీరలు, గాజులు పంపుతున్నాం’
సాక్షి, హైదరాబాద్: ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఢిల్లీలో తేల్చుకొస్తామని వెళ్లి ఉత్త చేతులతో వచ్చిన రాష్ట్ర మంత్రులకు చీరలు, గాజులు, పసుపు, కుంకుమ, బొట్టు బిళ్లలు పంపుతున్నట్టు మహిళా కాంగ్రెస్ నేతలు వెల్లడించారు. శనివారం గాంధీ భవన్లో టీపీసీసీ అధికార ప్రతినిధులు కల్వ సుజాత, రవళిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర మంత్రులను ఆడవారితో పోల్చడమంటే తమకే అవమానంగా ఉందన్నారు. అయినా పీసీసీ అధ్యక్షుడి ఆదేశాలతో వారికి చీరలు, గాజులు పంపుతున్నామని చెప్పారు. ఢిల్లీలో అగ్గి పుట్టిస్తామని వెళ్లిన మంత్రులు వారం రోజులు అక్కడే ఉండి ఏం చేశారని ప్రశ్నించారు. పార్లమెంటు సమావేశాల్లో కూడా ఈ అంశంపై సరిగ్గా పోరాడలేక టీఆర్ఎస్ చేతులెత్తేసిందన్నారు. కనీసం కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్లు కూడా వారికి కష్టమయ్యాయని ఎద్దేవా చేశారు. చేతకాని రాష్ట్ర మంత్రులు రాజీనామా చేసి, చీర, గాజులు వేసుకుని ఇంట్లో కూర్చోవాలని సుజాత, రవళి రెడ్డి వ్యాఖ్యానించారు. (చదవండి: Hyderabad: న్యూఇయర్ వేడుకలు.. లిక్కర్ టార్గెట్‌పై ఒమిక్రాన్ ఎఫెక్ట్ ) -
Manjula Pradeep: ఎవరీమె... ఏం చేస్తున్నారు.. ఎందుకీ పోరాటం?
‘ఎందుకు ఇన్ని రోజులు ఆగాల్సి వచ్చింది?’... ‘ఇంట్లో వాళ్లకు చెప్పడానికి భయమేసింది. కాస్త ఆలస్యంగా చెప్పాను. ఈ విషయం ఇంకెక్కడా చెప్పకు పరువు పోతుంది అన్నారు. కాని మీ గురించి విన్న తరువాత ధైర్యంగా ముందుకు రావాలనిపించింది. అందుకే వచ్చాను’- ఓ అత్యాచార బాధితురాలు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి మృగాల మీద ఫిర్యాదు చేయడానికి ఆమెకు ధైర్యం చాలలేదు. ఆమె కుటుంబానికేమో ‘పరువు ఏమైపోతుందో’ అనేది పెద్ద సమస్య అయిపోయింది. ‘నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఉమెన్ లీడర్స్’(National Council Of Women Leaders)ను ఆశ్రయించిన ఎంతో మంది బాధితుల్లో ఆమె కూడా ఒకరు. ఎవరీ ఉమెన్ లీడర్స్? ‘ఎవరో వస్తారని, ఏదో చేస్తారని చూడకుండా మనలో నుంచే లీడర్స్ రావాలి, మనకు జరిగే అన్యాయాలపై పోరాడాలి, హక్కుల చైతన్యాన్ని ఊరువాడకు తీసుకెళ్లాలి’ అనే ఆశయంతో ఏర్పాటైందే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఉమెన్ లీడర్స్. గుజరాత్‌కు చెందిన మంజుల ప్రదీప్(Manjula Pradeep) గత మూడు దశాబ్దాలుగా అట్టడుగు వర్గాల మహిళల హక్కుల గురించి పనిచేస్తోంది. ఎక్కడ ఏ అన్యాయం జరిగినా బాధితులకు అండగా నిలుస్తుంది. ‘ఒక్కరు కాదు...అందరూ ఒక్కటై పోరాడాలి’ అనే నినాదం నుంచే పుట్టిన ‘నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఉమెన్ లీడర్స్’ ఆర్గనైజేషన్‌కు మంజుల సహ–వ్యవస్థాపకురాలు. ‘ఈ సంస్థ ఏర్పాటుతో నా కల నెరవేరింది’ అంటోంది మంజుల ప్రదీప్. తల్లిని తండ్రి విపరీతంగా హింసించేవాడు మంజుల కుటుంబం ఉత్తర్‌ప్రదేశ్ నుంచి గుజరాత్‌కు వలస వచ్చింది. తన తల్లిని తండ్రి విపరీతంగా హింసించేవాడు. మరోవైపు తాను స్కూల్లో కులవివక్షతను ఎదుర్కొనేది. ఎటు చూసినా బాధలు, అవమానాలు. అందుకే ఆమె ఇప్పుడు బాధితుల గొంతు అయింది. తనలాంటి గొంతులు గట్టిగా వినిపించడానికి వేదిక తయారుకావడంలో ఒకరైంది. మంజుల ప్రదీప్ జీవితంపై ‘బ్రోకెన్ కెన్ హీల్: ది లైఫ్ అండ్ వర్క్ ఆఫ్ మంజుల ప్రదీప్’ అనే పుస్తకం వచ్చింది. భావన సైతం.. ఆమె నెరవేర్చుకున్న కల ‘నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వుమెన్ లీడర్స్’ దేశవ్యాప్తంగా ఎంతోమంది వుమెన్ లీడర్స్‌ను తయారుచేసింది, అలాంటి వారిలో ఒకరు గుజరాత్‌కు చెందిన భావన నర్కర్. 28 సంవత్సరాల భావన ఎంతోమంది బాధితులకు అండగా నిలిచి, మడమ తిప్పకుండా పోరాడటమే కాదు, తనలాగే ఎంతోమంది ఉమెన్ లీడర్స్ తయారుకావడానికి ప్రేరణ అయింది. ‘చట్టం, న్యాయం గురించిన విషయాలు తెలిస్తే ప్రశ్నించే ధైర్యం వస్తుంది, పోరాడే స్ఫూర్తి వస్తుంది. ప్రతి ఒక్కరిలో ఒక న్యాయవాది ఉండాలి...’ అంటూ దేశంలోని మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు ‘బేసిక్ లీగల్ నాలెడ్జి’ కోసం శిక్షణ ఇస్తుంది నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఉమెన్ లీడర్స్. చదవండి: kristin Gray: అమ్మను మించిన అమ్మ -
కరోనా కట్టడిలో మహిళా నేతలు భేష్!
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను ఇప్పటికీ భయకంపితుల్ని చేస్తోన్న ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారిని అరికట్టడంలో ఏ దేశ ప్రభుత్వ నాయకత్వం ప్రశంసనీయమైన ఫలితాలను సాధిస్తోంది ? ఏ దేశ నాయకత్వం రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి కరోనా కట్టడికి చిత్తశుద్ధితో కషి చేస్తోంది? అన్న అంశం...పై గత రెండు, మూడు నెలలుగా మీడియా వర్గాల్లో, ప్రజల్లో చర్చ జరగుతోంది. ఏ దేశాల్లో కరోనా మరణాల సంఖ్య తక్కువగా ఉంది ? అందుకు కారణాలేమిటీ ? ఏ దేశాల్లో లాక్డౌన్లు ముందుగా లేదా సకాలంలో విధించారు? ఏ దేశాల ప్రజలు కరోనా కట్టడికి తమ వంతు సహకారాన్ని అందిస్తున్నారు ? అంశాలతోపాటు ఏ దేశాల్లో జనాభా ఎంత ? జన సాంద్రత ఎంత ? దేశాల మధ్యనున్న జీడీపీ సారూప్యతలు, అక్కడి సామాజిక, ఆర్థిక పరిస్థితుల నేపథ్యం లాంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని నిపుణులు అధ్యయనం చేయగా అనూహ్యంగా, ఆశ్చర్యంగా మగ నాయకత్వమున్న దేశాల్లో కంటే మహిళా నాయకత్వంలోని దేశాల్లోనే ఫలితాలు మెరుగ్గా ఉన్నాయని తేలింది. (మాల్స్ తెరచినప్పుడు కోర్టులు తెరవడం తప్పా?) వాటిల్లో కూడా జెసిండా ఆర్నర్డ్ నాయకత్వంలోని న్యూజిలాండ్, త్సాయి ఇంగ్ వెన్ అధ్యక్షులుగా ఉన్న తైవాన్, ఏంజెలా మెర్కెల్ నాయకత్వంలోని జర్మనీ దేశాలు కరోనా కట్టడిలో ముందుకు వెళుతూ ప్రజల ప్రశంసలు అందుకుంటున్నాయి. ఓ నిర్దిష్ట కాలం వరకు మహిళా నాయకత్వంలోని హాంకాంగ్‌లో 1,056 కరోనా కేసులు నమోదు కాగా, వారిలో నలుగురు మరణించారు. దాదాపు అలాంటి బలమైన ఆర్థిక వ్యవస్థను కలిగిన మగ నాయకత్వంలోని సింగపూర్‌లో 28, 794 కేసులు నమోదుకాగా, 22 మంది మరణించారు. అలాగే మహిళా నాయకత్వంలోని నార్వేలో నిర్దిష్ట కాలానికి 8,257 మంది కరోనా బారిన పడగా, 233 మంది మరణించారు. అదే పురుష నాయకత్వంలోని ఐర్లాండ్‌లో అదే కాలానికి 24,400 కరోనా కేసులు నమోదుకాగా, 1,547 మంది మరణించారు. (తరువాతి మహమ్మారికి సిద్ధంగా ఉండాలి!) అలాగే మహిళా నాయకత్వంలోని తైవాన్‌లో నిర్దిష్ట కాలానికి 440 కేసులు నమోదుకాగా, ఏడుగురు మరణించారు. అదే కాలానికి పురుష నాయకత్వంలోని దక్షిణ కొరియాలో 11,078 కరోనా కేసులు బయట పడగా, 263 మంది మరణించారు. అలాగే ఫ్రాన్స్, బ్రిటన్‌కన్నా జర్మనీ, ఫిలిప్పీన్స్, పాకిస్థాన్ కన్నా మహిళా నాయకత్వంలోని బంగ్లాదేశ్ మెరుగైన ఫలితాలను సాధించాయి. మహిళా నాయకత్వంలోని దేశాల్లోనే ప్రభుత్వ వాణి ప్రజలదాకా వెళుతోంది. ప్రజలు ప్రభుత్వ సూచనలను బాగా పాటిస్తున్నారు. లండన్‌లోని యూనివర్శిటీ ఆఫ్ రీడింగ్‌లో హెడ్ ఆఫ్ స్కూల్‌గా పనిచేస్తోన్న ఎకనామిక్స్ ప్రొఫెసర్ ఉమా ఎస్. కంభంపాటి, యూనివర్శిటీ ఆఫ్ లివర్‌పూల్‌లో ఎకనామిక్స్ అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తోన్న సుప్రియ గరికపాటి సంయుక్తంగా ఈ అధ్యయనం జరిపారు. (పారదర్శకంగా వ్యవహరించాం: జిన్‌పింగ్) బ్రిటన్‌కన్నా లాక్‌డౌన్‌ను ప్రకటించడంలో న్యూజిలాండ్, జర్మనీ దేశాలు ముందున్నాయి. అందుకనే ఆ దేశాలు కరోనా కట్టడి విషయంలో మెరుగైన ఫలితాలు సాధిస్తున్నాయి. నాయకత్వంలో ఉన్న పురుషులతో పోలిస్తే నాయకత్వంలో ఉన్న స్త్రీలు రిస్క్ తీస్కోరన్నది చారిత్రక సత్యంగా చెబుతుంటారు. ఆర్థిక నష్టాలను పణంగా పెట్టి మహిళా నాయకులు రిస్క్ ఎలా తీసుకున్నారన్నది ఇక్కడ ప్రశ్న. ప్రజల ప్రాణాల విషయంలో వారు రిస్క్ తీసుకోదల్చుకోలేదన్నది ఇక్కడ సమాధానం. నాయకత్వంలో ఉన్న పురుషులు, ప్రజల ప్రాణాలకన్నా ఆర్థిక ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తారుకనక, వారు ఆ విషయంలో రిస్క్ తీసుకోలేదు. పైగా నిర్లక్షంగా వ్యవహరించారు. ‘అదా ఓ చిన్న పాటి ఫ్లూ లేదా కొంచెం జలుబు’ అన్న బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బోల్సొనారో, కరోనా వైరస్ వల్ల ఎలాంటి ప్రమాదం లేదని చెప్పడానికి ఓ ఆస్ప్రతికి వెళ్లి ప్రతి రోగితో కరచాలనం చేసిన బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్‌లు కరోనా వైరస్ బారిన పడ్డారు. -
ఇకపై కుటుంబ సభ్యులు పాల్గొంటే క్రిమినల్ కేసులు
సాక్షి, జోగిపేట(అందోల్): అనాదిగా వివక్షతకు గురవుతున్న మహిళలకు భారత రాజ్యాంగం భరోసా కల్పించింది. వివక్షతో అనగదొక్కబడుతున్న అబలలు ఎన్నికల్లో పాల్గొనేలా రిజర్వేషన్ సౌకర్యం కల్పించింది. దీంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు 50 శాతం సీట్లు వారికి కేటాయించారు. అయితే క్షేత్ర స్థాయిలో మాత్రం పురుషుల ఆధిపత్యమే కొనసాగుతుంది. ప్రజాప్రతినిధి మహిళే అయినా పెత్తనం మాత్రం పతులే చేస్తున్నారు. స్థానిక సంస్థల్లో మహిళా ప్రజాప్రతినిధులు ఉన్నచోట వారి భర్తలు, కుటుంబ సభ్యుల పెత్తనం కొనసాగుతుందనే విమర్శలు లేకపోలేదు. కొన్ని చోట్ల అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆజమాయిషీ చెలాయిస్తున్నారు. మహిళా ప్రజాప్రతినిధులను నామమాత్రం చేస్తూ వీరు పెత్తనం కొనసాగిస్తున్నారు. ఉల్లంఘిస్తే చర్యలు... అధికారిక కార్యక్రమాలు, సభలు, సమావేశాల్లో మహిళా ప్రజాప్రతినిధికి బదులు భర్తలు, బంధువులు కూర్చుంటే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు ప్రోత్సహించిన సంబంధిత అధికారులపై పంచాయతీరాజ్ చట్టం –2018 సెక్షన్ 37(5) ప్రకారం చర్యలు తీసుకోనున్నారు. వారిని అధికారిక సమావేశానికి అనుమతిస్తే పంచాయతీ కార్యాదర్శి, మండల పరిషత్ అధికారి, జిల్లా పంచాయతీ అధికారి, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారులు మున్సిపల్ కమిషనర్లపై చర్యలు తీసుకుంటామని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది. పాలనలో పారదర్శకత... పట్టణాలు, గ్రామాల్లో మహిళా ప్రజాప్రతినిధులకు బదులు వారి భర్తలు పాలనలో జోక్యం చేసుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన మహిళలకు పాలనాపరమైన అన్ని విషయాలు తెలియాలి. కానీ కొన్ని చోట్ల వారికి అవకాశం లేకుండా పోతుంది. ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం పక్కాగా అమలు చేస్తే పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెరగనుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అదే విధంగా గ్రామాలు, వార్డుల్లో జరిగే అభివృద్ధి పనుల్లో అవినీతికి ఆస్కారం లేకుండా పకడ్బందీగా, నిర్ణీత సమయంలో పనులు పూర్తవుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయం పట్ల మహిళా లోకం హర్షం వ్యక్తం అవుతుంది. ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో మహిళలు పాలనపై పట్టు సాధిస్తారని పలువురు భావిస్తున్నారు. జిల్లాలో పలు ఘటనలు స్థానిక సంస్థల అభివృద్ధిలో భాగంగా ప్రతినెలా మండల సర్వసభ్య సమావేశాలు కొనసాగుతుంటాయి. అయితే మహిళా ప్రతినిధులకు బదులు వారి భర్తలు, కుటుంబ సభ్యులు, బంధువులు హాజరైన ఘటనలు పలు మండలాల్లో చేసుకుంటున్నాయి. అందోలు మండలంలో జరిగే ప్రతి సర్వసభ్య సమావేశానికి భర్తలు హాజరుకావడమే కాకుండా అధికారులపై ప్రశ్నల వర్షం, నీలదీసిన సందర్భాలు ఉన్నాయి. అధికారులకు ప్రజాప్రతినిధి భర్త అని తెలిసినా వారి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడంపై తోటిప్రజాప్రతినిధులు తప్పుబట్టారు. స్థానిక ఎమ్మెల్యేలు కూడా పలుసార్లు ఎన్నికైన మహిళా ప్రతినిధులే సమావేశాలకు హజరు కావాలని సూచించిన సందర్భాలున్నాయి. మహిళా ప్రతినిధుల్లో మార్పు రావడం ఖాయం భార్యకు బదులుగా భర్తలు, కుటుంబ సభ్యులను ప్రోత్సహించకూడదన్న ప్రభుత్వ ఉత్తర్వుతో మహిళా ప్రతినిధులల్లో మార్పు వస్తుంది. జిల్లా పరిషత్‌లో ఉన్న 13 మంది మహిళా జెడ్పీటీసీలు మాత్రం సొంతంగా వ్యవహరిస్తున్నారు. స్టాండింగ్ కౌన్సిల్ మీటింగ్‌లల్లో కూడా ఈ విషయాన్ని చెబుతున్నాం. గ్రామ స్థాయిలో మహిళా సర్పంచ్‌లు ఉన్న చోట భర్తల పెత్తనం జరుగుతున్నట్లు తెలుస్తుంది. అలా జరగకుండా మహిళా సర్పంచ్‌లే స్వేచ్ఛగా వ్యవహరించేలా చూడాలని అధికారులకు కూడా తెలియజేస్తున్నాం. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రాబోయే రోజుల్లో మహిళా ప్రతినిధుల్లో చాలా మార్పు వచ్చే అవకాశం ఉంది. ఈ ఉత్తర్వులతో మరో నాలుగేళ్ల పాటు మహిళా ప్రతినిధులు స్వేచ్ఛగా వ్యవహరించే పరిస్థితి వస్తుంది. –మంజుశ్రీ, జిల్లా పరిషత్ చైర్పర్సన్, సంగారెడ్డి పకడ్బందీగా అమలు చేస్తాం భార్యలకు బదులుగా భర్తలను ప్రోత్సహించకూడదన్న ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఎన్నికైన ప్రజాప్రతినిధులే ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. తాము కూడా భర్తలను, కుటుంబ సభ్యులను ప్రోత్సహించం. ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా వ్యవహరిస్తాం. మహిళా ప్రతినిధులు సైతం మున్సిపల్ చట్టం పట్ల అవగాహన కల్పించుకోవాల్సిన అవసరం ఉంది. మహిళా ప్రజాప్రతినిధులకు పూర్తి స్వేచ్ఛ కల్పించి, పరిపాలనలో అభివృద్ధిలో వారినే పూర్తిగా భాగస్వాములను చేస్తాం. –కేశురాం, కమిషనర్, జోగిపేట మున్సిపాలిటీ -
‘శ్రీహిత చట్టం’ తీసుకురావాలి
వరంగల్ అర్బన్ : తొమ్మిది నెలల చిన్నారి శ్రీహితపై జరిగిన హత్యాచారం ఘటనను తీవ్రంగా ఖండిస్తూ మహిళాలోకం గళమెత్తింది. ఈ ఘటన నేపథ్యంలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలు నిరసిస్తూ.. వరంగల్ ప్రెస్‌క్లబ్‌లో మహిళా అఖిలపక్షం ఆధ్వర్యంలో గురువారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. మహిళలు, చిన్నారులపై దాడులను అరికట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని ఈ సమావేశంలో మహిళా నేతలు డిమాండ్ చేశారు. శ్రీహిత పేరుతో చట్టం తేవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ.. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ‘శ్రీహిత చట్టం’ తేవాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం తాను ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తానని పేర్కొన్నారు. వరంగల్ ఘటనలో సీసీ ఫుటేజ్ ఆధారాలు ఉన్నా.. ఎందుకు ఇంకా చర్యలు తీసుకోవడం లేదో ప్రభుత్వం చెప్పాలన్నారు. షీ టీంలతో యువతులకు ఎక్కడ న్యాయం జరిగిందో చెప్పాలన్నారు. ఇతర పార్టీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లోకి చేర్చుకునేందుకు సమయం ఉంటుంది. కానీ వరంగల్ వంటి ఘటనపై ప్రభుత్వం ఎందుకు స్పందించదని దుయ్యబట్టారు. వరంగల్ వంటి ఘటన ఎక్కడ జరగకుండా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రవళి డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు ఎక్కడైనా పునరావృతం అయితే నిందితులకు ఉరిశిక్ష వేయాలన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించకుంటే పెద్ద ఎత్తున ర్యాలీ తీసి.. వరంగల్ జిల్లాలో బంద్‌కు పిలునిస్తామన్నారు. ఇటీవల హన్మకొండలో 9నెలల చిన్నారి శ్రీహితపై అత్యంత దారుణంగా అత్యాచారం, హత్య జరిగిన సంగతి తెలిసిందే. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ప్రభుత్వం నిఘా ఏర్పాట్లు చేయాలని.. లేకపోక దశల వారిగా ఉద్యమిస్తామని వక్తలు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో శ్రీహిత తల్లిదండ్రులు, కాంగ్రెస్, బీజేపీతోపాటు పలు ప్రజా సంఘాల మహిళా నేతలు పాల్గున్నారు. -
అక్కాచెల్లెళ్లకు అందళం
-
మహిళా లీడర్లు తగినంత మంది దొరకడం లేదు..
ముంబై: జూనియర్ మేనేజ్మెంట్ స్థాయిలో మహిళల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నప్ప టికీ సారథ్య బాధ్యతలు వహించగలిగే వారిని తగినంత స్థాయిలో దొరకపుచ్చుకోవడం కష్టంగా ఉంటోందని బయోకాన్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా చెప్పారు. రాబోయే ఐదు, పదేళ్లలో ఈ పరిస్థితి మారి లీడర్లుగా మరింత మంది మహిళలను చూడగలమని ఆశిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఇప్పటికే పరిస్థితులు మారుతున్నాయని, కానీ ఈ వేగం ఆశించినంత స్థాయిలో ఉండటం లేదని ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా మజుందార్ షా పేర్కొన్నారు. మహిళలకు సాధికారత కల్పించేందుకు అనేక ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ ఇప్పటికీ పెద్ద హోదాల్లో వారి ప్రాతినిధ్యం తక్కువగానే ఉంటోంది. ముఖ్యంగా కంపెనీల బోర్డుల్లో సంఖ్యాపరంగా మహిళా డైరెక్టర్లు తక్కువగానే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో కిరణ్ మజుందార్ షా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
ఫ్యాషనే వారి నినాదం
రంగు రంగుల దుస్తులు, హొయలు చిందే ఫ్యాషన్లు.. ఇదంతా ఎవరినో ఆకర్షించాలని కాదు, పదిమందిలో గుర్తింపు పొందాలని అంతకంటే కాదు.. తాము ఏర్పాటు చేసుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి, ఆడదంటే సబల అని చాటి చెప్పడానికే అంటున్నారు ఈ మహిళా నేతలు. అమ్మాయి అంటే పింక్ కలర్. కంటికి ఇంపుగా, మనసుకు హాయిగా అచ్చం అమ్మాయిల్లాగే సున్నితంగా ఆ రంగు చెరగని ముద్ర వేస్తుంది. కానీ, ఇప్పుడు పింక్ అంటే ఆహ్లాదం కాదు. గుండె లోతుల్లోంచి పొంగుకొచ్చే భావావేశం, ధిక్కారానికి గుర్తు, చేరుకోవాల్సిన లక్ష్యాలకు ప్రతీక, మహిళల పట్ల ఇప్పటివరకు చేసిన తప్పుల్ని సరిదిద్దుకోవడానికి సంకేతం. అవును అమెరికా కాంగ్రెస్‌కి కొత్తగా ఎన్నికైన మహిళా ప్రతినిధులు ఇదే విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలనుకున్నారు. అమెరికా 116వ కాంగ్రెస్‌లో ప్రమాణస్వీకారమహోత్సవానికి హాజరైనప్పుడు ఒక్కొక్కరు ఒక్కో రీతిలో, వారి సంప్రదాయాలు ఉట్టిపడేలా, సంస్కృతికి ప్రతీకలుగా తయారై వచ్చారు. అదే తమ పోరాట ఆయుధమని స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. అలంకరణ అనేది బాహ్య అందాన్ని పెంపొందించడమే కాదు ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తుందని, సాంస్కృతిక గొప్పదనాన్ని చాటి చెబుతుందని వారంతా ముక్త కంఠంతో నినదిస్తున్నారు. ఫ్యాషన్‌కు పర్యాయపదంలా ఉన్న మహిళలంతా దానినే ఇప్పుడు తమ పోరాటాలకు పంథాగా మార్చుకోవడం విశేషం. రికార్డు స్థాయిలో 102 మంది ఎన్నిక.. అమెరికా ప్రతినిధుల సభకు జరిగిన ఎన్నికల్లో ఈ సారి రికార్డు స్థాయిలో 102 మంది మహిళలు ఎన్నికయ్యారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వెల్లువలా వీరి సంఖ్య పెరిగింది. అయినప్పటికీ సభలో ఇంకా పురుషాధిక్యమే కొనసాగుతోంది. అయినా తాము ఎందులోనూ తీసిపోమని చాటిచెప్పడానికి ప్రమాణస్వీకార ఉత్సవాన్నే వేదికగా చేసుకున్నారు మహిళా ప్రతినిధులు. నాన్సీ పెలోసి ముదురు గులాబీ రంగు గౌనులో మెరిసిపోతూ సభకు వచ్చారు. ‘‘పింక్ అంటే శాంతి, సహనం కాదు. దానికి అర్థం మారింది. ఈ రంగు మాలోని భావావేశాన్ని తట్టిలేపుతుంది. అమ్మాయిల పట్ల చేసిన తప్పులు సరిదిద్దుకోవాలని గట్టిగా నిలదీసి అడుగుతుంది‘అని వ్యాఖ్యానించారు. మహిళా ఓటుకు వందేళ్లు.. ఈ ఏడాది అమెరికా ప్రజా స్వామ్య చరిత్రలోనే అత్యంత కీలకమైనది. మహిళలకు ఓటు హక్కు కల్పించి అమెరికాలో వందేళ్లు అవుతోంది. మహిళలకు ఓటు హక్కు కల్పిస్తూ 1919, జూన్ 4న కాంగ్రెస్‌లో బిల్లును ఆమోదించారు. అందుకే మహిళా ప్రతినిధులందరూ తమ ప్రసంగాల్లో ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. పొడవైన గౌను ధరిం చి వచ్చిన పాలస్తీనా అమెరికన్ రషీదా తాలిబ్ తన తల్లి లాంతర్ వెలుగులో అలాంటి ఎంబ్రాయిడరీ గౌనులు కుడుతూ ఎంత కష్టపడిందో ఉద్విగ్నభరితంగా చెప్పారు. దెబ్రా హాలండ్ రంగురంగుల పూసల గొలుసులు ధరించి వచ్చి తమ ప్రాంతంలో గల్లంతవుతున్న మహిళలు, వారి హత్యల గురించి ప్రస్తావించారు. ఆఫ్రికన్ అమెరికన్ మహిళ బార్బారా లీ మెడ చుట్టూ స్టోల్‌ని వేసుకొని వచ్చి మహిళలు విభిన్న పంథాలో నడుస్తూ నిరంతరం జలపాతంలా క్రియాశీలకంగా ఉండాలన్నా రు. ఇక సోమాలియా నుంచి శరణార్థిగా వచ్చిన ఇల్హాన్ ఒమర్ తెల్లరంగు గౌనులో వచ్చి తమ ప్రాంతంలో శాంతి స్థాపన ధ్యేయ మన్నారు. -
బరిలో నారీమణులు
పాకిస్తాన్లో ఈ నెల 25న జరుగనున్న లోక్‌సభ (నేషనల్ అసెంబ్లీ) ఎన్నికలలో తమ ముద్ర చాటేందుకు మహిళానేతలు గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. సభలోని 342 సీట్లకు గాను 272 జనరల్ సీట్లు కాగా, మిగతా 70 సీట్లు ప్రత్యేకంగా మహిళలకు, మైనారిటీలకు కేటాయించినవి. పరిమితమైన కేటాయింపులే అయినప్పటికీ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో అత్యధికంగా 171 మంది మహిళలు పోటీ చేస్తున్నారు. ఎక్కువ సీట్లిచ్చింది ప్రతిపక్షమే ఎల్లుండి పాకిస్తాన్లో జరుగుతున్న నేషనల్ అసెంబ్లీ ఎన్నికలకు వివిధ రాజకీయపార్టీల నుంచి పోటీచేస్తున్న మహిళలు 105 మంది ఉండగా, స్వతంత్రులుగా 66 మంది బరిలో నిలిచారు. ప్రతిపక్షమైన పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) అత్యధికంగా 19 మంది మహిళలకు టికెట్లు ఇచ్చింది. మితవాద ముత్తహిత మజ్లీస్–ఏ–అమల్ (ఎంఎంఏ) పార్టీ కూడా 14 మంది మహిళలను అభ్యర్థులుగా నిలిపింది. పాకిస్తాన్ తెహరీక్–ఏ–ఇన్సాఫ్, పీఎంఎల్–ఎన్ పార్టీల నుంచి 11 మంది చొప్పున మహిళలు ఎన్నికల్లో నిలుచున్నారు. అల్లాహో అక్బర్ పార్టీ నుంచి ముగ్గురు మహిళలు పోటీలో ఉన్నారు. గతంలో 2013 ఎన్నికల్లో 135 మంది మహిళలు పోటీ చేశారు. వారిలో ఇండిపెండెంట్లు 74, వివిధ రాజకీయపార్టీల నుంచి 61 మంది ఉన్నారు. అంతకుముందు 2008 లో కేవలం 72 మంది మహిళలు మాత్రమే బరిలో ఉండగా, పార్టీల నుంచి 41 మంది, స్వతంత్రులుగా 31 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. పోటీలో ప్రముఖ మహిళలు ప్రస్తుతం జనరల్ సీట్లలో పోటీ చేస్తున్న ప్రముఖుల్లో పీఎంఎల్–ఎన్ నుంచి సుమైరా మాలిక్, తెహ్మినా దౌల్తానా, పీపీపీ నుంచి అస్మ ఆలంగిర్, మెహ్రీన్ అన్వర్ రాజా, సమైనా ఖాలిద్ గుర్ఖి, పీటీఐ నుంచి మాజీ మంత్రి ఫిరదౌస్ ఆషిక్ ఆవాన్, యాస్మిన్ రషీద్ ఉన్నారు. పీటీఐ చీలికగ్రూపు నేత అయేషా గులాలై నాలుగుచోట్ల నుంచి పోటీ చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. గిరిజన జిల్లాల నుంచి అలీ బేగంఖాన్ (ఇండిపెండెంట్) ఒక్కరే మహిళా అభ్యర్థిగా పోటీచేస్తున్నారు. సునీతా పర్మర్ అనే 31 ఏళ్ల హిందూ మహిళ కూడా జనరల్ సీటు నుంచే పోటీలో ఉన్నారు. ప్రొవిన్షియల్ అసెంబ్లీ నుంచి పోటీ చేసిన తొలి హిందూ మహిళగా ఆమె గతంలో చరిత్ర సృష్టించారు. ఖైబర్ ఫఖ్తున్ఖ్వా ప్రాంతం నుంచి ఒక వయోధిక వృద్ధురాలు పాకిస్తాన్ మాజీ క్రికెట్ సార«థి, ప్రధాన రాజకీయపార్టీనేత ఇమ్రాన్‌ఖాన్‌పై పోటీచేస్తోంది. సింథ్ ప్రావిన్స్‌లోని థార్పార్కర్ నుంచి ఓ మహిళా అభ్యర్థి మొదటిసారి ఎన్నికల బరిలో నిలుస్తోంది. పోటీ చేస్తే ప్రయోజనమెంత? అయితే చట్టసభల్లో ఎక్కువమంది మహిళా సభ్యులున్నంత మాత్రాన మహిళల సమస్యల పరిష్కారంలో ఒరిగేదేమీ లేదని అక్కడి మహిళా హక్కుల సంఘాలు పెదవి విరుస్తున్నాయి. గతంలోని అనుభవాలు కూడా ఇందుకు ఏమాత్రం ప్రోత్సాహకరంగా లేవని ఉమెన్ యాక్షన్ ఫోరంకు చెందిన తాహిర అబ్దుల్లా అభిప్రాయపడ్డారు. చాలా మంది మహిళా ప్రతినిధులు ముఖ్యంగా మతసంస్థలకు చెందిన వారు మొత్తం పార్లమెంట్ సమావేశాల్లోనూ ఒక్కసారి కూడా నోరువిప్పిన సందర్భాలు లేవని ఆమె అంటున్నారు. రిజర్వ్ సీట్ల నుంచి గెలుపొందిన వారు, సెనేట్ నుంచి వచ్చినవారే జాతీయ అసెంబ్లీలో లేదా సెనేట్‌లో (ఎగువ సభ) మహిళల సంబంధిత విషయాలు ప్రస్తావిస్తున్నారని రాజకీయ విశ్లేషకుడు ఘాజి సలావుద్దీన్ పేర్కొన్నారు. మరో 18 ఏళ్లు పట్టొచ్చు! ఎన్నికల్లో మహిళల భాగస్వామ్యం పెంచేందుకు ఇటీవల ఈసీపీ అనేక చర్యలు చేపట్టినా ఈ ఎన్నికల్లో దాని ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చనే అంటున్నారు. ఇప్పుడు అమలవుతున్న చర్యలను బట్టి ఓటర్ రిజిస్ట్రేషన్‌లో ప్రస్తుతమున్న స్త్రీ, పురుష తారతమ్యాలు తగ్గేందుకు మరో 18 ఏళ్లు పట్టవచ్చునని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి రాజకీయాల్లో మహిళల పాత్ర పెరిగేలా చేసేందుకు మత, సాంస్కృతిక కట్టుబాట్లు, ఆంక్షలను వారు అధిగమించేలా చేయడంతోపాటు, సంస్కరణల ప్రక్రియ వేగవంతం చేయాల్సిన అవసరముంది. ప్రధాన రాజకీయ పార్టీలు మహిళల ఓటింగ్ రిజిస్ట్రేషన్‌ను పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటే పరిస్థితిలో మార్పు రావొచ్చునంటున్నారు. పాకిస్తాన్లో చట్టసభలతో పాటు అన్ని నిర్ణాయక ప్రక్రియల్లోనూ స్త్రీ–పురుష సమానత్వం కోసం ప్రయత్నంతో పాటు, మహిళలకు తగిన ప్రాతినిధ్యం కల్పిస్తే అక్కడి రాజకీయ, సామాజిక పరిస్థితుల్లో గణనీయమైన మార్పు రావొచ్చునని ఆశిస్తున్నారు. పదేళ్లకు గానీ రాని ఓటు హక్కు పాకిస్తాన్‌కు స్వాతంత్య్రం లభించాక దాదాపు పదేళ్ల తర్వాత 1956లో తొలిసారి మహిళలు ఓటు వేసేందుకు అక్కడి చట్టం అనుమతిచ్చింది. అప్పటి నుంచి మహిళల ప్రాతినిధ్యం పెరుగుతోంది. మహిళలకు 33 శాతం కోటా ఇందుకు దోహదపడింది. అయితే బ్యాలెట్ పేపర్లపై మహిళా అభ్యర్థుల పేర్లున్నా మహిళా ఓటర్లు వారికి ఓట్లు వేస్తారా లేదా అన్నది కూడా స్పష్టంగా చెప్పలేమంటున్నారు. మరోవైపు పాకిస్తాన్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా సమానత్వ సాధనకు మహిళలు ఇంకా మరిన్ని సవాళ్లను ఎదుర్కొంటున్నారు. మొత్తం నమోదైన 9.7 కోట్ల ఓట్లలో పురుషులు 5.45 కోట్లు, మహిళలు 4.24 కోట్లు ఉండగా, దాదాపు లక్ష మంది ట్రాన్స్‌జండర్లు ఉన్నారు. పాకిస్తాన్ ఎన్నికల సంఘం (ఈసీపీ) గణాంకాల ప్రకారం బాగా అభివృద్ధి చెందిన లాహోర్, ఫైసలాబాద్ వంటి ప్రాంతాల్లోనూ పురుష, మహిళా ఓటర్ల సంఖ్యలో (జిల్లాల వారీగా వివరాలు పరిశీలిస్తే) పెద్ద మోతాదులోనే వ్యత్యాసాలున్నట్టు వెల్లడైంది. ఇప్పటికీ ఓటు వేయడం కష్టమే పాకిస్తాన్లో ఓటుహక్కు వినియోగించుకోవాలంటే ముందుగా నేషనల్ ఐడెంటిటీ కార్డు (ఎన్ఐసీ) కోసం రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. వీటì గురించి తెలియక లేదా ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలియక చాలా మంది మహిళలు ఈ కార్డులు పొందలేకపోయారు. ఎన్‌ఐసీల కోసం ఎవరైనా వ్యక్తిగతంగా లేదా ఆన్‌లైన్‌లోనూ విజ్ఞప్తి చేయవచ్చు. అయితే స్త్రీలు స్వేచ్ఛగా బయటకు వచ్చే పరిస్థితులు లేకపోవడంతోపాటు ఇంటర్నెట్ ఉపయోగించేందుకు అనేక మందికి అనుమతి లభించడం లేదు. మహిళలపై మతపరమైన, సాంస్కృతిక వివక్ష కూడా పెద్ద అడ్డంకిగా మారుతోంది. తమ ఇళ్లలోని మహిళలు ఓటు వేసేందుకు అనుమతినివ్వొద్దని పురుషులను హెచ్చరిస్తూ గత ఎన్నికల సందర్భంగా కరపత్రాలు కూడా పంపిణీ అయ్యాయి. దాంతో 2008లో అక్కడి పంజాబ్ ప్రాంతంలోని 31 పోలింగ్ స్టేషన్లలో ఒక్క మహిళా ఓటు కూడా పోల్ కాలేదు. 2015 ఖైబర్ ఫఖ్తున్ఖ్వా స్థానిక ఎన్నికల్లోనూ ఇదే జరిగింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో 800 పోలింగ్ స్టేషన్లలో పదిశాతం కంటే తక్కువగా మహిళలు ఓట్లు వేశారు. 17 జిల్లాల్లో అయిదు శాతం కంటే తక్కువ మహిళా ఓటర్లు మాత్రమే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. – రాహుల్ -
‘మహిళా నేతలంటే ఆయనకు భయం’
సాక్షి,లక్నో: బీజేపీ మహిళా నేతలంటే కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి భయమని ఆ పార్టీ నేత షానవాజ్ హుసేన్ అన్నారు. మహిళలకు బీజేపీ అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని, వారంటే పార్టీకి ఎంతో గౌరవముందని చెప్పారు. యూపీలో బీజేపీకి పెద్దసంఖ్యలో మహిళా ఎమ్మెల్యేలున్నారన్నారు.బీజేపీ, ఆర్ఎస్ఎస్లు మహిళల పట్ల వివక్ష ప్రదర్శిస్తాయన్న రాహుల్ వ్యాఖ్యలు అర్ధరహితమన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్లను అర్ధం చేసుకునేందుకు రాహుల్‌కు కొంత సమయం పడుతుందని, దీనిపై ఆయన పరిశోధన చేయాలని షానవాజ్ హితవు పలికారు. మహిళలపై రాహుల్ వ్యాఖ్యలు దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. బీజేపీ మహిళా నేతలంటే రాహుల్‌కు భయమని, స్మృతీ ఇరానీ పేరు ప్రస్తావనకు వచ్చిన ప్రతిసారి యువనేతకు చెమటలు పడతాయన్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో అమేథి నుంచి రాహుల్‌ను ఆమె ఢీకొన్న విషయం విదితమే.2019 సార్వత్రిక ఎన్నికల్లోనూ బీజేపీ విజయం సాధించి మోదీ తిరిగి ప్రధాని పగ్గాలు చేపడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. -
అందమైన ప్రజా ప్రతినిధులు
ఆలోచన అందంగా ఉంటే మనిషీ అందంగా కనిపిస్తాడు!ఇదిగో వీరంతా అందానికి కాకుండా అందమైన ఆలోచనకు ప్రతినిధులు! ప్రజా ప్రతినిధులు!! ఆకుల చాటున దాగి ఉండే పువ్వుల్లా కాకుండా...సూర్యుడు భూమి మీదే వికసించాడా అన్నంత గొప్పగా కనిపిస్తున్నారు! అందం దేవుడిచ్చాడు.. అర్హత ప్రజలు ఇచ్చారు.. ఇక గౌరవం వీళ్లు నిలబెట్టుకోవాలి! రాజకీయం... ఒకప్పుడు పురుషులకు మాత్రమే తెలిసిన మంత్రం.. వాళ్లకు మాత్రమే చేతనైన తంత్రం.. వాళ్లు మాత్రమే రాణించదగ్గ రంగం.. కానీ ఇప్పుడు... స్త్రీలకూ తెలిసిందా వ్యూహం! వాళ్లూ నెరుపుతున్నారు రాజకీయం... అందుకుంటున్నారు అధికారం! యుక్తి, యోగ్యత, శక్తిసామర్థ్యాలు కలిగిన మహిళానేతలున్న దేశాలే దీనికి నిదర్శనం! అంతెందుకు మొన్నటికిమొన్న మన దగ్గర జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జయలలిత, మమతాబెనర్జీ, మహబూబా ముఫ్తీసహీద్లు ముఖ్యమంత్రులవడం మరో మంచి ఉదాహరణ! అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడుతున్న హిల్లరీ ఇంకో ప్రతీక! ఈ సంగతి అలా ఉంచితే.. సహజంగానే ఆడవాళ్లు అందానికి పర్యాయపదాలు! నటన, మోడలింగ్, క్రీడలు, సైనికబలగాలు వంటి రంగాల్లో అందమైన మహిళలున్నట్టే రాజకీయాల్లో కూడా చతురతతో పాటు అందాన్ని కలబోసుకున్న ఆడవాళ్లు ఉన్నారు. ఓ ఇంటర్నేషనల్ వెబ్ జర్నల్ ఈ విషయంమీద ఓటింగ్ ద్వారా ఓ పోటీ నిర్వహించాలనుకుంది. అనుకున్నదే తడవుగా 2015లో ప్రపంచవ్యాప్తంగా ఓటింగ్ పెట్టింది. అందులో గెలిచి నిలిచిన టాప్ టెన్ బ్యూటిఫుల్ అండ్ గ్లామరస్ పొలిటీషియన్స్ జాబితాను విడుదల చేసింది! ఆ సుందర రాజకీయ మహిళామణులెవరో చూద్దాం... 1. వంజా హెడ్జోవిక్... సెర్బియా విదేశీవ్యవహారాల మంత్రిత్వశాఖలో సలహాదారు. కవ్వించే ఫోటోగ్రాఫ్స్తో కంట్రావర్సీకి కేంద్రంగా మారారు అందాల వంజా హెడ్జోవిక్ . ఏమాటకు ఆ మాటే చెప్పుకోవాల్సివస్తే బ్రెయిన్‌తో బ్యూటీని డామినేట్ చేసి సమర్థవంతురాలిగా పేరుతెచ్చుకున్నారు. పనిపట్ల ఆమెకున్న నిబద్ధత, నిజాయితీలు ఆమెను సెర్బియాలోని సోషలిస్ట్ పార్టీ యూత్ వైస్ ప్రెసిడెంట్‌ను చేశాయి! ఇక ఆమె అందమేమో ... వెబ్‌జర్నల్ నిర్వహించిన బ్యూటిఫుల్ అండ్ గ్లామరస్ పాలిటీషియన్స్ ఇన్ ద వరల్డ్ కాంటెస్ట్‌లో వంజా హెడ్జోవిక్ను మొదటి స్థానంలో నిలిపింది. 2. మారా కార్ఫెగ్నా ఇటాలియన్ రాజకీయ నేత. రాజకీయాల్లోకి రాకముందు ఆమె ప్రసిద్ధ మోడల్. టెలివిజన్ సిరీస్‌లో కూడా నటించారు. 2004లో రాజకీయారంగప్రవేశం చేశారు. బెర్లుస్కోని ఫోర్త్ కాబినెట్లో ఈక్వల్ ఆపర్చునిటీ శాఖా మంత్రిగానూ ఉన్నారు. యూరప్మీడియా అంతా ఆమెను ది మోస్ట్ బ్యూటిఫుల్ ఇటాలియన్ మినిస్టర్‌గా అభివర్ణించింది. ఓ యూరప్ మ్యాగజైన్ అయితే మారాను టాప్ హాటెస్ట్ ఫీమేల్ పొలిటీషియన్స్‌గా పేర్కొంది. అలాగే ఈ వెబ్ జర్నల్ నిర్వహించిన మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ గ్లామరస్ పొలిటీషియన్స్ ఇన్ ద వరల్డ్ కాంటెస్ట్‌లో మారా కార్ఫెగ్నా రెండోస్థానం పొందారు. 3. కష్మాలా తారీఖ్ నలభైమూడేళ్ల ఈ పాకిస్తానీ నేత పాకిస్తాన్ ముస్లిం లీగ్ పార్టీ ై‘ఖెద్ ఎ అజమ్’ సభ్యురాలు. ఆ పార్టీ నుంచే నేషనల్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. మానవ హక్కుల కార్యకర్త కూడా అయిన కష్మాలా తారీఖ్ పాకిస్తాన్లో పరువు హత్యలకు వ్యతిరేకంగా గళం వినిపించారు. 4. డింపుల్ యాదవ్ మనందరికీ బాగా పరిచయం ఉన్న మహిళ. అవును.. అఖిలేశ్ యాదవ్ భార్య, ములాయంసింగ్ యాదవ్ కోడలు! సమాజ్‌వాదీ పార్టీ నేత. 2012లో ఉత్తరప్రదేశ్‌లోని కనౌజ్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నేతగానే కాదు ఫంక్షన్లు, పార్టీలకు ప్రత్యేక అతిథిగా ఆహ్వానం అందుకుంటూ సెలబ్రెటీగా కూడా పాపులర్ అయ్యారు ఆమె. ప్రస్తుతం మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ గ్లామరస్ ఫీమేల్ పొలిటీషియన్స్ ఇన్ ద వరల్డ్‌లో నాలుగో స్థానంలో ఉన్నారు. 5. ఇవా కైలి పాన్హెల్లెనిక్ సోషలిస్ట్ మూవ్మెంట్ నుంచి యురోపియన్పార్లమెంట్ కు ఎన్నికయ్యారు. 37 ఏళ్ల ఇవాకైలీ విద్యార్థి రాజకీయాల్లో కూడా చురుకుగా ఉండేవారు. స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ స్టూడెంట్స్ అసోసియేషన్‌కి ప్రెసిడెంట్‌గా పనిచేశారు. 2004లో ప్రధానస్రవంతి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. నేషనల్ డిఫెన్స్ అండ్ ఫారిన్ అఫైర్స్ కమిటీలో శాశ్వత సభ్యురాలిగా కొనసాగుతున్నారు. 2014లో జరిగిన యూరోపియన్ ఎన్నికల్లో నాటో పార్లమెంటరీ అసెంబ్లీలోని డెలిగేషన్స్ ఫర్ రిలేషన్స్కి ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు ఇవాై కెలి. 6. సెత్రిడా జియాజియా 49 ఏళ్ల ఈ లెబనీస్ నేత 1994లో రాజకీయాల్లోకి వచ్చారు. లెబనాన్‌లోకి సిరియా శక్తులు దూసుకువచ్చినప్పుడు ఆ శక్తులు వెనక్కివెళ్లేలా పోరాడారు సెత్రిడా జియాజియా. లెబనీస్ ఫోర్సెస్ పార్టీని నిలబెట్టి తిరిగి అధికారం పొందేలా చేశారు. లెబనీస్ మెరోనైట్ లీగ్ సభ్యురాలిగా రహదారి భద్రత మీద ప్రత్యేక దృష్టిపెట్టి విజయం సాధించారు. అంతకుమించి సామాజిక సేవనూ అందించారు. ఈ సాహస వనిత మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ గ్లామరస్ ఫిమేల్ పొలిటీషియన్స్ ఇన్ ద వరల్డ్‌లో ఆరో స్థానాన్ని సాధించారు. 7. అలినా కబీవా ఈ రష్యన్ నేత పూర్వాశ్రమంలో రిథమిక్ జిమ్నాస్ట్. 33 ఏళ్ల అలినా క్రీడల నుంచి రిటైరయ్యాక రాజకీయాల్లోకి వచ్చారు. యునెటైడ్ రష్యా పార్టీ తరపున 2007లో పబ్లిక్ చాంబర్ ఆఫ్ రష్యా పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. 2014 వరకు కొనసాగారు. 2014లో రష్యాలోనే అతిపెద్ద మీడియా కార్పోరేషన్ అయిన నేషనల్ మీడియా గ్రూప్‌కి బోర్డ్ ఆఫ్ డెరైక్టర్‌గా నియమితులయ్యారు. టాప్ మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ గ్లామరస్ ఫిమేల్ పొలిటీషియన్స్ జాబితాలో ఏడో స్థానంలో నిలిచారు. 8.నినా సైఖలీ మొరాదీ ఇరానియన్ రాజకీయ నేత. ఇరానియన్ కౌన్సిల్ సభ్యురాలూ అయిన నినా ఆర్కిటెక్ట్ కూడా. అయితే ఆమె అందమే అమెకు శత్రువైంది. నినా అందానికి అందకూ ఆకర్షితులవుతుండడం, కౌన్సిల్లో అందరి కళ్లూ ఆమె మీదకే మళ్లుతుండడం వల్ల కౌన్సిల్ కార్యకలాపాలకు అంతరాయం కలుగుతోందని కౌన్సిల్ ఆమె సభ్యత్వాన్నే రద్దు చేసింది. అలాంటి ఈ అద్భుత సౌందర్యరాశి టాప్ మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ గ్లామరస్ పొలిటీషియన్స్‌లో స్థానం సంపాదించడంలో ఆశ్చర్యం లేదు. 9. ఆంజెలా జెరెకోవ్ గ్రీక్ వనిత. ఈమె కూడా రాజకీయాల్లో రాణిస్తూనే ఆర్కిటెక్ట్‌గానూ కొనసాగుతున్నారు. సమరస్ ప్రభుత్వంలో క్రీడలు, సాంస్కృతిక శాఖా డిప్యుటీ మంత్రి. పూర్వశ్రమంలో సినీ నటి. ది గర్ల్ ఆఫ్ మానిలో నటించారు. 2009లో రాజకీయరంగంలోకి వచ్చారు. రావడం రావడంతోనే టూరిజం శాఖా బాధ్యతలను తీసుకున్నారు. చూడగానే ఆకట్టుకునే ఈ గ్రీకు నేత ది టాప్ మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ గ్లామరస్ పొలిటీషియన్స్ జాబితాలో తొమ్మిదో ర్యాంక్‌లో ఉన్నారు. 10. ఓర్లీ లెవీ ఇజ్రాయేలీ విదేశీవ్యవహారాల మాజీ మంత్రి డేవిడ్ లెవీ ముద్దుల బిడ్డ. తండ్రిబాటలోనే నడిచి నేతగా ఎదిగారు ఓర్లీ. రాజకీయాల్లో చేరిన కొత్తలోనే క్నెస్సెట్ సభ్యురాలైంది. అంతేకాదు డిప్యుటీ స్పీకర్‌గానూ ఎన్నికయ్యారు. తలతిప్పుకోనివ్వని సౌందర్యంతో ఓర్లీ లెవీ ది టాప్ మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ గ్లామరస్ పొలిటీషియన్స్‌లో పదో స్థానంలో నిలిచారు. -
కానిస్టేబుల్‌ను పట్టుకొచ్చి పెళ్లి జరిపించారు
హైదరాబాద్: ప్రేమిస్తున్నానని వెంటపడి మూడు సంవత్సరాలు కలిసి తిరిగి పెళ్లి చేసుకోకుండా తప్పించుకు తిరుగుతున్న కానిస్టేబుల్ వివాహం హైదరాబాద్‌లో జరిగింది. భారతీయ మహిళా సమాఖ్య నాయకులు, పోలీసుల నేతృత్వంలో ఆదివారం కానిస్టేబుల్‌ను ఓ ఇంటి వాడిని చేశారు. నల్లగొండ జిల్లా బొల్లెనపల్లికి చెందిన నాగార్జున గోషామహల్ పోలీస్‌స్టేషన్‌లో ఏఆర్ కానిస్టేబుల్‌గా పనిచేస్తూ హస్తినాపురంలో నివాసముంటున్నాడు. అదే గ్రామానికి చెందిన పుష్పలత హస్తినాపురంలో నివాసముంటోంది. పుష్పలత బీ.టెక్ చదివే సమయంలో నాగార్జునతో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఇద్దరూ కొంత కాలం ప్రేమించుకున్న తరువాత వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కాగా, పుష్పలత పెళ్లి చేసుకోవాలని ఇటీవల కోరగా నాగార్జున తప్పించుకుని తిరుగుతున్నాడు. దీంతో పుష్పలత ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. భారతీయ మహిళా సమాఖ్య నాయకుల ఆధ్వర్యంలో నాగార్జునకు కౌన్సిలింగ్ నిర్వహించి ఎల్బీనగర్లోని ఓ ఆలయంలో వివాహం జరిపించారు. -
రంగంలోకి దిగిన నగ్మా..
♦ అంతా ఒక్కటే గ్రూపులకు నోచాన్స్ ♦ రాహుల్ ఆదేశాలకు కట్టుబడాల్సిందే ♦ మహిళా నేతలకు నగ్మా హెచ్చరిక ♦ వివాదాలు చక్కదిద్దేందుకు రంగంలోకి సాక్షి, చెన్నై: మహిళా కాంగ్రెస్‌లో గ్రూపులకు ఆస్కారం లేదు...అంతా ఒక్కటే...రాహుల్ ఆదేశాలకు కట్టుబడాల్సిందే.. అని మహిళా నేతలకు ఆ విభాగం జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ నగ్మా హెచ్చరికలు జారీ చేశారు. మహిళా కాంగ్రెస్‌లో నెలకొన్న వివాదాల్ని చక్కదిద్దేందుకు ఆమె రంగంలోకి దిగారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలోవలే, మహిళా విభాగంలోనూ గ్రూపు రాజకీయాలు బయలు దేరిన విషయం తెలిసిందే. విజయధరణి అధ్యక్ష పగ్గాలు చేపట్టినానంతరం ఈ రాజకీయం మరింతగా వేడెక్కాయి. ఇక, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు విజయధరణి ఏకంగా టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ను ఢీకొట్టడంతో వివాదం మరింతగా ముదిరింది. ఈ వ్యవహారాలు ఢిల్లీకి చేరి ఉండడంతో పరిస్థితుల్ని చక్కదిద్దేందుకు మహిళా విభాగం రాష్ర్ట ఇన్చార్జ్ , జాతీయ ప్రధాన కార్యదర్శి నగ్మా రంగంలోకి దిగారు. మహిళా నాయకుల్ని ఒకే వేదిక మీదకు తీసుకొచ్చి, తామంతా ఒక్కటే అని చాటేందుకు తీవ్ర కుస్తీల్లో పడ్డారు. ఇందులో భాగంగా మంగళవారం ఢిల్లీ నుంచి చెన్నైకు వచ్చిన నగ్మా మహిళా నేతలతో సమాలోచనలో పడ్డారు. మహిళా విభాగంలో సాగుతున్న గ్రూపుల్ని కట్టడి చేయడంతో పాటుగా, టీఎన్‌సీసీ వర్గాలతో ఏర్పడిన వివాదాన్ని చక్కబెట్టేందుకు కసరత్తుల్లో పడ్డారు. ఇక, మహిళా కాంగ్రెస్ నేతృత్వంలో పేదలకు సంక్రాంతి కానుకల పంపిణీ కార్యక్రమానికి హాజరైన నగ్మా విలేకరులతో మాట్లాడుతూ, గ్రూపులకు ఆస్కారం లేదని, అంతా ఒక్కటే...ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ ఆదేశాలకు కట్టుబడాల్సిందేనని మహిళా నేతలకు హెచ్చరికలు జారీ చేశారు. అంతా ఒక్కటే : మహిళా కాంగ్రెస్‌లో గ్రూపులకు చోటు లేదని, అందరూ ఒకే వేదికగా పని చేయాల్సిందేని హెచ్చరించారు. రాహుల్ ఆదేశాలతో విజయధరణి నియమితులయ్యారన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తెరగాలని హితవు పలికారు. ఎవరికి వారు ఇష్టారాజ్యంగా వ్యవహరించినా, మహిళా విభాగంలో గందరగోళాన్ని సృష్టించే ప్రయత్నం చేసినా రాహుల్ దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. చిన్న చిన్న సమస్యలు, వివాదాలు సహజం అని, అయితే, దానిని మరింత పెద్దది చేసుకోకుండా, సామరస్య పూర్వకంగా పరిష్కరించుకుని, అందరూ కలసి కట్టుగా ముందుకు నడవాలని పిలుపునిచ్చారు. టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్‌తో విజయధరణి వివాదం గురించి మీడియా ప్రశ్నించగా అందుకే తాను వచ్చానని, అన్ని సర్దుకుంటాయని వ్యాఖ్యానించారు. టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్‌కు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని, ఆయనతో కలసి మహిళా నాయకులు ముందుకు సాగుతారని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. రాష్ర్టంలో శాంతి భద్రతలు క్షీణించాయని, వరద బాధితుల్ని ఆదుకోవడంలో అన్నాడీఎంకే సర్కారు పూర్తిగా విఫలం చెందిందంటూ మరో ప్రశ్నకు మండి పడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయ లోపంతో వరదల బారిన ప్రజలు పడ్డారని, అయితే, వారిని ఆదుకోవడంలోనూ నిర్లక్ష్యం, ఏక పక్షం కొట్టొచ్చినట్టు కన్పిస్తున్నదని ధ్వజమెత్తారు. రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్యే విజయధరణి, జాతీయ కార్యదర్శి హసీనా సయ్యద్ పాల్గొన్నారు. -
టీడీపీ, టీఆర్ఎస్ మహిళా కార్యకర్తల తోపులాట
హైదరాబాద్: ఇద్దరు నేతల మధ్య పరస్పరం చేసుకున్న ఘాటు వ్యాఖ్యలు ఇరు పార్టీ కార్యకర్తల మధ్య ఉద్రిక్తతకు దారి తీసింది. మా నేతను అంటారా అంటే మరి మా నేతను అంటారా అంటూ వారు ఆందోళనకు దిగుతున్నారు. మహాసంకల్ప సభలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విరుచుపడిన విషయం తెలిసిందే. అలాగే, సీఎం చంద్రబాబును కూడా కేసీఆర్ ఘాటుగా విమర్శించారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ మహిళా కార్యకర్తలు మంగళవారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ముందు ఆందోళనకు దిగారు. చంద్రబాబునాయుడికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడే ఉన్న టీడీపీ మహిళా కార్యకర్తలు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకొని తోపులాట నెలకొంది. -
వైఎస్ షర్మిలకు అండగా ఉంటాం
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వైఎస్ షర్మిలకు అండగా ఉంటామని ఆ పార్టీ మహిళా నాయకులు, ఎంపీలు చెప్పారు. సోషల్ మీడియాలో షర్మిలను కించపరుస్తూ దుష్ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం వైఎస్ఆర్ సీపీ ఎంపీలు బుట్టా రేణుక, కొత్తపల్లి గీత మాట్లాడారు. మహిళలను ప్రోత్సహించాలే కానీ వారి గౌరవ మర్యాదలకు భంగం కలిగించేలా అసభ్యంగా చిత్రీకరించడం దారుణమని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో మహిళల రాణించకుండా చేయడానికి కొన్ని వెబ్ సైట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, ప్రజా సమస్యల కోసం సుదీర్ఘ పాదయాత్ర చేసిన షర్మిలపై అసత్య ప్రచారం చేయడం తగదని అరకు ఎంపీ కొత్తపల్లి గీత అన్నారు. ఇలాంటి సంఘటనల్ని ప్రతి ఒక్కరూ ఖండించాలని, మహిళలకు అండగా ఉండాలని చెప్పారు. అస్యత ప్రచారం చేస్తున్న వ్యక్తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. పార్టీ నేతలు వై.వి.సుబ్బారెడ్డి, సోమయాజులు సీపీని కలిసి ఫిర్యాదు పత్రాన్ని అందచేశారు. -
'షర్మిలకు అండగా నిలబడి పోరాడతాం'
-
మోడీ కేబినెట్లో మహిళా మంత్రులు
స్మృతి ఇరానీ: టీవీ నటిగా మంచి పేరు తెచ్చుకున్న ఈమె బీజేపీ తరఫున అమేథీలో రాహుల్‌గాంధీపై పోటీ చేసి ఓడిపోయారు. పరాజయం పాలైనా రాహుల్ మెజారిటీని గణనీయంగా తగ్గించి కమలనాథుల చేత శభాష్ అనిపించుకున్నారు. ఢిల్లీలో జన్మించిన స్మృతి.. విద్యాభ్యాసం కూడా అక్కడే పూర్తిచేశారు. తర్వాత ముంబైకి మారారు. ‘సాస్ భీ కభీ బహూ థీ’ సీరియల్లో నటించి మంచి గుర్తింపు పొందారు. బీజేపీ మహిళా విభాగానికి జాతీయ అధ్యక్షురాలిగా పనిచేశారు. వ్యాపారవేత్త జుబిన్ ఇరానీని పెళ్లాడిన ఈమెకు ఒక కొడుకు, ఒక కూతురు. 2004 ఎన్నికల్లో ఢిల్లీలోని చాందినీ చౌక్ నుంచి బీజేపీ తరఫున బరిలో నిలిచి కాంగ్రెస్ నేత కపిల్ సిబల్పై ఓడిపోయారు. నజ్మా హెప్తుల్లా: మోడీ కేబినెట్లో ఏకైక ముస్లిం నాయకురాలు. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ కుటుంబానికి చెందిన హెప్తుల్లా.. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జన్మించారు. 2004లో కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. అంతకుముందు కాంగ్రెస్ తరఫున రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. 1986-2012 మధ్య రాజ్యసభకు ఏకంగా ఐదుసార్లు ఎంపికయ్యారు. 1985లో ఏడాదిపాటు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా పనిచేశారు. మేనకా గాంధీ: జంతు హక్కుల కార్యకర్త మేనకా గాంధీకి మరోమారు కేంద్ర మంత్రివర్గంలో చోటుదక్కింది. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వంలో గాంధీ కుటుంబానికి చెందిన ఏకైక సభ్యురాలు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ చిన్న కోడలు, ఏడు సార్లు ఎంపీ అరుున మేనకా సంజయ్ గాంధీ గత ఎన్డీయే ప్రభుత్వ (వాజ్‌పేరుు) హయూంలో దేశంలోనే మొట్టమొదటి జంతు సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. ఉమాభారతి: బీజేపీలో ఉన్నా, మరోచోట ఉన్నా కరడుగట్టిన హిందూవాదిగా, ఫైర్‌బ్రాండ్ నేతగానే వార్తల్లో ఉంటారు. యూభై ఐదేళ్ల ఉమాభారతి ఎన్డీయే ప్రభుత్వంలో మంత్రిగా చేరడం ఇది రెండోసారి. ‘సాధ్వి’గా ప్రాచుర్యం పొందిన ఈమె మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు.1959 మే 3న మధ్యప్రదేశ్‌లోని తికంఘర్‌లో జన్మించారు. -
మహిళా మణులకు.పరీక్షే...
ఖమ్మం : ఈసారి సార్వత్రిక బరిలో నిలిచిన మహిళా నేతలు తాము పోటీ చేస్తున్న స్థానాల్లో ఓటర్ల మనసు గెలవడానికి నానాపాట్లు పడుతున్నారు. సొంత పార్టీ నుంచి మొండిచేయి ఎదురుకావడం, పార్టీలో వర్గపోరు వంటి సమస్యల మధ్య జిల్లాలో ప్రధాన పార్టీల తరఫున బరిలో నిలిచిన మహిళా అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వైరా, భధ్రాచలం, ఇల్లెందు, పాలేరు నియోజకవర్గాల్లో మహిళలు అసెంబ్లీ సంగ్రామంలో సై అంటున్నారు. వీరంతా ఓటర్లను ప్రసన్నం చేసుకోవడంతో పాటు సొంత పార్టీలో చిక్కులను చక్కదిద్దుకునేందుకు ఎదురీదాల్సి వస్తోంది. వైరానుంచి గతంలో సీపీఐ తరఫున విజయం సాధిం చిన బాణోతు చంద్రావతికి ఈసారి టికెట్ విషయంలో ఆ పార్టీ మొండిచేయి చూపడం.. ఆమె టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడం, వెంటనే ఆ పార్టీ టికెట్ దక్కించుకొని ఎన్నికల రం గంలో నిలవడం చకాచకా జరిగిపోయాయి. ఇక టీడీపీలో జిల్లాలోని ఓ ప్రధాన నేత వర్గంలో కీలకంగా ఉన్న స్వర్ణకుమారి ఆయన పలుకుబడితో పాలేరు టికెట్ సాధించారు. భద్రాచలం బరి నుంచి మళ్లీ కాంగ్రెస్ పార్టీ తరఫున కుంజా సత్యవతి పోటీలో ఉన్నారు. ఆమెపై టీడీపీ నుంచి ఫణీశ్వరమ్మ పోటీ చేస్తున్నారు. ఇల్లెందులో అయితే హఠాత్తుగా బాణోతు హరి ప్రియ అనే అభ్యర్థి టికెట్ దక్కించుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. చంద్రావతికి పెద్ద పరీక్ష... అతిపిన్న వయసులో ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టిన చంద్రావతికి ఈసారి ఎన్నికలు పెద్ద పరీక్షగా మారాయి. సీపీఐ టికెట్ దక్కకపోవడంతో చివరకు ఆమె కారెక్కారు. టీఆర్ఎస్ నుంచి బరిలో ఉన్న ఆమె సీపీఐని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. తనను ఆదరించని పార్టీకి తన సత్తా ఏంటో చూపాలన్న ఉద్దేశంతో ఆమె మళ్లీ వైరా నుంచే పోటీలో ఉన్నారు. అయితే స్థానికంగా టీఆర్ఎస్ కేడర్ బలంగా లేకపోవడం, సీపీఐ నుంచి బలమైన నాయకులు ఎవరూ ఆమె వెంట వెళ్లకపోవడం ప్రతికూలాంశాలని పరిశీలకులు అంటున్నారు. ఒకడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కు వేస్తూ ఆమె ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వైరా సీటుపై ఆమె ఆశలు పెట్టుకున్నా.. తన సొంత ఇమేజ్‌తోనే గట్టెక్కాల్సి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సత్యవతి, ఫణీశ్వరమ్మ భవితవ్యం ఏమిటో..? భద్రాచలం సీటుపై కాంగ్రెస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే కుంజా సత్యవతి, టీడీపీ తరఫున ఫణీశ్వరమ్మ గురి పెట్టారు. అయితే ఇరువురు అభ్యర్థులకు ఇంటిపోరు తలకుమించిన భారంగా మారింది. సత్యవతి అభ్యర్థిత్వాన్ని సొంత పార్టీలోని ఎంపీ బలరాం నాయక్ వర్గం నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎంపీ వర్గీయులకు, ఆమె అనుచరులకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇటీవల ఇరువురు నేతల ముందే వారి అనుచరులు ఘర్షణ పడడం.. ఎంపీ తీరును ఎమ్మెల్యే.. ఎమ్మెల్యే తీరును ఎంపీ వ్యతిరేకించడంతో వర్గపోరు బహిర్గతమైంది. దీంతో పైకి కలిసిఉన్నట్లుగా వ్యవహరిస్తున్నా.. అంతర్గతంగా మాత్రం ఎంపీ అనుచరులు ఆమె ఓటమే ధ్యేయంగా సర్వశక్తులొడ్డుతున్నట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో ఆమెకు ఈసారి కష్టకాలమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే సత్యవతి మాత్రం విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఫణీశ్వరమ్మది కూడా ఇదే పరిస్థితి. ఈమె నామా వర్గం నేతగా ముద్ర పడడంతో తుమ్మల వర్గం ఆగ్రహంతో ఉంది. పాలేరు, భద్రాచలంలో ఇద్దరు మహిళా నేతలు నామా వర్గానికే చెందిన వారు కావడంతో ఈమెను ఎలాగైనా ఓడించాలని తుమ్మల శిబిరం ఎత్తుకుపైఎత్తులు వేస్తోంది. 2004లో భద్రాచలం ఎంపీగా ఆమె పోటీ చేసి ఓటమి పాలయిన ఫణీశ్వరమ్మ ఇప్పుడు అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు మళ్లీ బరిలోకి దిగినా.. నామా వర్గం నేతగా ముద్రపడడం ఆశనిపాతమైంది. ఇలా భద్రాచలం సీటుపై ప్రధాన పార్టీల తరఫున మహిళా నేతలు బరిలో ఉన్నా.. వర్గపోరుతో స్థానిక నాయకత్వం మొహం చాటేస్తుండడంతో ప్రచారమేమోగాని ఇంటిపోరును చక్కదిద్దే పనిలోనే వారు నిమగ్నమయ్యారు. స్వర్ణక్క కల నెరవేరేనా..? పాలేరు సీటు తనకే కావాలని పట్టుబట్టి.. తన వర్గానికి నేతృత్వం వహిస్తున్న నేతతో లాబీయింగ్ చేయించి.. ఎట్టకేలకు సీటు దక్కించుకున్న మద్దినేని స్వర్ణకుమారికి వర్గపోరు పెద్ద తలనొప్పిగా మారింది. ఈమె కూడా నామా వర్గం నేత కావడంతో ఇక్కడ ఉన్న తుమ్మల వర్గం స్వర్ణకుమారి అంటేనే గుర్రుగా ఉంది. అంతేకాకుండా నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న ఆమె.. మండల పార్టీ బాధ్యతలు ఒకే సామాజిక వర్గానికి ఇవ్వడంతో ఇతర వర్గాల నేత లు రాజీనామా బాట పడుతున్నారు. అంతేకాకుండా ఎమ్మెల్సీ బాలసాని టికెట్ ఎపిసోడ్ రచ్చకెక్కడంతో బీసీ నేతలు కూడా ఆమె అభ్యర్థిత్వం పట్ల గుర్రుగానే ఉన్నారు. నామా లాబీయింగ్‌తో టికెట్ దక్కించుకున్నా .. తుమ్మల అనుచర వర్గం ఇప్పటికీ ఆమెకు దూరంగానే ఉంటోంది. ఈ పరిణామాలతో ఆమె కలనెరవేరుతుందో..? లేదో..?ననే చర్చ పార్టీలో జరుగుతోంది. హరిప్రియకూ అష్టకష్టాలే... ఇల్లెందు బరిలో టీడీపీ అభ్యర్థిగా ఉన్న హరిప్రియ రాజకీయాలకు కొత్తయినప్పటికీ.. సిటింగ్ ఎమ్మెల్యే ఊకె అబ్బయ్యను కాదని ఆమెకు బీ ఫాం ఇచ్చారు. మొన్నటివరకు హైదరాబాద్‌కు-టేకులపల్లికి అప్అండ్ డౌన్ చేసిన హరిప్రియకు నియోజకవర్గ ప్రజలతో పెద్దగా సంబంధాల్లేవు. టీడీపీ టికెట్ ఆశించి భంగపడ్డ అబ్బయ్య టీఆర్ఎస్లో చేరారు. ఆయనతో పాటు కొందరు టీడీపీ నేతలు కూడా పార్టీని వీడి వెళ్లారు. వీరంతా ఆమెకు నష్టం చేసే అవకాశం ఉంది. మరోవైపు జిల్లా నేతలు ఆమె ప్రచారం వైపు కన్నెత్తి కూడా చూడకపోవడంతో ఉన్న కొంతమంది కార్యకర్తలు కూడా నైరాశ్యంలో పడ్డారు. పార్టీలోని స్థానిక నేతలు ఇతర పార్టీల బాట పట్టడంతో.. ఇల్లెందు ఓటర్లు ఆమెకు ఊహించని రీతిలో ఝలక్ ఇస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
సీఎం పీఠంపై ఆమె... !
స్వతంత్ర భారత చరిత్రలో మహిళా ముఖ్యమంత్రులు 14 మందే స్వతంత్ర భారతావనిలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన మహిళా నేతలు కేవలం 14 మందే! ప్రస్తుతం ఉన్న 28 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలలో (ఢిల్లీ, పుదుచ్చేరి) కేవలం 3 రాష్ట్రాల్లోనే మహిళలు రాజ్యమేలుతున్నారు. ఇప్పటివరకు పనిచేసిన మహిళా సీఎంల వివరాలివీ.. - ఎలక్షన్ సెల్ ఉక్కు మహిళ.. నందినీ శతపథి ఒడిశాలోని కటక్‌లో 1931లో జన్మించిన నందిని ఎంఏ చదివారు. విద్యార్థి నేతగా కమ్యూనిస్టు పార్టీలో చురుగ్గా పనిచేశారు. తర్వాత కాంగ్రెస్‌లో చేరి 1962లో 31 ఏళ్ల వయసులోనే రాజ్య సభకు ఎన్నికయ్యారు. 1972లో ఒడిశా సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. ఏడాదిపాటు రాష్ర్టపతి పాలన తర్వాత 1974లో మళ్లీ సీఎం అయ్యారు. హిందుత్వ అజెండా.. ఉమ రాజకీయాల్లో ఫైర్‌బ్రాండ్‌గా పేరు పొందిన ఉమాభారతి బీజేపీ తరఫున 2003 డిసెంబరు నుంచి, 2004 ఆగస్టు వరకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1989 నుంచి 1999 వరకు వరుసగా లోక్‌సభకు ఎన్నిక య్యారు. అటల్‌బిహరీ వాజ్‌పేయి హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. 2003 మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని విజయపథంలో నడిపించారు. మహారాష్ట్ర మద్దతుదారు.. శశికళ కకోద్కర్ బహుజనుల పార్టీగా పేరొందిన మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ తరఫున 1973 నుంచి 1979 వరకు గోవా సీఎంగా పనిచేశారు. ఆమె తండ్రి దయానంద్ బండోద్కర్ కేంద్రపాలిత ప్రాంతమైన గోవా ప్రథమ ముఖ్య మంత్రి. నాడు గోవాను మహారాష్ట్రలో కలపాలని శశికళ తీవ్రంగా ప్రయత్నించారు. కానీ ఆ యత్నాలేవీ నెరవేరలేదు. సీఎంగా రికార్డ్.. షీలా దీక్షిత్ 1938లో పంజాబ్‌లో జన్మిం చిన షీలా ఢిల్లీ యూని వర్సిటీలో ఎంఏ(చరిత్ర) చదివారు. 1984లో కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1986-89 మధ్య కేంద్ర మంత్రిగా పని చేశారు. 1998, 2003, 2008 ఎన్నికల్లో పార్టీని విజయపథంలో నడిపి 1998 డిసెంబర్ నుంచి 2013 డిసెంబర్ వరకు అప్రతిహతంగా ఢిల్లీ సీఎంగా పనిచేశారు. 2013 ఎన్నికల్లో అనూహ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపకుడు అరవింద్ కేజ్రీవాల్ చేతిలో ఓడిపోయారు. మహరాణి.. వసుంధర రాజే గ్వాలియర్ రాజవంశానికి చెందిన వసుంధర రాజే 1953లో జన్మించారు. రాజస్థాన్‌లోని ధోల్పూర్ సంస్థానాధీశుల కుటుంబానికి చెందిన హేమంత్సింగ్ను 1972లో వివాహం చేసుకు న్నారు. బీజేపీ తరఫున రాజస్థాన్ అసెంబ్లీకి 1985లోనే ఎన్నికయ్యారు. 1989 నుంచి వరుసగా లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆమె కుమారుడు దుష్యంత్‌సింగ్ ప్రస్తుత లోక్‌సభ సభ్యుడు. బహుజనుల ఆశాదీపం.. మాయావతి మొదటి దళిత సీఎం. 1995లో జూన్ నుంచి అక్టోబర్ వరకు, 1997లో మార్చి నుంచి సెప్టెంబర్ వరకు, 2002 మే నుంచి 2003 ఆగస్ట్ వరకు, 2007 నుంచి 2012 వరకు యూపీ సీఎంగా పనిచేశారు. లా చదివి టీచర్‌గా పనిచేస్తున్న సమయంలో కాన్షీరాం పరిచయంతో 1984లో బీఎస్పీలో చేరారు. మొదటి మహిళా సీఎం పేరు మీదున్న ఢిల్లీలోని సుచేతా కృపలానీ హాస్పిటల్లో 1956లో మాయావతి జన్మించారు. మొదటి ముస్లిం సీఎం.. అన్వరా తైమూర్ 1936లో జన్మించిన అన్వరా.. అసోం మొదటి మహిళా ముఖ్యమంత్రి, తొలి ముస్లిం మహిళా ముఖ్యమంత్రి. డిసెంబర్ 1980 నుంచి జూన్ 1981 వరకు సీఎంగా పనిచేశారు. అంతకుముందు, ఆ తరువాత అసోంలో రాష్ట్రపతి పాలన విధించారు. 1972, 78, 83, 91లలో అసోం అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1988లో రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు. స్వాతంత్య్రోద్యమ తార.. సుచేతా స్వతంత్ర భారతదేశ చరిత్రలో తొలి మహిళా సీఎం సుచేత కృపలానీ. ఈమె హర్యానాలోని అంబా లాలో బెంగాలీ కుటుంబంలో 1908, జూన్ 25న జన్మించారు. కాంగ్రెస్ సోష లిస్ట్ నేత ఆచార్య జేబీ కృపలానీని పెళ్లి చేసుకున్నారు. 1962లో ఉత్తర ప్రదేశ్ విధాన సభకు ఎన్నికై, 1963 నుంచి 1967 వరకు ఆ రాష్ర్ట సీఎంగా బాధ్యతలు చేపట్టారు. పురచ్చితలైవి.. జయలలిత పురచ్చితలైవిగా అభిమానులు పిలుచుకునే జయలలిత 1948లో జన్మించారు. తమిళ రాజకీయాల్లో మూడు దశాబ్దాలుగా కీలకంగా ఉన్నారు. ఎంజీఆర్ మరణానంతరం, ఆయన రాజకీ య వారసురాలిగా ప్రకటించుకు ని, అన్నాడీఎంకేపై పట్టు సాధించా రు. రాజకీయాలకు ముందు తెలు గు, తమిళ, కన్నడలో దాదాపు 140 సినిమాల్లో హీరోయిన్గా చేశారు. ఫైర్‌బ్రాండ్.. మమత మమతాబెనర్జీ.. 34 ఏళ్ల లెఫ్ట్‌ఫ్రంట్ ప్రభుత్వానికి చరమగీతం పాడి.. 2011లో పశ్చిమబెంగాల్ సీఎం పీఠాన్ని అధిష్టించారు. 1984 లోక్‌సభ ఎన్నికల్లో మార్క్సి స్టు యోధుడు సోమనాథ్ చటర్జీని ఓడించి చరిత్ర సృష్టించారు. కాంగ్రెస్ నుంచి విడిపోయి 1997లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి జాతీయ రాజకీయాల్లో కీలక శక్తిగా ఎదిగారు. బీజేపీ వాణి.. సుష్మాస్వరాజ్ 1952లో హర్యా నాలో జన్మించిన సుష్మ.. లా చదివి సుప్రీంకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. జనతా పార్టీలో చేరి ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడారు. 1998 అక్టోబర్ నుంచి 1998 డిసెంబరు దాకా ఢిల్లీ సీఎంగా పనిచేశారు. ప్రస్తుతం లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. జానకి రామచంద్రన్ తమిళనాడు మొదటి మహిళా సీఎం. 1923లో కేరళలో జన్మించారు. హీరోయిన్గా పలు సినిమాల్లో ఎంజీ రామచంద్రన్‌తో కలిసి నటించి, అనంతరం ఆయననే పెళ్లి చేసుకున్నారు. 1987లో ఎంజీఆర్ మరణానంతరం తమిళనాడు సీఎం అయ్యారు. రబ్రీదేవి వైఫ్ ఆఫ్ లాలు ప్రసాద్ బీహార్ సీఎంగా 1997-2005 మధ్య ఎనిమిదేళ్లపాటు పనిచేశారు. దాణా కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటూ లాలూ ప్రసాద్ సీఎం పదవికి రాజీనామా చేసి తన భార్య రబ్రీదేవిని ఆ పదవిలో కూర్చోబెట్టారు. రాజీందర్ కౌర్ భట్టల్ కాంగ్రెస్‌కు చెందిన రాజీందర్ పంజాబ్ తొలి మహిళా ముఖ్యమంత్రి. హర్చరణ్ సింగ్ బ్రార్ రాజీనామా తర్వాత 1996 ఏప్రిల్ నుంచి 1997 ఫిబ్రవరి దాకా పంజాబ్ సీఎంగా ఉన్నారు.