
నల్ల బెలూన్లతో మహిళల నిరసన
పాలకొల్లు సెంట్రల్: మహిళల పట్ల దౌర్జన్యం, వారిని అగౌరవ పరచడం టీడీపీ నేతలకు వెన్నతో పెట్టిన విద్యలా ఉందని వైఎస్సార్ సీపీ మహిళా నేతలు మండిపడ్డారు. అమరావతి రైతుల పాదయాత్రపై ప్రశ్నించిన మహిళ పట్ల పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు దురుసుగా ప్రవర్తించడాన్ని నిరసిస్తూ పట్టణంలోని గాంధీ బొమ్మల సెంటర్ వద్ద సోమవారం వారు నల్ల బెలూన్లతో ధర్నా నిర్వహించారు. ఎమ్మెల్యే ఫ్లెక్సీని దహనం చేశారు.
వైఎస్సార్ సీపీ మహిళా నేతలు మాట్లాడుతూ మహిళ పట్ల దురుసుగా ప్రవర్తించిన ఎమ్మెల్యే రామానాయుడు తన పదవికి రాజీమానా చేసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. యలమంచిలి ఎంపీపీ రావూరి వెంకటరమణ, సర్పంచ్‌లు దిడ్ల మణివజ్రం, కడలి నాగమణి, మాజీ కౌన్సిలర్‌లు పాల్గొన్నారు.