స్మృతి ఇరానీ: టీవీ నటిగా మంచి పేరు తెచ్చుకున్న ఈమె బీజేపీ తరఫున అమేథీలో రాహుల్‌గాంధీపై పోటీ చేసి ఓడిపోయారు. పరాజయం పాలైనా రాహుల్ మెజారిటీని గణనీయంగా తగ్గించి కమలనాథుల చేత శభాష్ అనిపించుకున్నారు. ఢిల్లీలో జన్మించిన స్మృతి.. విద్యాభ్యాసం కూడా అక్కడే పూర్తిచేశారు. తర్వాత ముంబైకి మారారు. ‘సాస్ భీ కభీ బహూ థీ’ సీరియల్‌లో నటించి మంచి గుర్తింపు పొందారు. బీజేపీ మహిళా విభాగానికి జాతీయ అధ్యక్షురాలిగా పనిచేశారు. వ్యాపారవేత్త జుబిన్ ఇరానీని పెళ్లాడిన ఈమెకు ఒక కొడుకు, ఒక కూతురు. 2004 ఎన్నికల్లో ఢిల్లీలోని చాందినీ చౌక్ నుంచి బీజేపీ తరఫున బరిలో నిలిచి కాంగ్రెస్ నేత కపిల్ సిబల్‌పై ఓడిపోయారు.
నజ్మా హెప్తుల్లా:
మోడీ కేబినెట్‌లో ఏకైక ముస్లిం నాయకురాలు. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ కుటుంబానికి చెందిన హెప్తుల్లా.. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జన్మించారు. 2004లో కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. అంతకుముందు కాంగ్రెస్ తరఫున రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. 1986-2012 మధ్య రాజ్యసభకు ఏకంగా ఐదుసార్లు ఎంపికయ్యారు. 1985లో ఏడాదిపాటు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా పనిచేశారు.
మేనకా గాంధీ:
జంతు హక్కుల కార్యకర్త మేనకా గాంధీకి మరోమారు కేంద్ర మంత్రివర్గంలో చోటుదక్కింది. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వంలో గాంధీ కుటుంబానికి చెందిన ఏకైక సభ్యురాలు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ చిన్న కోడలు, ఏడు సార్లు ఎంపీ అరుున మేనకా సంజయ్ గాంధీ గత ఎన్డీయే ప్రభుత్వ (వాజ్‌పేరుు) హయూంలో దేశంలోనే మొట్టమొదటి జంతు సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు.
ఉమాభారతి:
బీజేపీలో ఉన్నా, మరోచోట ఉన్నా కరడుగట్టిన హిందూవాదిగా, ఫైర్‌బ్రాండ్ నేతగానే వార్తల్లో ఉంటారు. యూభై ఐదేళ్ల ఉమాభారతి ఎన్డీయే ప్రభుత్వంలో మంత్రిగా చేరడం ఇది రెండోసారి. ‘సాధ్వి’గా ప్రాచుర్యం పొందిన ఈమె మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు.1959 మే 3న మధ్యప్రదేశ్‌లోని తికంఘర్‌లో జన్మించారు.
మోడీ కేబినెట్‌లో మహిళా మంత్రులు
Published Tue, May 27 2014 1:45 AM | Last Updated on Mon, Oct 22 2018 2:09 PM
Advertisement
Advertisement