సాక్షి, హైదరాబాద్: ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఢిల్లీలో తేల్చుకొస్తామని వెళ్లి ఉత్త చేతులతో వచ్చిన రాష్ట్ర మంత్రులకు చీరలు, గాజులు, పసుపు, కుంకుమ, బొట్టు బిళ్లలు పంపుతున్నట్టు మహిళా కాంగ్రెస్ నేతలు వెల్లడించారు. శనివారం గాంధీ భవన్‌లో టీపీసీసీ అధికార ప్రతినిధులు కల్వ సుజాత, రవళిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర మంత్రులను ఆడవారితో పోల్చడమంటే తమకే అవమానంగా ఉందన్నారు.
అయినా పీసీసీ అధ్యక్షుడి ఆదేశాలతో వారికి చీరలు, గాజులు పంపుతున్నామని చెప్పారు. ఢిల్లీలో అగ్గి పుట్టిస్తామని వెళ్లిన మంత్రులు వారం రోజులు అక్కడే ఉండి ఏం చేశారని ప్రశ్నించారు. పార్లమెంటు సమావేశాల్లో కూడా ఈ అంశంపై సరిగ్గా పోరాడలేక టీఆర్‌ఎస్ చేతులెత్తేసిందన్నారు. కనీసం కేంద్ర మంత్రుల అపాయింట్‌మెంట్లు కూడా వారికి కష్టమయ్యాయని ఎద్దేవా చేశారు. చేతకాని రాష్ట్ర మంత్రులు రాజీనామా చేసి, చీర, గాజులు వేసుకుని ఇంట్లో కూర్చోవాలని సుజాత, రవళి రెడ్డి వ్యాఖ్యానించారు.
(చదవండి: Hyderabad: న్యూఇయర్ వేడుకలు.. లిక్కర్ టార్గెట్‌పై ఒమిక్రాన్ ఎఫెక్ట్ )
Comments
Please login to add a commentAdd a comment