తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం ఎన్టీయార్ ట్రస్ట్ భవన్ ముందు ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ధర్నా చేశారు.
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం ఎన్టీయార్ ట్రస్ట్ భవన్ ముందు ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ధర్నా చేశారు. ఎస్సీ వర్గీకరణకు తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు పలువురు ఎమ్మార్పీఎస్ కార్యకర్తలను అరెస్ట్ చేశారు.
నిజమాబాద్లో జిల్లా టీడీపీ సమావేశం సందర్భంగా శనివారం ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ధర్నా చేపట్టడం ఉద్రిక్తతకు దారితీసిన సంగతి తెలిసిందే. టీడీపీ నాయకుల వైఖరికి నిరసనగా నిజమాబాద్ జిల్లాల్లో బోధన్, నబీపేట్లో ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.