
పత్తికొండ టౌన్: టీడీపీ, బీజేపీ మోసాలను ఎండగడుతూ ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడేందుకు ఈనెల 25న రాష్ట్రంలో కోటి మందితో మానవహారం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు విద్యార్థి యువజన సంఘాల జేఏసీ జిల్లా కన్వీనర్ శ్రీరాములు, కోకన్వీనర్ కారుమంచి తెలిపారు. మానవహారం జయప్రదం చేయాలని కోరుతూ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న జీపు జాతా గురువారం పత్తికొండకు చేరుకుంది. స్థానిక నాలుగుస్తంభాల మంటపం వద్ద వారు మాట్లాడుతూ నాలుగేళ్లుగా బీజేపీ, టీడీపీ కలసి విభజన హామీలు అమలు చేయకుండా రాష్ట్రానికి అన్యాయం చేశాయన్నారు.
అన్ని వర్గాల ప్రజలు చైతన్యమై, ఏకతాటిపై వచ్చి ఏపీకి ప్రత్యేకహోదా, విభజన హామీల అమలు కోసం పోరాడాలన్నారు. కార్యక్రమంలో జేఏసీ జిల్లా అధ్యక్షుడు సురేంద్ర, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ధనుంజయ, జిల్లా నాయకులు విజయేంద్ర, రాజు, ప్రతాప్, పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి రవితేజ, ఏఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు హనుమేశ్, స్థానిక నాయకులు ఉపేంద్ర, రాజు, ప్రభాకర్, సురేంద్ర, సీపీఐ మండల కార్యదర్శి కడవల సుధాకర్, పట్టణ కార్యదర్శి సురేంద్ర, రైతుసంఘం నియోజకవర్గ అధ్యక్ష, కార్యదర్శులు పెద్ద వీరన్న, రాజాసాహెబ్ పాల్గొన్నారు.
మాట్లాడుతున్న ఏఐఎస్‌ఎఫ్
జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీరాములు