టీడీపీకి వ్యతిరేకంగా బీజేపీ భారీ ర్యాలీ | BJP protest against TDP in Guntur | Sakshi
Sakshi News home page

టీడీపీకి వ్యతిరేకంగా బీజేపీ భారీ ర్యాలీ

Published Tue, Feb 6 2018 5:54 PM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM

BJP protest against TDP in Guntur - Sakshi

గుంటూరులో బీజేపీ ర్యాలీ

సాక్షి, గుంటూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు గురించి వాస్తవాలు మాట్లాడితే ఎదురుదాడి చేస్తారా?, ప్రశ్నిస్తే సహించలేరా?, మిత్రధర్మం అంటే ఇదేనా? అని టీడీపీని బీజేపీ నాయకులు ప్రశ్నించారు. టీడీపీకి వ్యతిరేకంగా గుంటూరులో బీజేపీ నాయకులు, కార్యకర్తలు మంగళవారం భారీ ప్రదర్శన నిర్వహించారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజుపై టీడీపీ నాయకులు చేసిన విమర్శలను ఖండించారు. టీడీపీ వైఖరికి నిరసగా ప్లకార్డులు ప్రదర్శించారు.

కాగా, చంద్రబాబు అవినీతిలో కూరుకుపోయారని వీర్రాజు ఆరోపించడంతో ఆయనపై టీడీపీ నాయకులు ఎదురుదాడికి దిగారు. మా పార్టీ మద్దతుతో ఎమ్మెల్సీగా గెలిచి మమ్మల్నే విమర్శిస్తావా అంటూ ఆందోళనలు చేస్తున్నారు. సీఎం చంద్రబాబుపై విమర్శలు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. సోమవారం విజయవాడలోని టీడీపీ జిల్లా కార్యాలయం ఎదురుగా సోము వీర్రాజు ఫ్లెక్సీని మహిళల చేత చెప్పులతో కొట్టించిన అనంతరం దహనం చేశారు.

కాగా, తనను ఇబ్బంది పెట్టేందుకు కొన్ని దుష్టశక్తులు పనిచేస్తున్నాయని సోము వీర్రాజు ఆరోపించారు. ఏపీలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చిస్తున్న నిధులన్నీ కేంద్రం ఇచ్చినవేనని, అలాంటప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ ఫొటో ఎందుకు పెట్టడం లేదని ఆయన ప్రశ్నించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement