'ఆంధ్రాలో టీడీపీ సర్కారును గద్దె దింపుతాం' | manda krishna madiga warns tdp sarkar | Sakshi
Sakshi News home page

'ఆంధ్రాలో టీడీపీ సర్కారును గద్దె దింపుతాం'

Published Sun, Dec 28 2014 6:38 PM | Last Updated on Fri, Aug 10 2018 8:13 PM

'ఆంధ్రాలో టీడీపీ సర్కారును గద్దె దింపుతాం' - Sakshi

'ఆంధ్రాలో టీడీపీ సర్కారును గద్దె దింపుతాం'

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపుతామని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హెచ్చరించారు. ఎస్సీవర్గీకరణ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని మండిపడ్డారు. ఆదివారం మంగళగిరిలో జరిగిన ఎమ్మార్పీఎస్ జాతీయ కార్యవర్గం సమావేశంలో మందకృష్ణ మాదిగ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో టీడీపీని భూస్థాపితం చేయడంతోపాటు, ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ సర్కారును గద్దె దింపుతామన్నారు.

ఈ రోజు ఎమ్మార్పీఎస్ కార్యకర్తులు పలుచోట్ల ధర్నా చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం ఎన్టీయార్ ట్రస్ట్ భవన్ ముందు ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు నిరసన కార్యక్రమం చేపట్టారు ఎస్సీ వర్గీకరణకు తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తూ వారు ఆందోళన బాటపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement